Locations: Krishna

  • మహిళా MLAపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే కోపం రాదా..?

    కృష్ణా: సినిమా డైలాగులు మాట్లాడితే తప్పేమిటి అన్న జగన్.. మరి నాడు పట్టాభి బోసిడికే అనడం తప్పు ఎందుకు అవుతుందని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. బోసిడికే అన్న పదం సినిమాల్లోది కాదా అన్నారు. మీ కార్యకర్తలు మాత్రం పోస్టర్‌తో రప్పారప్పా నరుకుతామంటే తప్పు కాదా అని ప్రశ్నించారు. మహిళా MLA ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్‌రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడితే కార్యకర్తలకు కోపం రాదా..? అన్నారు.

     

  • తిరువూరులో గ్యాస్ ఏజన్సీ ఆకస్మిక తనిఖీ

    ఎన్టీఆర్: తిరువూరు డివిజన్‌లోని రఘు గ్యాస్ ఏజన్సీ (ఐఓసీ డీలర్)ను గురువారం రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఏజన్సీ కార్యకలాపాలు, నిబంధనల పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు.

     

     

  • మచిలీపట్నంలో వేడెక్కిన రాజకీయం..!

    కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతను రేపింది. పేర్ని అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పేర్ని నివాసం సమీపంలో టీడీపీ మహిళలు చీపుర్లతో ఆందోళన చేశారు. దీనికి ప్రతిగా వైసీపీ మహిళా విభాగం నాయకురాళ్లు కొల్లు నివాసం సమీపంలో ఆందోళన నిర్వహించారు.

  • ‘కూటమి పాలనలో ప్రజలకు మేలు’

    కృష్ణా: పెడన రూరల్ మండలం ముచ్చిలిగుంట గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్, పోలింగ్ బూత్ ఇన్‌ఛార్జ్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా ప్రభుత్వ సాధనలను ప్రజలకు తెలిపారు.

  • పేర్ని నానికి యార్లగడ్డ వెంకట్రావ్ ఓపెన్ ఛాలెంజ్

    కృష్ణా: మచిలీపట్నంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. మాజీమంత్రి పేర్ని నానికి బహిరంగ సవాల్ విసిరారు. వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టలేదని, దీనిపై చర్చకు సిద్ధమని అన్నారు. వైసీపీలో ఉండగా తాను చంద్రబాబు, లోకేష్, వారి సతీమణిని వ్యక్తిగతంగా దూషించలేదని, నాని దూషించినప్పుడు ఖండించినట్లు గుర్తుచేశారు. ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని వెంకట్రావు స్పష్టం చేశారు.

  • ‘జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యం’

    ఎన్టీఆర్: నందిగామలో సీఎం సహాయ నిధి కింద 25మంది లబ్ధిదారులకు రూ.9,88,028 చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణకుమారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పథకం పేదలకు వరం అని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మా లక్ష్యం అని అన్నారు.

  • సెటిల్‌మెంట్ పేరుతో.. భార్య, బంధువులను చితకబాదిన SI

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ ఎస్సై చల్లా ప్రవీణ్‌కుమార్ కుటుంబ సెటిల్‌మెంట్ పేరుతో దాడికి పాల్పడ్డారు. ఏప్రిల్18, 2025న మధిరకు చెందిన చప్పిడి రాజ్యలతతో వివాహమైన ప్రవీణ్ కుమార్, అదనపు కట్నం కోసం ఆమెను పలుమార్లు హింసించి ఇంట్లో బంధించారు. కుటుంబసభ్యుల సహకారంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని పిలిచి, అందరూ కలిసి కర్రలు, రాడ్లతో దాడి చేశారు.

  • పారదర్శకమైన పరిపాలననే లక్ష్యం: MLA సౌమ్య

    ఎన్టీఆర్: నందిగామలోని 9వ వార్డు ముక్కపాటి కాలనీలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పారదర్శక పరిపాలన, స్థానిక సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సౌమ్య స్థానికుల అవసరాలను ఆలకించి, ప్రభుత్వ చర్యలను వెల్లడించారు.

  • ట్రాఫిక్ వలయంలో జుజ్జురు రోడ్డు

    ఎన్టీఆర్: కంచికచర్లలోని జుజ్జురు రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లారీలే దానికి కారణం. రోడ్డుకు ఇరువైపులా లారీలు నిలిపి ఉంచడం, రాళ్లు పెట్టడం వల్ల ఉదయం, సాయంత్రం సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైనా అధికారులు స్పందించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

     

  • అందరి సహకారంతో.. అభివృద్ధి పథంలో!

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశంలో ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సభ్యులందరి సహకారంతోనే ఛైర్మన్‌గా ఎన్నికయ్యాను. ప్రతి ఒక్కరి ఆలోచనలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటా. అందరి సహకారంతో కొండపల్లి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. కలిసి ముందుకెళ్దాం’ అని పేర్కొన్నారు.