కృష్ణా: నిమ్మగడ్డ గ్రామం వద్ద కృష్ణా నదిలో కొట్టుకువచ్చిన గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సుమారు 50 సంవత్సరాల వయసు గల ఈ పురుషుడి శవంపై నీలం రంగు ప్యాంటు, గోధుమ రంగు షర్ట్ ఉన్నాయి. చేతి వేలికి వెంకటేశ్వరస్వామి వెండి ఉంగరం, ఎరుపు రంగు రాయి ఉన్న మరో ఉంగరం ఉన్నాయి. స్థానిక పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Locations: Krishna
-
టీడీపీ నేతపై హత్యాయత్నం..!
కృష్ణా: మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో టీడీపీ కార్యకర్త ఎలమంచిలి సురేష్‌పై అదే గ్రామానికి చెందిన వైసిపీ నాయకులు మైలా శివకుమార్, పీతా నవీన్‌లు హత్యాయత్నం చేశారు. ఈ దాడిని అడ్డుకున్న గ్రామస్తులు సురేష్‌ను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత వారం రోజులుగా నిందితులు సురేష్‌ను చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు తెలిపారు. సురేష్‌ను టీడీపీ నాయకులు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పరామర్శించారు.
-
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
ఎన్టీఆర్: మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నందిగామలోని మక్కా మసీదులో వైసీపీ నాయకులు షేక్ జాఫర్, షేక్ కమాల్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన ప్రజలకు అన్నం వడ్డించి, ముస్లిం సోదరులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ మస్తాన్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
-
‘మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయాలి’
కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమయంలో మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ లేఖ రాశారు. మదనపల్లె జిల్లాకు రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఆయన సూచించారు. అలాగే బద్వేలు జిల్లా ఏర్పాటు చేసి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పేరు పెట్టాలని కోరారు.
-
‘గురువులు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు’
ఎన్టీఆర్: అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శశిధర్ తెలిపారు. ఈ సందర్భంగా సెక్రటరీ కె.రామమోహనరావు మాట్లాడుతూ.. గురువులు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువు స్థానం ముఖ్యమైనదని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి తమ గౌరవాన్ని చాటుకున్నారు.
-
‘యువతను క్రీడలకు దూరం చేస్తున్నారు’
కృష్ణా: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ ఆడేందుకు అధికారులు విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన జరిగింది. స్టేడియంలో క్రికెట్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి ఇవ్వడం దుర్మార్గమని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న విమర్శించారు. యువతను క్రీడలకు దూరం చేస్తున్నారని, దీనివల్ల అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
-
రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్..!
కృష్ణా: కోడూరు మండలం విశ్వనాథపల్లికి చెందిన ప్రముఖ మేస్త్రీ బత్తుల నాగరాజు బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై మరణించాడు. అవనిగడ్డ నుంచి విశ్వనాథపల్లికి వెళ్తున్న సమయంలో రామచంద్రపురం వద్ద ఆయన బైక్ అదుపు తప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
-
ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ..!
ఎన్టీఆర్: మహమ్మద్ ప్రవక్త సూచించిన శాంతి సందేశం సర్వ మానవాళికి ఆదర్శమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి ఆస్థానలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
-
యుద్ధాలు వద్దు.. శాంతి ముద్దు..!
ఎన్టీఆర్: వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీని ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచ శాంతి, మత సామరస్యం వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యుద్ధాలు వద్దని, శాంతి కావాలని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.