Locations: Krishna

  • ‘జడ్పీ ఛైర్మన్‌పై దాడి పిరికిపంద చర్య’

    కృష్ణా: జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పల హారికపై దాడి చేయటం పిరికిపంద చర్య అని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి శామ్యూల్ మండిపడ్డారు. మహిళా అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసిన గుండాలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సుపరిపాలన అంటే మహిళలపై దాడి చేయడమేనా.? ఈదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

     

  • అర్జీలు స్వీకరించిన ఆర్డీవో

    ఎన్టీఆర్: నందిగామ ఆర్డీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఆర్డీవో బాలకృష్ణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 20 దరఖాస్తులు వచ్చాయని, రెవెన్యూ, సర్వే, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

  • సామాజిక సేవకులకు సత్కారం

    కృష్ణా: ఖాజీపాలెం శ్రీనాంచారమ్మ తల్లి కొలుపుల్లో సామాజిక సేవకులకు సత్కారం జరిగింది. ఐఆర్‌కాన్ అధికారి చక్రపాణి, వైద్యురాలు డాక్టర్ అవంతి, ఇంజనీర్ లింగయ్య నాయుడులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సన్మానించారు. సమాజానికి విశేష సేవలందించిన వారిని గౌరవించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

  • నాలుగేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ.. యువతి ఆత్మహత్యాయత్నం

    కృష్ణా: ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని బాధతో యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన పామర్రు మండలం కనుమూరులో జరిగింది. గౌతమ్‌- స్వరూప  నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని నిలదీయగా అతను నిరాకరించాడు. రాజీ చేసేందుకు పెద్దలు ప్రయత్నించినా, గౌతమ్ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో స్వరూప విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబీకులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • ప్రజల్లో వైషమ్యాలు పెంచేలా నాని వ్యాఖ్యలు: కూటమి నేతలు

    కృష్ణా: మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని అనే వ్యక్తి రాజకీయ వింత జంతువుగా ప్రవర్తిస్తున్నాడని మచిలీపట్నం నియోజకవర్గ కూటమి నాయకులు మండిపడ్డారు. పేర్ని నాని తన ప్రసంగాలతో కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.  ఆయన మాటల వల్ల ఎలాంటి నష్టం జరిగినా నానిదే బాధ్యతని స్పష్టం చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

     

     

  • బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నాగేశ్వరరావు

    ఎన్టీఆర్: వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా గోపాల నాగేశ్వరరావు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపి, సన్మానించారు. కార్యక్రమంలో మైనారిటీ విభాగం అధ్యక్షులు జాకీర్ భాయ్, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, 16 వార్డు ఇన్‌ఛార్జ్ తిరుమలశెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు.

  • అతనిపై చర్యలు తీసుకోవాలి: మహిళలు

    ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం కొర్లమండ గ్రామానికి చెందిన ఎస్సీ మహిళల వ్యవసాయ భూమి(సర్వే నెం 238/2, 297)ని మేశపాం ప్రభాకరరావు అక్రమంగా కబ్జా చేసేందుకు యత్నించారని బాధిత మహిళలు వాపోయారు. గత రెండేళ్లుగా కౌలు(రూ.1,20 లక్షలు) చెల్లించకుండా, ట్రాక్టర్‌తో భూమిని దున్నే ప్రయత్నం చేశాడు. దీనిపై అడ్డుకోగా తమపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. 

     

     

  • డబ్బు కోసమే రిటైర్డ్ ఇంజనీర్ హత్య: ACP

    విజయవాడలో రిటైర్డ్ ఇంజనీర్ వెంకట రామారావు హత్యకేసులో కేర్ టేకర్ అనూష, ఆమె ప్రియుడు ఉపేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న రూ.90,000డబ్బు కోసమే కళ్ళల్లో కారంకొట్టి, దిండుతో ఊపిరిఆపి చంపినట్లు ఏసీపీ దామోదర్ వెల్లడించారు. నిందితులను సెల్‌ఫోన్, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నామన్నారు. కేర్ టేకర్లను నియమించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

  • ఎమ్మెల్యేను కలిసిన పీఏసీఎస్ నూతన అధ్యక్షులు

    కృష్ణా: పెడన మండలం నందిగామ దావోజీ పాలెం వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులుగా నియమితులైన యరగాని నాగరాజు, కాగిత నాగేశ్వరరావు సోమవారం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి,  శాలువాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నూతన అధ్యక్షులకు సూచించారు.

  • ఆర్&బీ విశ్రాంత ఇంజనీర్‌ హత్య కేసు.. నిందితులు అరెస్ట్

    కృష్ణా: ఆర్&బీ విశ్రాంత ఇంజనీర్ రామారావు హత్య కేసులో నిందితులు అనుషా, ఉపేందర్‌లను మూడు రోజుల వేట అనంతరం పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. హత్య తరువాత నిందితులు ఆటోలో నులకపేట, అక్కడి నుంచి బస్సులో నెల్లూరు, చెన్నై, శ్రీకాళహస్తి వెళ్లారు. తిరిగి నులకపేటకు వస్తుండగా విజయవాడలో పట్టుబడ్డారు. ఈ సాయంత్రం వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.