ఎన్టీఆర్: జగ్గయ్యపేటలోని గోపాలకృష్ణ సొసైటీలో రైతులకు పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో యూరియా సరఫరా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఎరువుల సరఫరాపై జాయింట్ మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోందని, ప్రస్తుతం 3000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు.
Locations: Krishna
-
జలధీశ్వర స్వామి సేవలో వేద పాఠశాల ఉపకులపతి
కృష్ణా: తాడేపల్లిలో ప్రారంభం కానున్న వేద పాఠశాలకు ఆశీస్సులు కోరుతూ తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి కృష్ణమూర్తి, డైరెక్టర్ ఆఫ్ స్టడీస్ రంజన్ ఝూ ఘంటశాలలోని జలధీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, కృష్ణాజిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ వారిని సత్కరించారు. వారితోపాటు వేద పాఠశాల నిర్వాహకులు కోదండరామయ్య, వెంకటేశ్వరరావులు ఉన్నారు.
-
శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగాలి: ఎమ్మెల్యే
కృష్ణా: అమ్మలు గన్న అమ్మ జగన్మాత ఆశీస్సులతో వాడ వాడల శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా జరగాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లోని ఆయన స్వగృహంలో గుడివాడలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే శనివారం ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలను అందజేశారు.
-
మాజీ ఎమ్మెల్యే నివాళి
కృష్ణా: కోడూరుకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు అన్నం లక్ష్మీ పెరుమళ్ళీ(90) వయస్సు రీత్యా, అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అవనిగడ్డ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
-
రైతులకు అందుబాటులో యూరియా
కృష్ణా: పెడన మండలానికి 215 టన్నుల యూరియా స్టాకు చేరిందని మండల వ్యవసాయ అధికారిణి జెన్నీ ఒక ప్రకటలో తెలిపారు. శనివారం మండలంలోని వివిధ పాక్స్, గ్రామాలలో యూరియా పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. కమలాపురం, కవిపురం, చేవెండ్ర, పెడన, కొంకేపూడి, నందమూరు, పెనుమల్లి, మచెర్ల, నందిగామ,దావోజిపాలెం గ్రామాల్లో యూరియా అందుబాటులో ఉంటుందని, రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా సజావుగా కొనసాగుతుందని జెన్నీ హామీ ఇచ్చారు.
-
అడ్డగోలుగా ఆశీలు దందా!
కృష్ణా: పెడన పట్టణంలో ఆశీల వసూళ్ల పేరుతో జరుగుతున్న అక్రమాలపై చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కన్నా రెట్టింపు వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా తాత్కాలిక దుకాణాలు పెట్టుకున్న వ్యాపారుల నుండి రూ.150-రూ. 300 వరకు వసూలు చేశారని తెలిపారు. ఈ అక్రమాలను అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
-
ఆలయాల అభివృద్ధి నా ప్రధాన కర్తవ్యం: ఎమ్మెల్యే
కృష్ణా: కృత్తివెన్నులోని శ్రీ దుర్గాపార్వతీ సమేత శ్రీ నాగేశ్వరస్వామి దేవస్థానం నూతన కమిటీకి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, ఆయన సతీమణి కాగిత శిరీష శుభాకాంక్షలు తెలిపారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చేకూరి వెంకట్రావు, ఇతర సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక విలువల ప్రోత్సాహం తన ప్రధాన కర్తవ్యం అని పేర్కొన్నారు.
-
కరెన్సీ నోట్లతో వినాయకునికి అలంకరణ
ఎన్టీఆర్: మైలవరంలోని కోట వెనుక ఉన్న రామాలయంలో ఏర్పాటు చేసిన వినాయకున్ని రూ.7లక్షలతో శుక్రవారం అలంకరించారు. రూ.500, రూ.200, రూ.100, ‘US’డాలర్ నోట్లతో కమిటీ వారు ఏర్పాటు చేశామన్నారు. 15వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం నిర్వహించామాన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 1008ప్రమిదలలో మహిళలు శివలింగాకారంలో ఒత్తులు వెలిగించారు. కాగా నేడు(శనివారం) గణేష్ నిమజ్జనం చేయనున్నామని నిర్వాహకులు తెలిపారు.
-
కూలి పనికి వెళ్లి..!
ఎన్టీఆర్: మైలవరం మండలంలోని కొడిసింగి గ్రామానికి చెందిన వంతల సన్యాసిరావు(34) అనే వ్యక్తి ఇటుకల బట్టీలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సన్యాసిరావు ఇటీవల కూలి పని కోసం మైలవరం ఇటుకల బట్టీ వద్దకు వెళ్లాడని అతడి భార్య సింగారి తెలిపింది. అక్కడే ఉంటూ పనిచేస్తున్నాడని, అయితే శుక్రవారం విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు ఇటుకల బట్టీ యజమాని తెలిపారని వాపోయింది.
-
విజయవాడ ఉత్సవ్‌లో సినీ సందడి
AP : ‘విజయవాడ ఉత్సవ్’లో తారలు తళుక్కుమననున్నారు. పున్నమిఘాట్‌లో ఈనెల 22 నుంచి అక్టోబరు 2 వరకు మెగా ఈవెంట్స్ జరగనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా పాటల లాంచ్, యువరత్న బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2 సాంగ్ లాంచ్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా దసరా ఉత్సవ్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది.