ఎన్టీఆర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ‘సారధ్యం’ యాత్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు విజయవాడకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తారు. కేబీఎన్ కాలేజీ నెహ్రూబొమ్మ సెంటర్‌వద్ద ఉదయం 10.15 గంటలకు శోభాయాత్రలో పాల్గొంటారు. 11.15 గంటలకు విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు సితారసెంటర్, ఎన్.కన్వెన్షన్ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవసభలో పాల్గొననున్నట్లు సమాచారం.