Locations: Krishna

  • ఉన్నత స్థాయి కమిటీలో వేణుబాబుకు స్థానం

    కృష్ణా: గుడివాడ టీడీపీ నాయకులు, సేవా తత్పరుడు రామిదేని వేణుబాబుకు కీలకమైన జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్&మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఆయన నియమితులయ్యారు. . కలెక్టర్ బాలాజీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో కలెక్టర్ ఛైర్మన్, ఎమ్మెల్యే,ఎంపీ,ఎమ్మెల్సీ స్థాయి ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వేణుబాబు నియామకం పట్ల పలువురు టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేశారు.

  • కాపు రిజర్వేషన్‌తో సహా కాపు జేఏసీ తీర్మానాలు ఆమోదం

    ఎన్టీఆర్: విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాపు రిజర్వేషన్ తీర్మానాలు ఆమోదించారు. సీపీఎం, సీపీఐ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్, కాపు కార్పొరేషన్‌కు 3000కోట్లు, వంగవీటి మోహనరంగా నామకరణం, రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత, ఉద్యోగుల అణచివేత నిరోధం, 7ముంపు మండలాల మున్నూరు కాపు సమస్యల పరిష్కారం కోరారు.

  • అమరావతిలో జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్

    గుంటూరు: అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్-2025ని ఈనెల 18,19తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఎస్ఆర్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య నారాయణరావు మంగళవారం విజయవాడలో ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సును ప్రారంభిస్తారని, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్, ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్ పాల్గొంటారన్నారు.

  • ఏపీలో ‘రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోంది’

    కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, తన్నీరు నాగేశ్వరరావు, పేర్ని కిట్టు పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని, రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, సామాన్య మహిళలకు న్యాయం జరగదని ఆరోపించారు.

  • కారు అదుపుతప్పి కాలువలోకి పల్టీ కొట్టి..

    ఎన్టీఆర్: ఏ.కొండూరు మండలం గోపాలపురం శివారులో మంగళవారం కారు బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అదుపు తప్పి పక్కనున్న కాలువలోకి పల్టీ కొట్టిందన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
  • ‘పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 అమలు’

    కృష్ణా: పెడనలో పేదరిక నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ P4 విధానం గురించి వివరించారు. దీని ద్వారా వెనుకబడిన కుటుంబాలను దత్తత తీసుకుని, ఆర్థికంగా ప్రోత్సహిస్తారని తెలిపారు. ఇది కేవలం దాతృత్వం కాదు, వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నమని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి స్వర్ణాంధ్రను సాకారం చేద్దాం అని ఆయన అన్నారు.

  • ‘రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు’

    కృష్ణా: జిల్లా ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ సూచనలతో జిల్లావ్యాప్తంగా రహదారి ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఘంటసాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని లంకపల్లి, జిలగలగండి మార్గమధ్యంలో వాహనదారుల వేగాన్ని నియంత్రించేందుకు రేడియం స్టిక్కర్స్ అతికించిన ప్లాస్టిక్ డ్రమ్ములను చల్లపల్లి ఇన్స్పెక్టర్ ఈశ్వర్‌రావు, ఘంటసాల ఎస్ఐ ప్రతాపరెడ్డి సిబ్బందితో కలిసి ఏర్పాటు చేశారు.

  • మానవత్వం చాటుకున్న వైసీపీ నేత

    ఎన్టీఆర్: తిరువూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం మూడవ రోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. భోజన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు వైసీపీ నాయకులు వెలుగోటి ఆదినారాయణ టెంటు వద్ద భోజనాలు పంపించారు. ఈ సహాయానికి కార్మిక సంఘ నాయకులు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆదినారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.

  • సినీ నటి సరోజాదేవి మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం

    కృష్ణా: ప్రసిద్ద సినీ నటి బి.సరోజాదేవి మరణం పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపం తెలిపారు. మంగళవారం అవనిగడ్డలో ఆయన మాట్లాడుతూ.. బెంగుళూరులో తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ పురస్కారాన్ని సరోజాదేవికి అందించే అవకాశం కలిగిందన్నారు.  ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

  • పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: MLA

    కృష్ణా: పేద వర్గాల సంక్షేమం, రాష్ట్ర అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గుడివాడ పట్టణంలోని 8,9 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము మంగళవారం నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరించారు.