
Locations: Krishna
-
లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రహదారి అభివృద్ధి
ఎన్టీఆర్: విస్సన్నపేటలో ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఎంఈఓ, వెలుగు ఆఫీస్‌లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. కానీ అక్కడ వర్షం పడితే మోకాళ్ల లోతు నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. ఈ సమస్యను టీడీపీ నాయకుడు ఎన్టీ వెంకటేశ్వరావు దృష్టికి తీసుకెళ్లగా..లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ చిన్న రత్నాల సారథ్యంలో రహదారిని అభివృద్ధి చేశారు. దీంతో మండల ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు. -
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గొడౌన్‌ను నెలవారి తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. తొలుత గొడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు
అనంతరం సంబంధిత రికార్డులు పరిశీలించి రికార్డులో సంతకం చేశారు. -
రెడ్ బుక్ పాలనలో మహిళలకు రక్షణ లేదు: మాజీ మంత్రి
కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై కూటమి గుండాల దాడిని ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. జిల్లా ప్రథమ పౌరురాలు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి పోలీసుల కళ్ళముందే ఆమెపై దాడి చేయడం హేయమైన చర్యన్నారు. రెడ్ బుక్ పాలనలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.
-
మాదివాడ మల్లి మృతి.. మాజీ మంత్రి నివాళి
కృష్ణా: అనారోగ్యంతో మచిలీపట్నంలో మరణించిన మాదివాడ మల్లి భౌతికకాయాన్ని అవనిగడ్డ మండలం వేకనూరులో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పారు.
-
నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే నివాళి
కృష్ణా: కోడూరు మండలం పోటుమీదలో మాజీ సర్పంచ్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు నాగేశ్వరరావు భౌతికకాయాన్ని సోమవారం ఉదయం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగేశ్వరరావుతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయన వెంట భావదేవరపల్లి సర్పంచ్ ఉదయభాస్కర్, కూటమి నాయకులు చంద్రరావు, సీతారత్న, తదితరులు ఉన్నారు.
-
ZP ఛైర్‌పర్సన్ హారిక భర్తపై కేసు
కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శనివారం నాగవరప్పాడు వంతెన వద్ద తనను కారుతో ఢీకొట్టి గాయపరిచారని తెలుగుమహిళా నాయకురాలు మాదాల సునీత ఫిర్యాదు చేశారు. కారులో ఉన్న రాము, వైసీపీ నేత కందుల నాగరాజు వల్గర్‌గా దూషించారంటూ పేర్కొన్నారు. ఈ మేరకు రాము, మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదుచేశారు.
-
అనధికార పర్మిట్ రూంలో మంటలు..తప్పిన పెను ప్రమాదం
కృష్ణా: మోపిదేవిలోని అవనిగడ్డ రోడ్డులో ఉన్న శ్రీ క్రిష్ణ వైన్ షాపు పక్కన అనధికార పర్మిట్ రూంలో స్నాక్స్ వండే సమయంలో గ్యాస్ సిలిండర్ వద్ద మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. యువకుల చొరవతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక జాగ్రత్తలు లేకపోవడంతో ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గెస్ట్ లెక్చరర్ పోస్ట్..ఈనెల 17 లాస్ట్!
ఎన్టీఆర్: విస్సన్నపేటలోని కేఎమ్మార్ అండ్ ఎమ్మెస్సార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న జువాలజీ అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ నరసింహారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ జంతు శాస్త్రంలో కనీసం 50 శాతం మార్కులు పొందిన వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 17న సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో అందజేయాలని చెప్పారు.
-
నేడు వైసీపీ కార్యకర్తల సమావేశం
కృష్ణా: పమిడిముక్కల మండలం తాడంకిలో సోమవారం సాయంత్రం 4 గంటలకు వైసీపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటరమణ కుమారి పేర్కొన్నారు. గ్రామంలోని తమ నివాసంలో సమావేశం జరుగుతుందని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.
-
మున్సిపల్ కార్మికుల సమ్మె.. మంచినీటి సంక్షోభం
ఎన్టీఆర్: తిరువూరులో జీవో 36 ప్రకారం వేతనాలు, న్యాయపరమైన సమస్యల కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో నల్లాల ద్వారా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోప్రజలు వాటర్ క్యాన్‌లతో ట్యాంకుల వద్దకు క్యూ కట్టడంతో పాటు మినరల్ ప్లాంట్ల దారిపట్టారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.