కృష్ణా జిల్లా కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తారని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ పరిష్కార వేదిక ఉంటుందని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ సమీపంలోని మండల, డివిజన్ కేంద్రాల్లో అర్జీలు సమర్పిస్తే అధికారులు తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
Locations: Krishna
-
అధికారం వస్తే సత్తా చూపిస్తాం: ఎమ్మెల్సీ
ఎన్టీఆర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ మండిపడ్డారు. మాజీఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, తనపై, చివరికి న్యాయవాదులు, జర్నలిస్టులపై కూడా నందిగామ కూటమి నాయకులు అక్రమ కేసులు పెట్టించారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
-
దుర్మార్గపు చర్యలు మానుకోవాలి: మాజీ ఎమ్మెల్యే
ఎన్టీఆర్: టీడీపీ నాయకులు తమ దుర్మార్గపు చర్యలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావు హెచ్చరించారు. కంచికచర్లలో నిర్వహించిన ‘బాబూ షూరిటీ- మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నందిగామలో పీ4 పేరుతో పారిశ్రామికవేత్తల నుండి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసింది తామైతే, ఇప్పుడు వారే గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
-
రైతు కష్టం.. పాట రూపంలో..!
కృష్ణా: అవనిగడ్డ మండలం రామచంద్రాపురంలో ఓ రైతు ఆకుకూరలను అమ్మేందుకు రాగా వినియోగదారుడు రూ. 5లకే కట్ట కావాలన్నాడు. దీంతో ఆ రైతు తన కష్టాన్ని పాట రూపంలో వినిపించాడు. రైతులు పడుతున్న బాధలను అర్థం చేసుకోవాలని, తక్కువ ధరలకు అడగడం సరికాదని వాపోయాడు.
-
రేపు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
కృష్ణా: మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు.
-
పేర్ని నాని చూసి కొడుకు రెచ్చిపోతున్నాడు: జనసేన నేత
కృష్ణా: వైసీపీ నాయకులు వారి అనుచరులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని జనసేన నేత ముప్పా రాజా ఆరోపించారు. నిన్న గుడివాడలో జరిగిన దాడికి సంబంధించి పేర్ని నాని కార్యకర్తలను రెచ్చగొట్టడం దారుణమన్నారు. నానికి తగ్గట్టు రాజకీయ అనుభవం లేని అతని కొడుకు కూడా రెచ్చిపోతున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దేవభక్తుని చక్రవర్తి నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించారు.
-
ప్రభుత్వం మహిళలకు క్షమాపణ చెప్పాలి: దాసరి
కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పల హారికపై దాడి బాధాకరమని అవనిగడ్డ మండలం పులిగడ్డ సర్పంచ్ దాసరి విజయ్ కుమార్ అన్నారు. మహిళా నాయకురాలికే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను గౌరవించడం మన సంస్కృతి. ఇలాంటి దాడులను ఖండించాలన్నారు. హారికతో పాటు రాష్ట్రంలోని మహిళలందరికి కూటమి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
-
హారికపై దాడి పిరికిపంద చర్య: కొల్లూరి
కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పల హారికపై గుడివాడలో జరిగిన దాడిని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి శామ్యూల్ ఖండించారు. మహిళా నాయకురాలిపై దాడి పిరికిపంద చర్యన్నారు. వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి వెళ్తున్న హారికపై పథకం ప్రకారమే టీడీపీ వాళ్లు దాడికి తెగబడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
QR కోడ్‌తో బాబు మోసాలు తెలుకోండి: పేర్ని
కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని అధ్యక్షతన పెడన ఇన్‌ఛార్జ్ ఉప్పాల రాము ఆధ్వర్యంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం పెడన పట్టణంలో ఘనంగా జరిగింది. నేతలు వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. “బాబు షూరిటీ మోసం గ్యారెంటీ” పేరిట విడుదల చేసిన క్యూఆర్ కోడ్‌తో చంద్రబాబు మోసాలను తెలుసుకోవచ్చని పేర్ని కిట్టు వివరించారు. మాజీ మంత్రి వనిత, జడ్పీ ఛైర్‌పర్సన్ హారిక పాల్గొన్నారు.
-
మహిళ దారుణ హత్య.. చాకుతో మణికట్టు కోసి..
కృష్ణా: కంకిపాడు మండలం మంతెన గ్రామంలో విషాధం చోటు చేసుకుంది. వృద్ధురాలు తిరుమల స్వర్ణకుమారి(70)ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం హత్య చేశారు. దుండగులు మృతురాలి మెడకు వైరు చుట్టి, చాకుతో మణికట్టు కోసి గొలుసు, చేతి గాజులు అపహరించారు. భర్త పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య శవమై కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.