గుంటూరు: మంగళగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈనెల 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని టీడీపీ నాయకులు, యార్డ్ ఛైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావును గురువారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Locations: Krishna
-
పేర్ని ఇంటి పునాదులు కదిలిస్తాం.. టీడీపీ కార్యకర్తలు వార్నింగ్
కృష్ణా: మచిలీపట్నంలో వైకాపా నేత పేర్ని నాని దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దహనం చేశారు. మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను తగులబెట్టినట్లు తెలిపారు. నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..విద్వేషకర వ్యాఖ్యలు చేస్తున్న అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి కొల్లు రవీంద్ర గురించి మాట్లాడితే పేర్ని ఇంటి పునాదులు కదిలిస్తామని హెచ్చరించారు.
-
MLA సమక్షంలో టీడీపీ, జనసేన నేతల బాహాబాహీ
కృష్ణా: నాగాయలంక మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదంలో జనసేన, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సమక్షంలోనే ఈ విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడిని జనసేన నాయకుడు వేదికపై నుండి లేపడంతో వివాదం తలెత్తింది. ఈఘటనతో కూటమిలో అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది.
-
‘పేర్ని నానిని అరెస్టు చేయాలి’
AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత పేర్ని నాని దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దహనం చేశారు. మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను తగులబెట్టినట్లు తెలిపారు. నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విద్వేషకర వ్యాఖ్యలు చేస్తున్న అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
-
నందిగామలో రేషన్ షాప్ తనిఖీ
ఎన్టీఆర్: నందిగామలోని మయూరి టాకీస్ సమీపంలోని షాప్ నెం.45 రేషన్ దుకాణాన్ని ఎమ్మార్వో నూతక్కి సురేష్ బాబు తనిఖీ చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా 50 శాతం మాత్రమే పంపిణీ జరిగిందని ఫిర్యాదు రావడంతో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టాక్ వెరిఫికేషన్ చేశానని, స్టాక్ సక్రమంగానే ఉందని, ఎటువంటి తేడా లేవని పోర్టబులిటీ ద్వారా 83 శాతం రేషన్ పంపిణీ జరిగిందని తెలిపారు.
-
నామినేట్ పదవులు.. వ్యక్తిగతమా రాజ్యాంగ బద్దమా చెప్పండి?
కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల కేటాయింపు రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉందని జిల్లా మాలమహానాడు అధ్యక్షులు దోవా గోవర్ధన్ విమర్శించారు. రాజ్యాంగబద్దంగా ఇచ్చే కొన్ని పదవులకు తగిన మౌలిక సూత్రాలను పాటించడం లేదన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధకచట్టం విజిలెన్స్ కమిటీ నియామకం హాస్యాస్పదమని, సామాజిక వివక్షత తెలియనివారికి పదవులు కేటాయించడం ఆ జాతి ప్రజల దౌర్భాగ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
-
‘మరోసారి అలా మాట్లాడితే ఇంటి పునాదులు కదిలిస్తాం’
కృష్ణా: మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు పేర్ని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్వేషకర వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కొల్లు సహనాన్ని బలహీనతగా చూడొద్దని, మరోసారి అనుచితంగా మాట్లాడితే ఇంటి పునాదులను కదిలిస్తామని వారు హెచ్చరించారు.
-
కార్యకర్త పాడె మోసిన MLA కృష్ణప్రసాద్
ఎన్టీఆర్: మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వ్యక్తిగత కార్యదర్శి, గొల్లపూడి కార్యాలయ ఇన్‌ఛార్జ్ కట్టా నరసింహారావు అంతిమయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని పాడె మోశారు. నరసింహారావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన (పరిటాల)నక్కలంపేటలో గురువారం సాయంత్రం జరిగాయి. కట్టా ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు అన్నారు.
-
వైద్య ఆరోగ్యశాఖ సర్వే క్షేత్రస్థాయి పరిశీలన
ఎన్టీఆర్: కంచికచర్లలో పీఎంజేఏవై సైకిల్ సెల్ అనేమియా సర్వేను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సుహాసిని, డాక్టర్ స్నేహ సమీరా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వైద్యాధికారులు స్వయంగా లబ్ధిదారులను అడిగి వాళ్లతో మాట్లాడి ఈ పథకాల ప్రయోజనాల గురించి అక్కడ ఉన్న ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక పీహెచ్‌సీని పరిశీలించారు. ఆరోగ్య కేంద్ర పరిధిలో గర్భిణీ స్త్రీలకు సేవలు పెంచాలని సిబ్బందిని ఆదేశించారు.
-
‘జవాన్ కుటుంబానికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత’
కృష్ణా: భారత సరిహద్దుల్లో గత సంవత్సరం వరదల్లో అమరుడైన జవాన్ సాదరబోయిన నాగరాజు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 6సెంట్ల నివాస స్థలం పట్టాను టీడీపీ కార్యాలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గురువారం అధికారికంగా అందజేశారు. పట్టా అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమరుల త్యాగం చిరస్మరణీయమని, జవాన్ కుటుంబానికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.