ఎన్టీఆర్: కంచికచర్లలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు కొమ్మూరి శేషు నేతలతో కలిసి వీరులపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్సైని కలిసి కోరారు. కార్యక్రమంలో నాగశేషు, ఉమామహేశ్వరరావు, సూర్యదేవర ప్రణీకాంత్ పాల్గొన్నారు.
Locations: Krishna
-
వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్: వైసీపీ పాలనలోని అరాచకాలను నందిగామ నియోజకవర్గ ప్రజలు ఇంకా మరచిపోలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. వైసీపీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలను ఖండించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని, శాంతిని కాపాడాలని కోరారు. బాధ్యతగా వ్యవహరించాలని వైసీపీ నాయకులకు సూచించారు.
-
పేర్ని నానికి ప్రజలే బుద్ధి చెబుతారు: రామకృష్ణ
కృష్ణా: అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతున్న మాజీ మంత్రి పేర్ని నానికి ప్రజలే బుద్ధి చెబుతారని జనసేన జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించి విధ్వంసం జరిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు నాని చేస్తున్నాడని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం అంతా గమనిస్తూనే ఉందని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
బంటుమిల్లిలో పవర్ కట్.. ఎప్పుడంటే!
కృష్ణా: బంటుమిల్లి 33/11 KV , అత్తమూరు సబ్‌స్టేషన్ల మెయింటినెన్స్ పనుల నిమిత్తం ఈనెల 19న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ గోవిందరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 11:00 గంటల వరకు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
-
రేపు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో, ప.గో, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అల్లూరి, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాాలని సూచించింది.
-
హింసా రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు: ఎమ్మెల్యే
కృష్ణా: వైసీపీ పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. పెడన నియోజకవర్గం మడక గ్రామంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వైసీపీ నాయకులు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని, జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.
-
అశోక్ గజపతిరాజు నియామకంపై టీడీపీ నేతల సంబరాలు
కృష్ణా: టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులవడం పట్ల అవనిగడ్డలో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం తెలుగు ప్రజలకు గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, సుధాకర్, రాఘవ, దుర్గాప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
-
పెట్టుబడులు రాకుండా చేయాలని జగన్ కుట్రలు: టీడీపీ
కృష్ణా: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని జగన్ కుట్రలకు అనుగుణంగానే పేర్ని నానీ ప్రతిరోజు వాగుతున్నాడని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లపల్లిలో పేర్ని నాని దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి ప్రధాన కూడలిలో దహనం చేశారు. పేదల బియ్యం తిన్న దొంగ పేర్ని నాని అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ఇలాగే వాగితే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వమని హెచ్చరించారు.
-
సంక్షేమ పథకాలపై ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే
కృష్ణా: పెడన నియోజకవర్గం మడక గ్రామంలో నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
పోలీస్ స్పందనకు 38 ఫిర్యాదులు: ఎస్పీ
కృష్ణా: ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. మీకోసం కార్యక్రమంలో భాగంగా నేడు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈరోజు స్పందన కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందాయి. ఆసమస్యలను చట్టపరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీచేశారు.