కృష్ణా: కోడూరు మండలం పోటుమీద గ్రామానికి చెందిన ప్రముఖులు కడవకొల్లు నాగేశ్వరరావు ఆదివారం మృతి చెందారు. ఆయన సుదీర్ఘ కాలం పోటుమీద సర్పంచ్‌గా, సహకార సంఘం అధ్యక్షుడిగా గ్రామ అభివృద్ధికి, రైతాంగ అభ్యున్నతికి కృషి చేశారు. నాగేశ్వరరావు మృతిపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, యువ నాయకులు వెంకట్రామ్, భావదేవరపల్లి గ్రామ సర్పంచ్ ఉదయభాస్కర్ సంతాపం తెలిపారు.
Locations: Krishna
-
హారిక దంపతులకు MLC పరామర్శ
పెడన: పెడన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉప్పాల రాము, జడ్పీ ఛైర్ పర్సన్ హారిక దంపతులను ఎమ్మెల్సీ తలసీల రఘురాం పరామర్శించారు. ఆదివారం పెడన మండలం కూడూరు గ్రామంలోని రాము స్వగృహానికి వెళ్లి గుడివాడలో నిన్న జరిగిన ఘటనపై ఆరా తీశారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
-
ఉచిత కంటి వైద్య శిబిరం సక్సెస్
కృష్ణా: మచిలీపట్నం దేశాయిపేటలో గోల్డెన్ క్రాస్ చర్చి నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 200 మంది నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ వైద్యశాల డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భానుమూర్తి నేతృత్వంలో 30 మందిని ఆపరేషన్ కోసం సర్వజన వైద్యశాలకు రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ శ్యామ్, మోడరన్ కంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
-
రాజకీయ లబ్ధి కోసమే హారిక దంపతుల డ్రామాలు: టీడీపీ నేతలు
కృష్ణా:రాజకీయ లబ్ధి కోసమే ఉప్పాల హారిక దంపతులు డ్రామాలు ఆడుతున్నారని గుడివాడ టీడీపీ బీసీ సెల్ నాయకులు విమర్శించారు. ‘మహిళ అనే గౌరవంతో ఇతర మార్గాల్లో వైసీపీ సమావేశానికి వెళ్లాలని హారికకు పదేపదే చెప్పాం. కొద్దిదూరం వెనక్కి వెళ్లి.. తిరిగి ప్రణాళికతోనే ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వచ్చారు. టీడీపీ శ్రేణులు పల్లెత్తు మాట అనలేదు. రాము దంపతులే బూతులు తిట్టారు.’అని నాయకులు వెల్లడించారు.
-
ప్రజలు సంతోషంగా ఉన్నారు: కాగిత
కృష్ణా: కూటమి పాలనలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నామని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తెలిపారు. పెడన టౌన్ 12వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పింఛన్ రూ.4వేలకు పెంపు, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, మత్స్యకార భృతి పెంపు పథకాలు అమలు చేశామని ప్రజలకు వివరించారు. త్వరలోనే బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు.
-
గుడివాడ వస్తే రప్పా రప్పా.. ఏంటో చూపించేవాళ్లం.. పేర్నిపై ఫైర్
కృష్ణా: పేర్ని నాని చేస్తున్న దరిద్రపు వ్యాఖ్యలు వింటుంటే రక్తం మరిగిపోతుందని గుడివాడ టీడీపీ బీసీ సెల్ నాయకులు మండిపడ్డారు. పేర్ని గుడివాడ వచ్చి ఉంటే రప్పా రప్పా ఏంటో చూపించే వాళ్ళమని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాలతోనే అంతా సమన్వయంతో ఉన్నాం. లేకుంటే నిన్న వైసీపీ సమావేశం జరిగేది కాదు. కొడాలి నానినే పారిపోతే ఎవర్ని రెచ్చగొట్టడానికి మీటింగులని ప్రశ్నించారు.
-
అవనిగడ్డలో ‘కోటా’కు నివాళులు
కృష్ణా: అవనిగడ్డలోని టీడీపీ కార్యాలయంలో సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు సంస్మరణ కార్యక్రమం జరిగింది. కోట శ్రీనివాసరావును అద్భుతమైన నటుడిగా మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు కొనియాడారు. నాయకులు కోట చిత్రపటానికి నివాళులు అర్పించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా విజయవాడ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని సభలో స్మరించారు. కోటా 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. -
మోపిదేవి నిత్యాన్నదానానికి విరాళం
కృష్ణా: మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదానం కొనసాగుతుంది. ఆదివారం విజయవాడకు చెందిన బి.రాశి హర్షణి రూ. 50,116/- నగదు విరాళంగా ప్రకటించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు ఇచ్చారు. ఈ సందర్భంగా దాతలకు తగు రశీదు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత
AP: YCP నేత, పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పెడన నియోజకవర్గంలో ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు. శనివారం కూడా గుడివాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొనకుండా నిర్భంధం విధించిన విషయం తెలిసిందే. కూటమి నేతల ఒత్తిడితోనే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
-
APలో మహిళలకు రక్షణ లేదు: భాగ్యారావు
కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చల్లపల్లి ఎస్సీ సెల్ నాయకులు జుజ్జువరపు భాగ్యారావు తెలిపారు. గుంపులుగా వచ్చిన రౌడీ మూకలు ఒక మహిళపై దుర్భాషలాడి దాడికి పాల్పడటం సిగ్గుచేటన్నారు. జిల్లా మొదటి పౌరురాలి పైనే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు.