బాపట్ల: బుల్లెట్ ద్విచక్రవాహనాలు దొంగతనాలు చేస్తున్న ఏడుగురు బీటెక్ విద్యార్థులను అద్దంకి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, నెల్లూరుకు జిల్లాలకు చెందిన విద్యార్థులు బుల్లెట్ ద్విచక్రవాహనాల తాళాలు ఎలా తీయాలో యూట్యూబ్‌లో చూసి దొంగతనాలు చేశారు. వారిని అరెస్ట్ చేసి వారి నుంచి 16 బుల్లెట్‌లు, ఓస్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డీఎస్పీ మొయిన్ తెలిపారు.
Locations: Krishna
-
మిస్ అవ్వొద్దు.. మెగా జాబ్ మేళా నేడు!
కృష్ణా: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9గంటలకు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్, బి. ఫార్మసీ, పీజీ పూర్తి చేసిన వారు మేళాలో పాల్గొనాలని కోరారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-
ఎంపీను కలిసిన కూటమి నాయకులు
ఎన్టీఆర్: విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్‌ను టీడీపీ నూతన అధ్యక్షుడు రాయల సుబ్బారావు ఆధ్వర్యంలో పలువురు కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదెళ్ల నాగమణి, కమతం సురేష్, ముత్తంశెట్టి వంశీరాం, అబ్బినేని మల్లికార్జున్ రావు, రామిశెట్టి బాలకృష్ణ శివప్రసాద్, జనసేన నాయకులు అడపా శ్రీనివాసరావు, చింతల తేజ పాల్గొన్నారు.
-
MLC అరుణ్ కుమార్‌పై కేసు నమోదు
ఎన్టీఆర్: కంచికచర్లలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌పై కేసు నమోదైంది. ఆదివారం ఓసీ క్లబ్‌లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కంచికచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు కోగంటి సత్యనారాయణ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
-
‘పేదలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వం’
కృష్ణా: కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం పంచాయతీలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని కూటమి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచామని, స్పౌజ్ పింఛన్ ద్వారా వితంతువులకు అండగా నిలిచామన్నారు. ఉచిత సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం ద్వారా పేదలకు మేలు చేస్తున్నామని ఆయన అన్నారు.
-
హారికకు పార్టీ అండగా ఉంటుంది: కొడాలి నాని
కృష్ణా: పెడన మండలం కూడూరు గ్రామంలో జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని పరామర్శించారు. ఇటీవల గుడివాడలో హారికపై జరిగిన దాడిని ఆయన అడిగి తెలుసుకుని ఖండించారు. హారికకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పెడన నియోజకవర్గ వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు రాము, నాని అభిమానులు పాల్గొన్నారు.
-
యోగా పోటీలకు కలెక్టర్‌కు ఆహ్వానం
కృష్ణా: ఈనెల 19న ఉయ్యూరు మండలం గండిగుంటలో జరగనున్న యోగాసన పోటీలకు కలెక్టర్ డీకే బాలాజీని యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణ ఆహ్వానించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో బాలాజీని కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. జిల్లాస్థాయిలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్‌లకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణ తెలిపారు. ఈ పోటీలలో పురుషులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ కోరారు.
-
ఉప్పాల హారికకు కొడాలి నాని పరామర్శ
కృష్ణా: పెడన మండలం కూడూరు గ్రామంలో కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికను మాజీ మంత్రి కొడాలి నాని మంగళవారం రాత్రి పరామర్శించారు. ఇటీవల గుడివాడలో జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పెడన వైసీపీ ఇన్‌ఛార్జ్ ఉప్పాల రాము, పేర్ని కిట్టు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో వర్షం
రాష్ట్రవ్యాప్తంగా రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో, ప.గో, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అల్లూరి, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాాలని సూచించింది.
-
‘సుపరిపాలనలో తొలి అడుగు’లో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: నందివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. నందివాడ గ్రామస్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సుపరిపాలన గురించి వివరించారు. కార్యక్రమంలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.