Locations: Krishna

  • ‘తాగుబోతు భర్తలతో ఇబ్బందిపడే మహిళలకు చేయూతనివ్వాలి’

    ఎన్టీఆర్: కొండపల్లిలోని ఐద్వా కార్యాలయంలో జరిగిన పట్టణ మహాసభలో, ఐద్వా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె. శ్రీదేవి మాట్లాడుతూ, మహిళలకు ఉపాధి, గృహ వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం వ్యసనంతో బాధపడుతున్న భర్తలతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఆర్థిక చేయూతనివ్వాలని ఆమె కోరారు. అలాగే, మహిళల భద్రత, సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉద్ఘాటించారు. ఈ సమావేశానికి ఐద్వా పట్టణ అధ్యక్షురాలు ఎల్.పార్వతి అధ్యక్షత వహించారు.

  • చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫైర్

    కృష్ణా: వ్యవసాయానికి బదులు పాడి గేదెలు కొనుగోలు చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మండిపడ్డారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మచిలీపట్నంలో అన్నదాత పోరు గోడపత్రికలను పేర్ని కిట్టి, రాముతో కలిసి విడుదల చేశారు. ఈ నెల 9న రైతుల సమస్యలపై ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వివరిస్తామని చెప్పారు.

  • కంచికచర్లలో భారీ అన్నదానం

    ఎన్టీఆర్: కంచికచర్లలో వాణిజ్య గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. కంచికచర్ల యార్డ్ ఛైర్మన్ కోగంటి బాబు, నందిగామ గ్రామీణ సీఐ డి. చవాన్, ఎస్సై విశ్వనాధ్ లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు వారు గణపతికి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని, గణనాథుని దర్శించుకున్నారు.

     

  • బంటుమిల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

    కృష్ణా: బంటుమిల్లి మండలం మణిమేశ్వరంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.43.60 లక్షల విలువ గల గ్రామ పంచాయతీ భవనం, రూ.23.94 లక్షల రైతు సేవా కేంద్రం, 60 KL సంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమరావతి, పోలవరం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

  • జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం: కలెక్టర్

    కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని రైతులలో నమ్మకం పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి యూరియా సరఫరాపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

  • అక్రమ మైనింగ్‌పై కొరడా!

    ఎన్టీఆర్: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్వారీలు, క్రషర్లపై మైనింగ్ శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల్లో 2రోజులుగా మైనింగ్ శాఖ దాడులు నిర్వహించారు. దీంతో మైనింగ్ ఏడీ వీరా స్వామి, రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ బాబూరావు బృందం సాయికృష్ణా ఎంటర్ప్రైజెస్ క్రషర్లో తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేని క్రమంలో క్రషర్‌ను సీజ్ చేశారు.

  • ‘బూడిద లోడింగ్ నిలిపివేయాలి’

    ఎన్టీఆర్: వీటీపీఎస్ యాజమాన్యం బూడిద కాంట్రాక్టును పెద్ద సంస్థలకు అప్పగించడాన్ని నిరసిస్తూ స్థానిక లారీ ఓనర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు బూడిద చెరువు వద్దకు చేరుకున్నారు. బూడిదకు డిమాండ్ లేనప్పుడు ఉచితంగా తరలించాలని వేడుకున్న యాజమాన్యం, ఇప్పుడు తమను రోడ్డున పడేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులను విస్మరించి, బడా సంస్థలకే కాంట్రాక్టులు ఇవ్వడం అన్యాయమని వారు వీటీపీఎస్ యాజమాన్యాన్ని నిలదీశారు.

  • పరిటాలలో రైతులకు యూరియా సరఫరా

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల సొసైటీలో రైతులకు పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో యూరియా సరఫరా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మండలంలో 70 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని మండల వ్యవసాయ అధికారి పేర్కొన్నారు. రైతులు అపోహలకు గురికాకుండా,అధికారుల సలహాలతో తక్కువ ఖర్చుతో పంటలు పండించుకోవాలన్నారు.

  • మహిళలు రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే

    కృష్ణా: మహిళలు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీ నాటక అకాడమీ డైరెక్టరుగా ఇటీవల నియమితురాలైన చల్లపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వప్న దంపతులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. కార్యక్రమంలో ఘంటసాల ఏఎంసీ ఛైర్మన్ కనకదుర్గ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్, మాజీ వైస్ ఎంపీపీ నాగమణి, స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

  • భక్తులకు ముఖ్య గమనిక.. దుర్గమ్మ గుడి మూసివేత

    AP : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ‘కవాట బంధనం’తో ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయబడుతుందన్నారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున 3:00 గంటల నుంచి ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 8:30 గంటల నుంచి భక్తులకు అన్ని రకాల దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయి.