కృష్ణా: మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు మూసివేశారు. గ్రహణం అనంతరం సోమవారం ఉదయం మహా సంప్రోక్షణ తర్వాత 10:00 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. సనాతన ఆనవాయితీ ప్రకారం ఏర్పాట్లు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు.