Locations: Krishna

  • మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా

    ఎన్టీఆర్: జూపూడిలో జరిగిన పేలుడు సంఘటనలో మృతుడైన గోదా గోపి కుటుంబానికి న్యాయం కోరుతూ కొనయపాలెం గ్రామస్తులు ధర్నా చేపట్టారు. మృతుడి భార్య, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం దారి చూపాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దలు స్పందించాలని బాధితులు కోరారు. న్యాయం కోసం నినాదాలు చేశారు.

  • కన్నుల పండుగగా గణనాథుని నిమజ్జనం

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలోని 23వ వార్డు మంగలి బజార్‌లో టీం ఎంజీబీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమర్జనం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. నిమజ్జనం సందర్భంగా గణనాధుని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. గణపతి ఒప్పా మోరియా నినాదాలతో పరిసర ప్రాంతాలు మారు మోగింది. వేదాద్రిలో గణనాథుని భక్తులు నిమజ్జనం చేశారు.

  • మహిళకు దేవాంగ యూత్ సేవా సమితి భరోసా

    కృష్ణా: పెడన నియోజకవర్గంలోని కప్పలదొడ్డి గ్రామంలో చేనేత కుటుంబానికి చెందిన మరకా శ్రీలక్ష్మికి కాలు ఇన్ఫెక్షన్‌తో వైద్య ఖర్చుల కోసం దేవాంగ యూత్ సేవా సమితి రూ.55వేల సాయం అందజేశారు. దేవాంగ కుల బాంధవులు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సేకరించిన ఈ మొత్తాన్ని ఆదివారం శ్రీలక్ష్మి ఇంటివద్ద అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ యక్కల నాగరాజు, మాజీ సర్పంచ్ కట్ట మునేశ్వరరావు పాల్గొన్నారు.
  • ‘జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు చర్యలు’

    కృష్ణా: జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఆదివారం పామర్రు, గూడూరు మండలాల్లో పర్యటించి, మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో సమీక్ష నిర్వహించారు. వరి సాగు ఆధారంగా అవసరమైన ప్రాంతాలకు ప్రాధాన్యతతో యూరియా సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.

     

  • విజయవాడలో హస్తకళల ప్రదర్శన

    ఎన్టీఆర్: విజయవాడలోని అమ్మ కల్యాణ మండపంలో ఈనెల 8 నుంచి 14 వరకు గాంధీ శిల్ప్ బజార్, లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ హస్తకళల సంస్థ, భారత వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 40 మంది శిల్పులు కలప, తోలుబొమ్మలు, కలంకారి కృతులను ప్రదర్శిస్తారు. రూ.2.5 లక్షల బహుమతులతో పోటీలు, ఉదయం 11 నుండి రాత్రి 9 వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.
  • రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

    కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో సెప్టెంబర్ 8న ఉదయం 10:30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక-మీకోసం కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిల్లో ఫిర్యాదుల స్వీకరణ జరుగుతుందని, ప్రజలు 1100 కాల్ సెంటర్ లేదా meekosam.ap.gov.in ద్వారా అర్జీలు నమోదు చేయవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • ‘పార్టీ కోసం కృషి చేసేవారికి సముచిత స్థానం ఉంటుంది’

    ఎన్టీఆర్: నందిగామలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, జిల్లా వైసీపీ అనుబంధ విభాగాలకు ఎన్నికైన నాయకులను ఘనంగా సత్కరించారు. ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పిల్లి జయరాజు, మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ మున్నా, రైతు విభాగం కార్యదర్శి కందుల బుచ్చిరామయ్య, తదితరులను సన్మానించారు. పార్టీ కోసం కృషి చేసేవారికి సముచిత స్థానం ఉంటుందని, పార్టీ పటిష్టతకు పనిచేయాలని కోరారు.

  • ‘రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’

    ఎన్టీఆర్: వెల్లంకి గ్రామంలో ఎమ్మార్వో రవికుమార్ పర్యటించి, యూరియా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూరియా బస్తా రూ.266కు సొసైటీలో అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యూరియా కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నానో యూరియా (లిక్విడ్) వాడకం లాభాలను రైతులకు వివరించారు.

  • మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన లోకేష్

    చిత్తూరు: కర్ణాటకలోని మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలో ఉన్న శ్రీఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాలభైరవేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతి శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ ఆశీర్వాదం తీసుకున్నారు. మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్, యూనివర్సిటీలను లోకేష్ సందర్శించి, వాటి సేవలను అడిగి తెలుసుకున్నారు.

     

  • ‘అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి’

    ఎన్టీఆర్: నందిగామలో ఈనెల 9న జరిగే ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు, రైతులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు కోరారు. ఎరువుల కేటాయింపులో కూటమి ప్రభుత్వం అవినీతి, యూరియా బ్లాక్ మార్కెట్‌తో రైతులను మోసం చేస్తోందని, రూ.250-300 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. పంటల మద్దతు ధరలు, నష్ట పరిహారాలలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.