ఎన్టీఆర్: వెల్లంకి గ్రామంలో ఎమ్మార్వో రవికుమార్ పర్యటించి, యూరియా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూరియా బస్తా రూ.266కు సొసైటీలో అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యూరియా కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నానో యూరియా (లిక్విడ్) వాడకం లాభాలను రైతులకు వివరించారు.
Locations: Krishna
-
మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన లోకేష్
చిత్తూరు: కర్ణాటకలోని మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలో ఉన్న శ్రీఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాలభైరవేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతి శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ ఆశీర్వాదం తీసుకున్నారు. మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్, యూనివర్సిటీలను లోకేష్ సందర్శించి, వాటి సేవలను అడిగి తెలుసుకున్నారు.
-
‘అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి’
ఎన్టీఆర్: నందిగామలో ఈనెల 9న జరిగే ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు, రైతులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు కోరారు. ఎరువుల కేటాయింపులో కూటమి ప్రభుత్వం అవినీతి, యూరియా బ్లాక్ మార్కెట్‌తో రైతులను మోసం చేస్తోందని, రూ.250-300 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. పంటల మద్దతు ధరలు, నష్ట పరిహారాలలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
-
సమృద్ధిగా ఎరువులున్నాయి.. ఆందోళన అనవసరం: కలెక్టర్
ఎన్టీఆర్: జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆదివారం విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లో పర్యటించి రైతులతో ముచ్చటించారు. యూరియా, ఎరువుల సరఫరా స్థితిగతులను పరిశీలించి, ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణతో ఎరువులను అందుబాటులో ఉంచుతుందని భరోసా కల్పించారు. అగ్రికల్చర్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. సమృద్ధిగా ఎరువులున్నాయి.. ఆందోళన అనవసరం అని కలెక్టర్ తెలిపారు.
-
ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంటలు, విద్యుత్ సరఫరా నిలిపివేత
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలోని పాత హైస్కూల్ వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన లైన్‌మెన్ విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేశారు. దాదాపు రెండు గంటలపాటు విద్యుత్ అంతరాయంతో మూగ ఎండలో ప్రజలు ఉక్కపోతతో అల్లాడారు. విద్యుత్ అధికారులు మరమ్మతు పనులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు.
-
విజయవాడ ఉత్సవ్‌లో సినీ ప్రముఖుల సందడి
ఎన్టీఆర్: విజయవాడలోని పోరంకి మురళి రిసార్ట్స్‌లో ఆదివారం విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు, సాహిత్య చర్చలతో ఉత్సవం సామాజిక సామరస్యాన్ని పెంపొందించింది. కార్యక్రమంలో సినీ ప్రముఖులు బెల్లంకొండ శ్రీనివాస్, నటి అనుమప పరమేశ్వరన్,సంయుక్త మీనన్, దివి పాల్గొన్నారు.
-
వారికి ధన్యవాదాలు తెలిపిన వేమా కిషోర్
ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులుగా వేమా కిషోర్ బాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ ఎంపీ కేశినేని శివానాధ్(చిన్ని)కి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా మహేశ్వరకి, ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకి, కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షులు, AMC ఛైర్మన్ కోగంటి బాబుకి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
-
యూరియా స్థితిగతులపై సమీక్ష
కృష్ణా: గూడూరు మండలం ఆకులమన్నాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ రికార్డులను పరిశీలించారు. రైతులతో యూరియా స్థితిగతులపై చర్చించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
-
ఇంటిని ఆక్రమించి వ్యక్తిపై దాడి.. బాధితుడు ఆత్మహత్యాయత్నం
కృష్ణా: మోపిదేవిలో ఎస్సీల ఇంటిని ఆక్రమించి దాడి చేసిన ఘటన దారుణంగా మారింది. ఇంటి ఆక్రమణ వివాదంలో ఒక వర్గానికి కొమ్ముకాసిన పోలీసుల నిర్లక్ష్యం కారణంగా బాధితుడు నిస్సహాయతతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
-
‘హిందూ మనోభావాలను దెబ్బతీస్తే కఠినంగా శిక్షించాలి’
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విగ్నేశ్వరుని శోభాయాత్రలో జరిగిన దాడిని నందిగామ జనసేన సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి తీవ్రంగా ఖండించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి సానుభూతి తెలిపి, జనసైనికులు క్షతగాత్రులకు అండగా నిలవాలని ఆమె కోరారు.