Locations: Krishna

  • లోకేష్‌కు ‘ది వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకం బహుకరణ

    కృష్ణా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర అనుభవాలతో కూడిన ది వాయిస్ ఆఫ్ పీపుల్ పుస్తకాన్ని లోకేష్‌కు బహుకరించారు.

     

  • ‘సమస్యల పరిష్కారం కోసం సహకరించాలి’

    కృష్టా: పులిగడ్డ గ్రామపంచాయతీలో సర్పంచ్ దాసరి విజయ్ కుమార్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. అవనిగడ్డ మండల వెలుగు ఏపీఎం శ్రీనివాస్ చిన్న, పెద్ద పరిశ్రమలు, సబ్సిడీల గురించి వివరించారు. సర్పంచ్ గ్రామ అభివృద్ధికి సహకారం, సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని కోరారు. సెక్రటరీ అనిత గ్రామసభకు హాజరై అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. వార్డ్ మెంబర్లు, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • కంచికచర్ల ప్రాంతంలో చిరుజల్లులు

    ఎన్టీఆర్: కంచికచర్ల ప్రాంతంలో గురువారం సాయంత్రం చిరుజల్లులు పడ్డాయి. అప్పటివరకు 38 డిగ్రీల వేడిమికి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడటంతో వాతావరణం చల్లబడింది. రైతులు ఎంతో ఆశగా ఆకాశం వైపుకి చూసినప్పటికీ కేవలం చిరుజల్లులతోనే మాత్రమే సరిపుచ్చింది. ఈ వారంలో భారీవర్షం కురవకపోతే పునాస పంటలన్నీ తీవ్రంగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

     

  • హోం మంత్రి పర్యటనలో భద్రతా లోపంపై ఫిర్యాదు

    కృష్ణా: మచిలీపట్నంలో హోంమంత్రి అనిత పర్యటన సందర్భంగా భద్రతా లోపాలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేతలు, కొంతమంది పోలీసుల సహకారంతో మంత్రి కొల్లురవీంద్ర ఇంటి సమీపంలో నిరసనకు ప్లాన్ చేశారు. వైసీపీ మహిళా నాయకురాళ్లు చీపుర్లతో రవీంద్ర ఫోటోలను కొడుతూ నిరసన చేపట్టారు. దీంతో అనిత రవీంద్ర ఇంటికి వెళ్లకుండా పర్యటన వాయిదా వేశారు. టీడీపీ నేతలు పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు.

  • నందిగామ వ్యాప్తంగా భారీ వర్షం

    ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలోని గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది. దీంతో నియోజకవర్గంలో పలు ప్రాంతాలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఈదురు గాలులు, జల్లులతో వర్షం కురుస్తుండంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

     

  • వ్యక్తిగత కార్యదర్శి పాడె మోసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

    కృష్ణా: మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు వ్యక్తిగత కార్యదర్శి, గొల్లపూడి కార్యాలయ ఇన్‌ఛార్జ్ కట్టా నరసింహారావు అంతిమయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని పాడె మోశారు. నరసింహారావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన (పరిటాల)నక్కలంపేటలో గురువారం సాయంత్రం జరిగాయి. కట్టా ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు అన్నారు.
  • ‘ఈ-పాస్ ద్వారా విక్రయాలు చేయాలి’

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీలర్లు, PACS సెక్రటరీలతో సమావేశం జరిగింది. సరైన అమ్మకాలు, స్టాక్ బుక్ ఎంట్రీ, ఈ-పాస్ ద్వారా విక్రయాలు చేయాలని, తేడా వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పీఎం ప్రణామ, ఎరువుల నిల్వలు, అమ్మకాలు, నానో యూరియా ఉపయోగాల గురించి అధికారులు వివరించారు.

     

     

  • ఎవడైనా రౌడీయిజం చేస్తే.. పూడ్చేస్తా: డిప్యూటీ స్పీకర్

    పశ్చిమగోదావరి: ఎవడైనా ఇష్టం వచ్చినట్లు రౌడీయిజం చేస్తానని, ఇది చేస్తాను అది పూడ్చేస్తాను అంటే ఆ దారిలోనే కప్ పెట్టేస్తా అని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ఉండి మండలం వాండ్రం గ్రామంలో ఆక్రమణలు తొలగించి నిర్మించిన పుంత రోడ్డు, మైక్రో వాటర్ ఫిల్టర్, పెదఅమీరం గ్రామాన్ని కలిపే బ్రిడ్జిని ప్రారంభించారు.

  • సభ నిరవధికంగా వాయిదా

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ హాలును ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గురువారం ప్రారంభించారు. టీడీపీ, జనసేన నాయకులు జంపాల సీతారామయ్య, గాంధీలు ప్రథమ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబును అభినందించారు. మొదటి సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వైసీపీ కౌన్సిలర్ మొగిలిదయా చర్చ గురించి ప్రశ్నించగా, 19మంది కౌన్సిలర్లు చర్చ అవసరం లేదని ఆమోదించారు. సభ నిరవధికంగా వాయిదా పడింది.

  • ఘనంగా అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవం

    ఎన్టీఆర్: అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం ఆధ్వర్యంలో గురువారం మైలవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం మెంబర్లు ఏజీపీ ఏడీ ప్రసాద్, వీటీ కిషోర్, పీ.దినేష్ తదితరులు సన్మానించారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. లాభాపేక్ష లేకుండా న్యాయవాదులు పేదలపక్షాన న్యాయం తరుఫున వాదిస్తూ న్యాయవాద వృత్తికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.