Locations: Krishna

  • ప్రతి ఒక్కరికి సముచిత స్థానం: గుడివాడ ఎమ్మెల్యే

    కృష్ణా: కూటమి విజయానికి పాటు పడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు పీఎసీఎస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కమిటీ ఛైర్మన్‌గా చంద్రశేఖర్, డైరెక్టర్లుగా మురళి నాంచారయ్య, అబ్దుల్ జమీల్ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు.

  • అంకితభావంతో పనిచేయాలి: మంత్రి కొలుసు

    ఏలూరు: ఆగిరిపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ ఛైర్‌పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త ఛైర్‌పర్సన్ పల్లగాని గంగాధర్‌కు శుభాకాంక్షలు తెలిపి, ప్రజా సేవలో అంకితభావంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • ఆగిరిపల్లిలో నూతన సచివాలయం ప్రారంభం

    ఏలూరు: ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.42 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

     

  • కృష్ణవరంలో జనసేన జెండా దిమ్మ ఆవిష్కరణ

    ఏలూరు: ఆగిరిపల్లి మండలం కృష్ణవరంలో జనసేన పార్టీ నూతన జెండా దిమ్మను గన్నవరం జనసేన నాయకుడు అన్నదానం ప్రభువు అడపా దేవులు బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఐక్యతతో ఎన్నికల్లో అఖండ విజయం సాధించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీలను వేగంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

     

  • బార్ నిర్వహణ లైసెన్స్‌కు..26వ లాస్ట్

    ఏలూరు: నూజివీడు పట్టణానికి మొత్తం నాలుగు బార్‌లను మంజూరు చేసినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య తెలిపారు. వాటి లైనెస్స్‌లను లాటరీ పద్ధతిలో డ్రా వేయనున్నామని, ఆసక్తి ఉన్నవారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో నాన్ రెఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ.5లక్షలు చెల్లించి, దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.

     

  • రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్‌పై ఏపీ సర్కార్ సీరియస్

    రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్‌పై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పెరోల్‌పై విడుదలైన శ్రీకాంత్ ఒక ఎమ్మెల్యేను కలిసినట్లు వచ్చిన సమాచారంపై సీఎం కార్యాలయం (సీఎంవో) సీరియస్ అయింది. శ్రీకాంత్ దందాలపై హోం శాఖను నివేదిక కోరింది. అలాగే, శ్రీకాంత్‌కు పెరోల్ ఇచ్చినవారిపై కూడా సీఎంవో ఆరా తీస్తోంది. ఇప్పటికే హోంమంత్రి శ్రీకాంత్ పెరోల్‌పై నెల్లూరు జిల్లా అధికారులు, జైళ్ల శాఖ డీజీతో మాట్లాడారు.

  • పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌కు పోటెత్తిన మహిళలు

    విజయవాడ: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి విశేష స్పందన లభిస్తోంది. వారాంతపు సెలవులు ముగియడంతో ఆదివారం బస్టాండ్లన్నీ కిటకిటలాడాయి. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో బస్సులు ఎక్కడానికి మహిళలు పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే విజయవాడ సిటీ బస్సుల్లో 80శాతం ఆక్యుపెన్సీ నమోదైందైనట్లు జిల్లా ఆర్టీసీ అధికారి ఏలూరి సత్యనారాయణమూర్తి తెలిపారు.

  • ‘తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లిన వ్యక్తి కూడా మనపై మాట్లాడతారా?’: మంత్రి సంధ్యారాణి

    గుంటూరు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ విమర్శలు చేయడం అర్థరహితమని మంత్రి సంధ్యారాణి అన్నారు. అమరావతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..అసహనంతోనే వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లు ప్రజలంతా గమనించారన్నారు. ‘‘తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లిన వ్యక్తి కూడా మనపై మాట్లాడతారా? సీఎంగా పని చేసిన వ్యక్తి.. జాతీయ జెండా కూడా ఎగురవేయలేని స్థితిలో ఉన్నారా? భరతమాత అంటే జగన్‌కు గౌరవం లేదు.

  • మేకావారిపాలెం సొసైటీ ఛైర్ పర్సన్‌గా వంశీకృష్ణ

    కృష్ణా: చల్లపల్లి మండలం మేకావారిపాలెం సొసైటీ ఛైర్ పర్సన్‌గా గుత్తికొండ వంశీకృష్ణ, పర్సన్‌లుగా వక్కలగడ్డ శివరామకృష్ణ, చిటికినేని శ్రీనివాసరావులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ వంశీ, పర్సన్‌లను సన్మానించారు.

     

  • ‘కానూరు-మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోండి’

    ఎన్టీఆర్: విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు–మచిలీపట్నం నడుమ 6లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు. న్యూఢిల్లీలో కేంద్రమంత్రితో మంత్రి భేటీ అయ్యారు.