Locations: Krishna

  • డ్యామ్ మరమ్మతులు చేయాలి: MLA

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో రైతులకు సాగునీరు అందించడంలో కీలకమైన కాచవరం సప్లై ఛానల్ డివైడింగ్ డ్యామ్ పరిస్థితిని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ.. ‘రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, డ్యామ్‌కు అవసరమైన మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి’ అని అధికారులను ఆదేశించారు.

     

  • HPCL.. 51ఏళ్లు పూర్తి.. కట్టుబడిపాలెంలో వేడుకలు

    ఎన్టీఆర్: హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కట్టుబడిపాలెం హిందూస్థాన్ ఆయిల్ కంపెనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌పీసీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 1971 యుద్ధంలో చమురు కొరత గురించి వివరించారు. ప్రైవేట్ సంస్థల మీద ఆధారపడకూడదని ప్రధాని ఇందిరాగాంధీ 1974లో కాల్ టాక్స్ సంస్థను జాతీయం చేశారన్నారు. 51 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మికులను సత్కరించారు.

  • తొలి సమావేశానికి సర్వం సిద్ధం

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 17వ తేదీన జరగనున్న సమావేశానికి నూతన ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అధ్యక్షత వహిస్తారు. కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పడిన ఐదేళ్లు, ఎన్నికలు జరిగిన మూడున్నరేళ్ల తరువాత గతనెలలో కౌన్సిల్ ఏర్పాటైంది. తొలి సమావేశం కావడంతో  ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వసంత వసంత వెంకట కృష్ణప్రసాద్ హాజరుకానున్నట్లు సమాచారం.

     

  • ఎర్రకాలువ పరిశీలన.. సాగునీటి కష్టాలు తీరేలా!

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చర్యలు చేపట్టారు. పట్టణంలోని ఊర చెరువునకు సాగునీరు చేరే ప్రధాన మార్గమైన ఎర్ర కాలువలో పూడికలు పటడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను తీర్చేందుకు బుధవారం కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

  • ప్రజాసమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దు: MLA

    కృష్ణా: ప్రజల సమస్యలు పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. నందివాడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ప్రజలను ఇబ్బందులు పాలు చేసేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు.

  • ద్వారకా తిరుమలకు బస్ సర్వీస్

    ఎన్టీఆర్: మైలవరం నుంచి ద్వారకా తిరుమల దేవస్థానం వరకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు దేవస్థాన ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన బస్సు ప్రతి రోజు ఉదయం 6గంటలకు మైలవరంలో బయలుదేరి 9.30 గంటలకు ద్వారకా తిరుమల చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు ద్వారకా తిరుమలలో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు మైలవరం చేరుకుంటుందని వివరించారు.

  • దుర్గగుడిలో సమస్యలా..? EOకు కాల్ చేయండి

    ఎన్టీఆర్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ దుర్గగుడిలో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. ఈనేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వారి సమస్యలను 7337444081 నంబర్‌కు ఫోన్ చేసి దుర్గగుడి ఈవో వి.కె.శీనానాయక్ దృష్టికి నేరుగా తీసుకురావొచ్చని అధికారులు తెలిపారు. నేడు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఫోన్ చేయాలని భక్తులకు సూచించారు.

  • ఉద్యోగాల కల్పనలో విశాఖ టాప్‌

    AP : ఉద్యోగాల కల్పన అసాధారణస్థాయిలో వృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రాంతాల ఆధారంగా తొలిసారి ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌.. లింక్డ్‌ఇన్‌ ‘సిటీస్‌ ఆన్‌ ది రైజ్‌-2025’ నివేదికను రూపొందించింది. దేశవ్యాప్తంగా మొత్తం 10నగరాల పేర్లున్న ఈ జాబితాలో విజయవాడ మూడోస్థానం దక్కించుకుంది. విశాఖ, విజయవాడల్లో ఉద్యోగ కల్పనలో కీలకంగా ఉన్నాయి. ఇక విజయవాడకు వస్తున్న పర్యాటకులు, భక్తుల సంఖ్య బాగా పెరిగింది.

     

  • బస్ సర్వీస్.. విసన్నపేట టూ AIIMS మంగళగిరి

    ఎన్టీఆర్: విస్సన్నపేట నుంచి మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి ఈనెల 16వ తేదీ నుంచి బస్ సర్వీస్ నడుపుతున్నట్లు ఇన్‌ఛార్జ్ డిపో మేనేజర్ జి.రాంబాబు మంగళవారం తెలిపారు. ఉదయం 6గంటలకు విస్సన్నపేటలో బయలుదేరి ఉదయం 8.50 గంటలకు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుతుందన్నారు. మళ్లీ సాయంత్రం 4.30గంటలకు ఎయిమ్స్ నుంచి విస్సన్నపేటకు బస్ బయలుదేరుతుందన్నారు.

  • నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.. 18న మేళా: కలెక్టర్

    ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈనెల 18వ తేదీన విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, పీజీ పూర్తిచేసిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువత అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9959984226, 9347779032 నంబర్లను సంప్రదించాని కలెక్టర్ సూచించారు.