Locations: Krishna

  • యోగా సాధనతో రోగాలు దూరం

    ఎన్టీఆర్: ఆరోగ్యం కోసం ఇబ్రహీంపట్నంలో ప్రత్యేక యోగా శిబిరాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని శాంతివన్ యోగా ఫౌండేషన్ అధ్యక్షుడు లంకే జనార్ధన్ అన్నారు. ఎన్టీటీపీఎస్, ఎస్వీసీటీ సౌజన్యంతో శాంతివన్ యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్వీసీటీ కల్యాణ మండపంలో యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రోజులో కొంత సమయాన్ని కేటాయించి యోగా సాధన చేస్తే రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని పేర్కొన్నారు.

  • భార్యపై దాడి.. అడ్డొచ్చిన అత్తమామలపైనా..!

    కృష్ణా: ఓ వ్యక్తి మద్యం సేవించి భార్య, అత్తమామలపై దాడికి తెగబడిన ఘటన ఘంటసాలలో జరిగింది. మండలంలోని కొడాలికి చెందిన అజయ్ మద్యానికి బానిసై డబ్బు ఇవ్వాలంటూ భార్య శ్రీలక్ష్మిపై దాడికి యత్నించగా.. అడ్డుకోబోయిన అత్తమామలు సుబ్బారావు, వెంకటలక్ష్మిపై కత్తితో దాడిచేశాడు. స్థానికులు బాధితులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై చల్లపల్లి సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు.

  • AC బోగీకి నాలుగు కళ్లు!

    AP : ప్రయాణికుల భద్రతను పెంచేందుకు రైల్వే శాఖ రైళ్లలో CC కెమెరాలు అందుబాటులోకి తెచ్చింది. విజయవాడలోని డీజిల్‌ లోకోషెడ్‌లో CC కెమెరాలను అమర్చిన AC బోగీలతో కూడిన రైలును అధికారులు ప్రదర్శించారు.

  • రైతుల సంక్షేమమే కూటమి ధ్యేయం

    కృష్ణా: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ తెలిపారు. బుధవారం చల్లపల్లి మండలం మంగళాపురంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘పొలం పిలుస్తోంది’ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పొలం గట్లపై చల్లుకోవటానికి నూరు శాతం సబ్సిడీపై కంది విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కనకదుర్గ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగేశ్వరరావు, ఏఓ మురళీకృష్ణ పాల్గొన్నారు.

  • మనల్ని అడిగేది ఎవడ్రా..?

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో మనల్ని అడిగేది ఎవడ్రా అన్నట్లు విక్టరీ వైన్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. మద్యం మత్తులో మందుబాబులు వారి వాహనాలను రోడ్డుగా అడ్డంగా, ఇష్టానుసారంగా పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో తిరువూరు, మైలవరం వెళ్లే బస్సులకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ప్రజలు వాపోతున్నారు.

  • రోడ్లన్నీ బురదమయం.. పైగా వర్షకాలం!

    కృష్ణా: బురద రోడ్లతో చల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వాటర్ ట్యాంక్ పైప్‌లైన్ వర్క్ పేరుతో వేసవికాలంలో చేయాల్సిన పనులను వర్షాకాలంలో చేయటం వల్ల ప్రధాన రహదారులన్నీ బురదమయంగా మారాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు రహదారి మరీ అధ్వానంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

  • అందుకే ప్రజలు రప్ప రప్ప ఓట్లు వేశారు: MLA

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. ఆమె మాట్లాడుతూ.. వైసీపీ నేత, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సిగ్గులేకుండా ‘రప్ప రప్ప’ అంటూ మీటింగ్‌లు పెట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టి బలిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అందుకే రప్ప రప్ప ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

  • చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి

    కృష్ణా: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ ఘటన గన్నవరం పట్టణ శివారు తొండంగట్టు వద్ద చోటుచేసుకుంది. మృతులను పట్టణంలోని కొత్తపేటకు చెందిన చెందిన సతీశ్‌ (15), చైతన్య (13)గా గుర్తించారు. స్నేహితులైన వీరిద్దరూ.. తామరపూలు కోసేందుకు చెరువులోకి వెళ్లి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

  • ఎమ్మెల్యే సౌమ్యని కలిసిన ప్రెస్‌క్లబ్ సభ్యులు

    ఎన్టీఆర్: ఉత్తర అమెరికాలో జరిగిన 24వ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సభలను దిగ్విజయంగా ముగించుకుని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను నందిగామ నియోజకవర్గ ప్రెస్‌ క్లబ్ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

  • MLCపై FIR నమోదు.. సమర్థించిన శివకృష్ణారెడ్డి

    ఎన్టీఆర్: కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌పై అందిన ఫిర్యాదు మేరకు కంచికచర్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు. బీజేవైఎం నాయకుడు గొటిక శివకృష్ణారెడ్డి ఈ చర్యను సమర్థించారు. ఇలాంటి వ్యాఖ్యలు అశాంతిని సృష్టిస్తాయని, చట్టం ఊరకుండదని హెచ్చరించారు. కూటమి నాయకులు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.