కృష్ణా: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని ఏజే కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించిన ఈ జాబ్ మేళాలో మొత్తం 32 కంపెనీలు పాల్గొన్నాయి. 2,329 మంది ఇంటర్వ్యూలకు హాజరవ్వగా 637 మంది ఉద్యోగాలు పొందారు. మరో 334 మందిని ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు.
Locations: Krishna
-
రేపు మచిలీపట్నానికి హోంమంత్రి రాక
కృష్ణా: రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గురువారం మచిలీపట్నం రానున్నారు. బందరు మండలం చిన కరగ్రహారం గ్రామంలో నిర్మించనున్న జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేయనున్నారు. హోంమంత్రి పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
-
‘స్మార్ట్ మీటర్ల దోపిడిపై ప్రజా ఉద్యమం’
కృష్ణా: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపై విద్యుత్ భారాలు మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సామాన్యులకు అండగా ఉండాలంటే ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి నరసింహారావు పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపుదల వ్యతిరేక ఐక్య ప్రజా వేదిక ఆధ్వర్యంలో మచిలీపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
-
పెడన అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతా: MLA
కృష్ణా: గూడూరు మండలం పోలవరం గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏడాదిలో అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. పెడన అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపే దిశగా వచ్చే నాలుగేళ్లలో మరిన్ని కార్యక్రమాలు చెప్పడతామని తెలిపారు.
-
రేపు, ఎళ్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షం
ఈనెల 17, 18 తేదీల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. గురువారం మన్యం,అల్లూరి, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
-
పెనమలూరులో హోంగార్డుపై దాడి
కృష్ణా: పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ అశోక్‌పై మద్యం మత్తులో మచిలీపట్నానికి చెందిన వెంకన్న దాడి చేశాడు. రోడ్డుపై బైక్ అడ్డంగా ఉందని తొలగించమనడంతో ఐరన్ రాడ్‌తో దాడి జరిగింది. హోంగార్డ్ అశోక్‌ను హాస్పిటల్‌కు తరలించగా 8 కుట్లు పడ్డాయి. వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
పేర్ని నాని ఇంటి వద్ద టీడీపీ మహిళల నిరసన
కృష్ణా: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద చీపుర్లతో టీడీపీ మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు. చీపుర్లు, పేర్ని నాని, పేర్ని కిట్టు ఫోటోలతో నిరసన తెలిపారు. పేర్ని నాని మాటలు అదుపులో పెట్టుకోకపోతే దేహశుద్ధి చేస్తామని హెచ్చరించారు.
-
సచివాలయ సిబ్బందికి ఘన సన్మానం
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని 16వ వార్డులోని 8వ సచివాలయ సిబ్బంది బదిలీపై వెళ్లడంతో టీడీపీ నాయకులు పలువురు సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా కామా బాబురావు మాట్లాడుతూ.. సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించారని కొనియాడారు. ప్రజలకు సేవ చేయడంలో వారి నిబద్ధతను అభినందించారు. వారు ఎక్కడున్నా ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
-
గన్నవరంలో విద్యార్థినులకు అస్వస్థత!
కృష్ణా: గన్నవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికంగా ప్రథమ చికిత్సతో పరిస్థితి చక్కబడింది. మెరుగైన చికిత్స కోసం ఆరుగురు విద్యార్థినులను చిన్న ఆవుటపల్లి సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
VTPSలో ఘోర ప్రమాదం
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్‌స్టేషన్(VTPS)లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. క్రాష్గాస్లో బొగ్గు కుప్పకూలి ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 20రోజులుగా లైనర్ ప్లేట్స్ సరిగ్గా లేవని ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ.. వారు పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై విచారణ జరపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.