Locations: Krishna

  • వినాయకుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని చందమామపేట సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన 18 అడుగుల గణనాథుడి విగ్రహం ప్రజల మనస్సులను ఆకట్టుకుంటోంది. శోభాయమానంగా అలంకరించిన మహాగణనాథుడిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించి విశేష పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘గణనాథుడు విద్య, బుద్ధి, ఐశ్వర్యాలను ప్రసాదించే వినాయకుడు. నందిగామలో ఇంత విశాలమైన విగ్రహం ఏర్పాటు చేసి ఉత్సవాలను నిర్వహించడం విశేషం’ అని తెలిపారు.

  • వినాయక నిమజ్జనంలో మారణాయుధాలు!

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం నరసింహారావుపాలెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో కొందరు యువకులు మారణాయుధాలతో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ గ్రామం సమస్యాత్మకమైనదిగా పేరుపొందడంతో, గణపతి నవరాత్రుల సందర్భంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, ఊరేగింపులో మారణాయుధాలు ప్రదర్శించడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

  • గణనాథునికి ప్రత్యేక పూజలు

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాలలో శివాలయ ప్రాంగణంలో శ్రీ శక్తి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని స్థానిక మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోగంటి బాబు సతీ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ గ్రామ అధ్యక్షులు శివ, సొసైటీ ఛైర్మన్ పుల్లారావు, రామారావు, వీరస్వామి, సాయి, సాంబశివరావు, భూపతి, తదితరులు పాల్గొన్నారు.

  • దివ్యాంగులకు త్రిచక్ర మోటారు వాహనాలు

    AP: దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాల (రెట్రోఫిటెడ్‌ మోటారు వాహనాలు) పంపిణీకి సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. విజయవాడకు చెందిన ఆర్‌ఎం మోటార్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ టెండరు దక్కించుకుంది. ఈ సంస్థ ‘హీరో’ కంపెనీ మోటారు వాహనాలను (125 CC) దివ్యాంగులకు అందించనుంది. ఒక్కో వాహనం ఖరీదు రూ.1.07 లక్షలు. వీటిని 100 శాతం రాయితీతో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అందజేయనుంది.

  • బొలెరోను ఢీకొన్న బైక్..స్పాట్‌లోనే..!

    ఎన్టీఆర్: వత్సవాయి మండలం గట్టు భీమవరం పరిధిలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరవరం గ్రామానికి చెందిన దస్తగిరి తన బైక్‌పై వెళ్తూ, ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దస్తగిరి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే

    కృష్ణా: ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. స్వర్గీయ కంచనపల్లి నాగ కుమారి టీచర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో..గుడివాడ ఎన్జీవో హోం ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ..జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సీనియర్ ఉపాధ్యాయులను సత్కరించి, నాగ కుమారి టీచర్ స్మారక జ్ఞాపికలను అందజేశారు.

     

  • రేకుల షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని రైతు బజార్‌లో నూతనంగా నిర్మించిన రేకుల షెడ్డును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఆకుకూరలు విక్రయించే మహిళా చిరు వ్యాపారుల కోసం ఈ షెడ్డును నిర్మించారు. గతంలో వర్షాకాలంలో బురదలో వ్యాపారం చేయడం కష్టంగా ఉండేదని, ఈ నూతన షెడ్డు తమకు చాలా ఉపయోగపడుతుందని వ్యాపారులు తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఇది ముఖ్యమైన అడుగు అని అన్నారు.

  • పెద్దవరం సహకార సొసైటీలో రూ.2 కోట్ల భారీ కుంభకోణం

    ఎన్టీఆర్: నందిగామ మండలం పెద్దవరం సహకార సొసైటీలో రూ.2 కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రైతులు చెల్లించిన రుణాలకు దొంగ బిల్లులు ఇచ్చి సొసైటీ కార్యదర్శి గుణ్ణం ఎల్లారెడ్డి ఈ మొత్తాన్ని స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎల్లారెడ్డి 2014 నుంచి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అధికారులు ఆయనపై విచారణ ప్రారంభించారు. త్వరలో ఆయనను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

  • విద్యార్థి ఎదుగుదలలో టీచర్ పాత్ర కీలకం: GJP

    కృష్ణా: విద్యార్థి ఉన్నతస్థాయికి చేరుకోవడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఉయ్యూరు AG&SG జూనియర్ కాలేజ్ డైరెక్టర్ జీజెేపీ వినయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జూనియర్, డిగ్రీ కాలేజ్‌లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా సీనియర్ అధ్యాపకులు ఆర్‌వీ శివరావుని ప్రిన్సిపల్ డా.శివనాధ్, వినయ్‌కుమార్ ఘనంగా సన్మానించారు. విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకోవడానికి శివరామ్ చేసే కృషిని వారు అభినందించారు. కె.సత్యనారాయణ పాల్గొన్నారు.

  • నందిగామలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ

    ఎన్టీఆర్: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వద్ద నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రవక్త మహమ్మద్ బోధనలు ప్రేమ, కరుణ, సత్యంతో కూడిన జీవన విధానాన్ని అందించాయని అన్నారు. సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందించడానికి ప్రవక్త బోధనలను స్మరించుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణకుమారి ఇతర నాయకులు పాల్గొన్నారు.