కృష్ణా: అవనిగడ్డ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపారు. కేవలం రూ.3వేలకే అరుణాచలంతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోచ్చు అన్నారు. ఈ యాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. జూలై 29న సాయంత్రం 5గంటలకు బస్సు బయలుదేరుతుంది. వెంటనే సీటు రిజర్వ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7036335079 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Locations: Krishna
-
ప్రమాద బాధితుల కోసం ఎక్స్-రే సేవలు ప్రారంభం
కృష్ణా: చల్లపల్లిలో ప్రమాద బాధితుల కోసం నూతనంగా ఎక్స్-రే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఈ సేవలను ప్రారంభించారు. కస్తూరిబా ఆసుపత్రిలో రూ.10లక్షలతో ఈ సదుపాయం ఏర్పాటు చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రోగులకు అన్ని విధాలా సహాయం చేస్తామని పేర్కొన్నారు.
-
కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
ఎన్టీఆర్: విజయవాడ కనకదుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ డైరెక్టర్ గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు (బుడ్డయ్య), టీడీపీ నాయకులు రాయల కిట్టు, వీరమాచినేని కృష్ణ ప్రసాద్ అమ్మవారి ఆశీస్సులు పొందారు. వీరికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
-
‘పులివాగు కట్టను అభివృద్ధి చేయాలి’
ఎన్టీఆర్: జి.కొండూరు మండలం మునగపాడు గ్రామంలో గ్రామ రైతులతో కలిసి పులివాగు కట్టను ఎంపీపీ వేములకొండ తిరుపతమ్మ పరిశీలించారు. పులివాగు కట్టను అభివృద్ధి చేయాలని రైతులు కోరారు. కార్యక్రమంలో జి.కొండూరు మండల వైసీపీ అధ్యక్షులు జడ రాంబాబు, తెల్లదేవరపాడు గ్రామ సర్పంచ్ ఉమ్మడి ప్రసాద్, మునగపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల శేషయ్య, రైతులు పాల్గొన్నారు.
-
‘కేఎల్ రావు తెలుగువారు కావడం గర్వకారణం’
ఎన్టీఆర్: గొల్లపూడిలో డాక్టర్ కె.ఎల్.రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. కె.ఎల్.రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కెఎల్ రావు నదుల అనుసంధానానికి కృషి చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రఖ్యాత ఇంజనీర్ కెఎల్ రావు తెలుగువారు కావడం గర్వకారణం అని దేవినేని ప్రశంసించారు.
-
అగ్నిప్రమాదంలో ఆరు ఎకరాల గడ్డివాములు దగ్ధం
కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలులో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. బాచు శ్రీనివాసరావు అనే రైతు తన పశువుల కోసం దాచిన 6ఎకరాల గడ్డివామి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇచ్చారు. కానీ ఆలస్యంగా రావడంతో నష్టం జరిగిందని రైతు వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చల్లపల్లిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.
-
పేర్ని నాని రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు: కొల్లు
YCP నేత పేర్ని నాని బందరుకే కాదు.. ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గత కొన్ని రోజులుగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై మచిలీపట్నంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ‘‘ప్రజలు చల్లగా ఉంటే జగన్‌కు కడుపు మంట. రప్పా..రప్పా నరికేయమని చెప్పే వారిని సైకో అంటారా? అలా అనడం తప్పు అని చెప్పే మమ్మల్ని సైకో అంటారా?’’అని కొల్లు ప్రశ్నించారు.
-
‘చంద్రబాబు సతీమణికే ఆత్మాభిమానం ఉంటుందా’?
కృష్ణా: సీఎం చంద్రబాబు సతీమణికే ఆత్మాభిమానం ఉంటుందా.. బీసీ మహిళా ప్రతినిధులకు ఆత్మాభిమానం ఉండదా అని మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణిని విమర్శించారనడానికి ఆధారాల్లేవన్నారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ ప్రజాప్రతినిధి హారికపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. బీసీలకు అండగా ఉంటామని కటారి తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని కటారి పేర్కొన్నారు.
-
పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడ్డ కొల్లు
AP : YCP నేత పేర్ని నాని బందరుకే కాదు.. ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గత కొన్నిరోజులుగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై మచిలీపట్నంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మండిపడ్డారు. ‘‘ ఇసుక అక్రమాలకు పాల్పడ్డానని పేర్నినాని ఆరోపిస్తున్నారు. నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తా.. పేర్ని నాని చేస్తారా? ’’ అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
-
కొడాలి నానితో కటారి ఈశ్వర్ కుమార్ భేటీ
AP: గుడివాడలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నానితో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ భేటీ అయ్యారు. ఇద్దరు కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు. గుడివాడలో జడ్పీ చైర్మన్, బీసీ మహిళ ఉప్పాల హారికాపై జరిగిన దాడిని కటారి ఈశ్వర్ ఖండించారు. గుడివాడలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై అధికార పార్టీ శ్రేణుల దాడిని అడ్డుకుంటానని కటారి ప్రకటించారు.