Locations: Krishna

  • రైతు సంక్షేమానికి కృషి చేయండి: వర్ల

    కృష్ణా: పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో పీఏసీఎస్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకారోత్సం జరిగింది. కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా పీఏసీఎస్ కమిటీ సభ్యులు రైతులకు అండగా ఉంటూ..వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు.

     

  • రైతుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా..!

    ఎన్టీఆర్: రైతుల శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా పీఏసీఎస్ త్రిసభ్య కమిటీలు కృషి చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి పీఏసీఎస్ ఛైర్మన్‌గా చెరుకూరి రామకృష్ణ, కమిటీ సభ్యులుగా రామకృష్ణ, సాంబశివరావు సోమవారం సొసైటీలో బాధ్యతలు స్వీకరించారు. వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. త్రిసభ్య కమిటీసభ్యులు పారదర్శక సేవలందింస్తూ.. రైతుల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

     

     

  • మాయమాటలు చెప్పి.. రోడ్ల మరమ్మతులు మరిచి!

    ఏలూరు: మండవల్లి మండలంలోని పెనుమాక లంక-పెద్దఎడ్లగాడి రోడ్డు దీనస్థితిలో ఉంది. దీంతో ఆప్రాంత ప్రజలు పడవలో ప్రయాణం చేస్తున్నారు. తాజాగా పడవలో ప్రయాణిస్తుంటే ఇంజిన్ రిపేరైన సంగతి తెలిసిందే. రోడ్డుకు మరమ్మతులు చేసే వరకు ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సొస్తుందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా..లంకగ్రామాల రోడ్లకు మోక్షం కలగట్లేదని వాపోతున్నారు. మాయమాటలు తప్ప రోడ్లు బాగుచేసే నాయకుడే లేడని ఆరోపించారు.

  • పడవలో ప్రయాణం.. అరచేతిలో ప్రాణం

    ఏలూరు: భారీ వర్షాల కారణంగా మండవల్లి మండలం పెనుమాకలంక-పెదఎడ్లగాడి రోడ్డు జలమయమైంది. దీంతో ప్రజలు పెనుమాకలంక నుంచి పడవలో ప్రయాణం సాగిస్తుండగా కొంతదూరం వెళ్లిన తర్వాత పడవ ఇంజిన్ రిపేరవడంతో భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ చౌకచక్యంగా వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. పడవలో సుమారు 50మంది ఉన్నట్లు సమాచారం.  వర్షాలు కురుస్తున్నప్పుడు పడవలో ప్రయాణం చేయకూడదని అధికారులు సూచించారు.

  • కొత్త జిల్లాల పేర్ల పైనా ప్రతిపాదనలు!

    AP : పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు అందుతున్నాయి. కృష్ణా జిల్లాకు వంగ‌వీటి రంగా పేరు పెట్టాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.  తిరుపతిని బాలాజీ జిల్లాగా పేరు మార్చాలనే ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పల్నాడుకు జాషువా పేరు పెట్టాలని స్థానికంగా డిమాండ్ ఉంది. ఇక.. బాపట్లకు దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య పేరు పరిశీలించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

  • మున్నేరులో పెరుగుతున్న వరద

    ఎన్టీఆర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మున్నేరులో వరద పెరుగుతోంది. ప్రస్తుతం 31వేల క్యూసెక్కులకుపైగా వరద దిగువకు ప్రవహిస్తోంది. నందిగామ డివిజన్‌లోని మున్నేరు పరిసర లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. వరద ప్రభావం పెరిగే అవకాశముందని అంచనా వేస్తూ, అధికారులు అవాంఛనీయ సంఘటనల నివారణకు చర్యలు చేపట్టాలని నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశించారు.

     

  • పోలీసుల అదుపులో 9మంది.. కోడిపందాలు నిర్వహిస్తూ..!

    కృష్ణా: కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలోని ధర్మా ఎస్టేట్ ప్లాట్స్‌లో కోడిపందాలు నిర్వహిస్తున్న 9 మందిని కంకిపాడు ఎస్సై డి.సందీప్ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.10,270 నగదు, రెండు కోడిపుంజులు, నాలుగు కోడి కత్తులు, ఏడు బైక్‌లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై. వారిపై కేసు నమోదు చేసినట్లు, తదుపరి చర్యలు చేపడుతామని వెల్లడించారు.

  • రైతులకు మెరుగైన సేవలందించాలి: MLA వసంత

    ఎన్టీఆర్: రైతులకు మెరుగైన సేవలందించాలని పీఏసీఎస్ త్రిసభ్య కమిటీకి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సూచించారు.  ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు పీఏసీఎస్ ఛైర్మన్‌గా గరికపాటి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులుగా ఏడుకొండలు, బేబీ సోమవారం సొసైటీలో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత త్రిసభ్య కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కమిటీకి ఎమ్మెల్యే సూచించారు.

     

  • మిస్‌ తిరుపతిగా గమన

    AP : తిరుపతిలో నిర్వహించిన మిస్‌ తిరుపతి అందాల పోటీల్లో వెంకటగిరికి చెందిన చెన్నమనేని గమన విజేతగా నిలిచారు. విజయవాడలోని KL విశ్వవిద్యాలయంలో బీటెక్‌ చదువుతోంది.

  • శ్రీవల్లి.. గురి గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే!

    ఎన్టీఆర్: విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మౌల్య పద్మావతిశ్రీవల్లి మైక్రోఆర్ట్స్‌తో అదరగొడుతోంది. కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలు 190పైగా బియ్యం గింజలపై, రామాయణ ఘట్టల గురించి 15రోజుల్లో 1916బియ్యపు గింజలపై..ఇలా ఎన్నో మైక్రోఆర్ట్స్ తయారు చేసి ఇప్పటివరకు ఇండియా బుక్‌ఆఫ్ రికార్డు, వరల్డ్‌వైడ్ బుక్‌ఆఫ్ రికార్డు, ట్రంప్ బుక్‌ఆఫ్ రికార్డు, మ్యాజిక్ బుక్‌ఆఫ్ రికార్డు సాధించింది. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే తన లక్ష్యమంది.