ఎన్టీఆర్: కొండపల్లిలో రోడ్డు విస్తరణ పనులు వివాదాస్పదంగా మారాయి. అభివృద్ధి పేరుతో కొండపల్లి బొమ్మల కళాకారులను రోడ్డున పడేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. చిన్న దుకాణాలపైనే అధికారులు దృష్టి పెట్టడం వెనుక ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పెద్ద భవనాలను వదిలి, పేదల పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. ఈ విస్తరణ ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో తెలియాలని ప్రజలు కోరుతున్నారు.
Locations: Krishna
-
పబ్‌లో పోలీసుల లాఠీచార్జ్.. బిల్లు కట్టకుండా పరారైన మందుబాబులు
విజయవాడలోని ఒక పబ్‌లో అర్ధరాత్రి 2 గంటల వరకు పార్టీ చేసుకుంటున్న యువతీ యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మద్యం మత్తులో హంగామా చేస్తున్న వారిని చెదరగొట్టారు. అనంతరం యువతీ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు అకస్మాత్తుగా దాడి చేయడంతో కొందరు మందుబాబులు బిల్లులు కూడా కట్టకుండానే అక్కడి నుంచి పారిపోయారు.
-
బెజవాడలో జంట హత్యలు
AP: విజయవాడలో జంట హత్యలు కలకలకం రేపాయి. రక్తపు మడుగులో రెండు మృత దేహాలు ఉండటం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఇద్దరినీ హత్య చేసింది రౌడీ షీటర్ కిషోర్‌గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒకరిది విజయనగరం కాగా, మరొకరిది విజయవాడ. వీరు క్యాంటరింగ్ పని చేసేవారని స్థానికులు తెలిపారు.
-
నీటి సమస్య తీర్చాలని మహిళల నిరసన
ఎన్టీఆర్: జి.కొండూరు మండలం చెవుటూరులో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. పది రోజులుగా నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నామని, ఇది ఆర్థికంగా భారంగా మారుతోందని వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
-
తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని ఆందోళన
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని నారాయణ స్కూల్లో ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు జమ కాలేదని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. సుమారు 220మంది విద్యార్థులకు డబ్బు జమ కాలేదని గుర్తించినట్లు తల్లిదండ్రులకు స్కూల్ ఎజీఎం తెలిపారు. ఈనెల 30లోపు డబ్బు జమ కాకపోతే విద్యార్థుల ఫీజులో రూ.13వేలు తగ్గిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు. విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
-
‘కేసుల పరిష్కారానికి రాజీ మార్గం అత్యుత్తమం’
ఎన్టీఆర్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్త్యత్వం-మన దేశం అనే నినాదంతో నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1కే వాక్ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రియాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మీడియేషన్ ద్వారా కక్షదారులకు సత్వరం న్యాయం జరిగేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు ఇది ఒక ఉత్తమమైన మార్గమని తెలిపారు.
-
‘కూటమి ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన సాధ్యం’
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో ఒకటవ సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో P4 కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాలతో మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణకుమారి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన ఒక్క కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తమకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు.
-
‘మహిళలు ధైర్యంగా ఉండాలి’
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని చైతన్య గర్ల్స్ కాలేజీలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం ఏసీపీ ఏబిజి తిలక్ ఆదేశాలతో సీఐ నాయుడు సమీక్షణలో ఎస్సై అభిమన్యు ఆధ్వర్యంలో జరిగింది. శక్తి యాప్, 112 నంబర్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చట్టాలు, ఈగిల్ టీం పాత్ర, డ్రగ్స్ ప్రమాదాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు వివరించారు. మహిళలు ధైర్యంగా ఉండాలని ఎస్సై తెలిపారు.
-
కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్!
విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న కాలేజీ సిబ్బంది విద్యార్థిని కొట్టారని, అవమానభారంతోనే ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థి మృతదేహం విజయవాడ మార్చురీలో ఉంది. మరికొద్దిసేపట్లో విద్యార్థి సంఘాల నేతలు మార్చురీ వద్దకు వెళ్లనున్నారు.
-
BITS ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటుపై హర్షం
ఎన్టీఆర్: రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం చొరవతో దేశంలో అత్యున్నత విద్యాసంస్థ అయిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(BITS) తన నూతన AI+ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుండటం ఆహ్వానించదగ్గ విషయమని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి అన్నారు. పర్యావరణ హితమైన నిర్మాణంతో, అత్యాధునిక సాంకేతికతతో రూ.2వేల కోట్లకుపైగా పెట్టుబడితో నిర్మించనున్న ఈ క్యాంపస్‌లో 7వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తారన్నారు.