Locations: Krishna

  • ‘ఏటీఎస్ విధానం రద్దు చేయాలి’

    కృష్ణా జిల్లా గుడివాడలో ట్రాన్స్‌పోర్ట్ వాహనదారులు ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించి, ఏటీఎస్ విధానం రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రైవేటు వ్యక్తులకు బ్రేక్‌లు వేసే విధానాన్ని ఖండిస్తూ, ఉద్యోగులను అడ్డుకున్నారు. 70 కిలోమీటర్ల దూరంలో బ్రేక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అవస్థలు పడుతున్నామని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఆర్టీవోలోనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.

  • చెవిలో పువ్వులతో కార్మికుల వినూత్న సమ్మె

    ఎన్టీఆర్: చెవిలో పువ్వులతో కొండపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె నిరసన మూడో రోజుకు చేరింది. ఈసందర్భంగా జీవో నంబర్ 36 ప్రకారం కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ కోరారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ పెంచాలని డిమాండ్ చేశారు.

     

  • తోలుకోడులో కలుషిత నీరు.. ప్రజలు బేజారు

    ఎన్టీఆర్: మైలవరం మండలం తోలుకోడులో పారిశుధ్య లోపం సంభవించింది. కొన్ని నెలలుగా కృష్ణ వాటర్ పైప్ లీకై నీరు వృథాగా పోతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. దీంతో ఏర్పడిన మురుగు నీరు  కృష్ణ వాటర్ ట్యాంక్‌లోకి చేరుతున్నాయని, ఆ నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

  • పోలీసుల సమక్షంలో రౌడీల్లా వ్యవహరించడం దారుణం

    కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, రాములను మోపిదేవి మండల వైసీపీ నేతలు పరామర్శించారు. గుడివాడలో తలపెట్టిన ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ సమావేశానికి వెళుతున్న హారిక, రాము దంపతులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈమేరకు వైసీపీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ..బాధితులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో కూటమి శ్రేణులు రౌడీల్లా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.

  • కాలువలోకి దూసుకెళ్లిన ఆటో.. అతివేగమే కారణం!

    కృష్ణా: పామర్రు మండలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కొమరవోలు జాతీయ రహదారి వద్ద పంట కాలువలోకి ఆటో దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలవగా, మరో 8మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పామర్రు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • SFI ప్లీనరీ సమావేశాలు.. విద్యార్థుల కోసం!

    ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు ఆగస్టు 9, 10 తేదీల్లో కొండపల్లిలోని క్రాంతి హైస్కూల్లో జరుగుతాయని SFI జిల్లా నాయకులు తెలిపారు. హాస్టళ్లలో సౌకర్యాలు లేవని, డిగ్రీ అడ్మిషన్లు ఆఫ్ లైన్‌లో జరపాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కోరారు. విద్యార్థులు సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

  • కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

    రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ గుర్తుచేశారు. కొర్లమండలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు,  దుర్గగుడి డైరెక్టర్ గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు( బుడ్డయ్య) తదితరులు పాల్గొన్నారు.

  • ఉచిత యోగా శిక్షణ.. రేపే ప్రారంభం

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలోని ఎస్వీసీటీ కల్యాణ మండపంలో శాంతివన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు లంకే జనార్ధన్ తెలిపారు. ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్లుగా శిక్షణ ఉంటుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు యోగాలోని వివిధ అంశాలపై అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 6301454859 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

  • జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు 18న!

    కృష్ణా జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 18వ తేదీన జరుగుతాయని జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఉదయం 10 గంటలకు జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సంబంధిత అధికారులు సమావేశానికి తప్పక హాజరుల కావాలని కోరారు.

     

  • సాగునీటి సమస్యపై ఎమ్మెల్యే దృష్టి

    కృష్ణా: పెడనలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కృషి చేస్తున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’లో భాగంగా సోమవారం గుడ్లవల్లేరు లాకుల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి, రైతులకి అండగా నిలుస్తున్నారు. బల్లిపర్రు లాకుల గేట్లు ఎత్తించినా, నీటి ప్రవాహం ఆశించినంత లేకపోవడంతో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఆయన నిరంతరం పాటుపడుతున్నారు.