Locations: Krishna

  • జగన్ పోలీసుల్ని బెదిరించడం సరికాదు : పోలీసు అధికారుల సంఘం

    AP : YCP అధినేత జగన్‌.. DIG స్థాయి అధికారులను మాఫియా డాన్‌లతో పోల్చడం అత్యంత దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని అన్నారు. YCP ప్రభుత్వం హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయం జగన్‌ మర్చిపోయారా అని ప్రశ్నించారు.

  • చెరువులో పడి బాలుడి మృతి

    ఎన్టీఆర్: మైలవరంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడి మృతి చెందాడు. మండలంలోని మొర్సుమల్లికి చెందిన జెట్టి శివకృష్ణ(16) బుధవారం పశువులను మేతకు తీసుకెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

     

  • విద్యార్థులకు కలెక్టర్ ప్రోత్సాహం

    ఎన్టీఆర్: ఐఐటీ, నీట్ ప‌రీక్ష‌ల్లో మంచి ర్యాంకుల సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ విద్యార్థులను ప్రోత్సహించారు. జి.కొండూరు మండలం కుంటముక్కల డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణ, విలువలతో ఉన్నత స్థానాలు అందుకోవాలన్నారు. గురుకులం పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.
  • షాదిఖానా అభివృద్ధికి కృషి చేయాలి: MLA

    కృష్ణా: పెడన పట్టణంలో గుడివాడ రోడ్డులో ఉన్న షాదిఖానాకు సగీర్ అహ్మద్ అధ్యక్షుడిగా, మహమ్మద్ రఫీ, అబ్దుల్ వాహెద్, వజీర్ అహ్మద్, ఉమే సుమయ్య సభ్యులుగా నియమితులయ్యారు. వారంతా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాదిఖానా అభివృద్ధికి కృషి చేయాలని, సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
  • మద్యం మత్తులో హోంగార్డుపై ఐరన్ రాడ్డుతో దాడి

    కృష్ణా: పెనమలూరులో హోంగార్డుపై మద్యం మత్తులో ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. రోడ్డుపై బైక్ అడ్డంగా ఉందని తీయమన్నందుకు హోంగార్డు అశోక్‌పై మచిలీపట్నానికి చెందిన వెంకన్న ఐరన్ రాడ్డుతో దాడి చేశాడు. అశోక్ తలపై తీవ్రగాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు 8 కుట్లు వేశారు. దీంతో వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • కంది రైతుల కన్నీరు..!

    ఎన్టీఆర్: కంది పంట సాగు చేసిన కన్నీరు పెడుతున్నారు. వీరులపాడు మండలం చౌటపల్లి, చట్టన్నవరం గ్రామాల్లో గత ఖరీఫ్ సీజన్‌లో రైతులు వెయ్యి ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. అధిక వర్షాలతో కంది పంటపై ఆశలు నిరాశగా మారాయి. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.7,550మద్దతు ధర ప్రకటించినా.. మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేయకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో రూ.6వేలకే అమ్మాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 

  • వైభవంగా ఆషాడ మాస సారె కార్యక్రమం

    ఎన్టీఆర్: నందిగామలో శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాడ మాస సారె కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీసత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పును తీసుకొస్తున్నాయన్నారు. సేవా కార్యక్రమాలు ప్రేమ, కరుణ, సేవా దృక్పథంతో జీవించేలా ప్రేరేపిస్తాయన్నారు.
  • జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన

    కృష్ణా: మచిలీపట్నంలోని కరగ్రహారంలో నిర్మించనున్న జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రానికి హోం మంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఐజీ అశోక్ కుమార్, ఇతర ప్రజాప్రతినిథులతో కలిసి ఆమె భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ.. 46ఎకరాల్లో రూ.16.75కోట్లతో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను రాష్ట్రంలోనే అతి పెద్ద పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌గా నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.

  • హారికపై దాడిని ఖండిస్తున్నాం: వీరన్న

    కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికను ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర ఎంబీసీ విభాగ అధ్యక్షుడు పెండ్ర వీరన్న పరామర్శించారు. ఇటీవల ఆమెపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమెకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మొగల్తూరు వైసీనీ గౌడ్ సంఘం నాయకుడు శ్రీనివాసప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

  • ఆయన మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది: MLA

    ఎన్టీఆర్: మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి కట్టా నరసింహారావు గుండెపోటుతో గురువారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వసంత హుటాహుటిన హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి కంచికచర్ల మండలం నక్కలంపేట వచ్చి నరసింహారావు పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం వ్యక్తం చేశారు. నరసింహారావు హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.