Locations: Krishna

  • నందిగామలో యాంకర్‌ అనసూయ సందడి.. స్టెప్పులేసి మరీ..

    ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సినీనటి, యాంకర్‌ అనసూయ సందడి చేశారు. జీవీ మాల్‌ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. స్టెప్పు లేసి ఆమె అభిమానులను అలరించారు.

  • విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ట్రాఫిక్‌జామ్‌.. 3 కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ

    విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై 3కిలోమీటర్ల వాహనాలు బారులు తీరాయి. వరస సెలవులు రావడంతో సొంతూర్ల బాట పట్టిన ప్రజలు.. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈనేపథ్యంలోనే నల్గొండ జిల్లా పెద్ద కాపర్తి నుంచి చిట్యాల వరకు భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాలను దారి మళ్లించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు.

  • వివాహేతర సంబంధం.. పేరకలపాడులో వివాహిత ఆత్మహత్య

    ఎన్టీఆర్: కంచికచర్ల PS పరిధిలోని పేరకలపాడుకు చెందిన వివాహిత భవాని సంజీవనగర్ కాలనీకి చెందిన ప్రకాశరావుతో వివాహేతర సంబంధం పెట్టకుంది. ఈవిషయం ఆమె భర్త రాజశేఖర్‌కు తెలిసి గతనెల రోజుల నుంచి వేరువేరుగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో 16వతేదీ రాత్రి ఇద్దరి మధ్య జరిగి మనస్పర్థల కారంణగా భవాని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి మేనత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

     

  • ఆసుపత్రిని పాలి క్లినిక్‌గా మార్చాలని వినతి!

    కృష్ణా: మచిలీపట్నం ప్రభుత్వ పశువుల ఆసుపత్రిని పాలి క్లినిక్‌గా మార్చి తద్వారా శస్త్ర చికిత్సలను అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ బాలాజీకి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్రమణ్యం వినతిపత్రం సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. మూగజీవాల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో సేవలు అంతంతమాత్రంగా ఉండడం సిగ్గుచేటన్నారు. సిబ్బంది, మందుల కొరతతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు.

     

  • లాటరీ ద్వారీ మద్యం షాపుల కేటాయింపు

    కృష్ణా జిల్లాలోని బీసీ గౌడ, గౌడ్ కులాల సంబంధించిన వారికి 4 బార్ షాప్‌లను కలెక్టర్ బాలాజీ లాటరీ తీసి కేటాయించారు. మచిలీపట్నం, గుడివాడ, తాడిగడప-1, తాడిగడప-2 ప్రాంతాలకు సంబంధించిన బార్‌లకు లాటరీ ద్వారా కేటాయింపు జరిగింది. లాటరీ పద్ధతిలో 3 బార్లు గౌడ కులానికి కేటాయించారు.

     

  • పాపన్న విగ్రహావిష్కరణలో హీరో సుమన్

    ఎన్టీఆర్: తిరువూరు బైపాస్ రోడ్డులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలసి ప్రముఖ నటుడు సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించటం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కొలికపూడి చొరవతో ఈ విగ్రహం రూపు దాల్చిందని, ఆయన కృషితోనే నేడు విగ్రహావిష్కరణకు నోచుకుందని హీరో సుమన్ అన్నాడు.

     

  • విద్యార్థులకు ఈగల్ టీమ్ సూచనలు

    ఎన్టీఆర్: నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ ఈగల్ టీమ్ జగ్గయ్యపేట తపోవన్ విద్యాలయంలోని విద్యార్థులకు డ్రగ్స్ అవేర్నెస్, గుడ్ టచ్- బ్యాడ్ టచ్‌ల వివరించారు. అంతే కాకుండా శక్తి యాప్ గురించి వివరించారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

  • రైతులకు అత్యుత్తమ సేవలందించడమే లక్ష్యం

    ఎన్టీఆర్: జి.కొండూరు మండలం వెలగలేరు పీఏసీఎస్ ఛైర్మన్‌గా మంచినేని రాజశేఖర్, కమిటీ సభ్యులుగా నాగేశ్వరరావు, బాబూరావు సోమవారం సొసైటీలో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని త్రిసభ్య కమిటీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం సొసైటీల ద్వారా అత్యుత్తమ సేవలను అందించాలని త్రిసభ్య కమిటీకి ఎమ్మెల్యే సూచించారు. అనంతరం సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

  • ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

    కృష్ణా: మచిలీపట్నంలో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మచిలీపట్నంలో ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు, అభిమానులకు ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. అభిమానులు మీడియాతో మాట్లాడుతూ..ఓప్రజాప్రతినిధిగా ఉన్న దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

  • మృతుడి కుటుంబానికి జనసేన అండగా..!

    కృష్ణా: మచిలీపట్నంలో ఆకస్మికంగా మృతి చెందిన ఎన్నేటి ఆనంద వర్మ కుటుంబానికి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్, డీసీఎంఎస్ ఛైర్మన్ ఆర్థికంగా అండగా నిలిచారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో మృతుడి భార్య సునీతకు రూ.10వేలు అందించారు. ముగ్గురు ఆడపిల్లల చదువులకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.