కృష్ణా: గుడివాడ వెళ్తే కొడతారని మాజీ మంత్రి పేర్ని నాని నిన్న హౌస్ అరెస్ట్ డ్రామా ఆడారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడ వెళ్లే దమ్ము, ధైర్యం లేక ఇంట్లో కూర్చుని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. సాక్షాత్తు ఎస్పీనే తాము హౌస్ అరెస్ట్ చేయలేదని చెప్పారన్నారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ దంపతులు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని చెప్పారు.
Locations: Krishna
-
కొండపల్లిలో కబడ్డీ అకాడమీ ప్రారంభం
ఎన్టీఆర్: కొండపల్లిలో కబడ్డీ అకాడమీని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) ప్రారంభించారు. కబడ్డీ కోచ్‌లు చట్టి శ్రీను, శ్రీరామ ఈశ్వర్, అశ్వజిత్ ప్రసాద్ ఆధ్వర్యంలో అకాడమీని ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి పోటీలకు కబడ్డీ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్మమని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఎర్రంశెట్టి నాని, భాను ప్రకాష్, క్రీడాకారులు పాల్గొన్నారు.
-
ఉప్పాల హారికకు కోడూరు జెడ్పీటీసీ పరామర్శ
కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని కోడూరు జెడ్పీటీసీ యాధవరెడ్డి వెంకట సత్యనారాయణ ఖండించారు. ఆదివారం పెడనలోని స్వగృహంలో హారికను ఆయన పరామర్శించారు. గుడివాడలో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
-
‘వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం దాడులు’
కృష్ణా: జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూడలేక కావాలని కూటమి ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు. మహిళలకు ఎల్లప్పుడూ వైసీపీ అండగా ఉంటుందన్నారు.
-
హారికపై దాడి అమానుషం : గౌతమ్
కృష్ణా: ఎప్పడూ ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయకుండా.. సౌమ్యురాలుగా, విలువలతో కూడిన రాజకీయం చేసే జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై నిన్న గుడివాడలో జరిగిన దాడి అమానుషమని అవనిగడ్డ వైసీపీ నేత గౌతమ్ అన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ప్రగల్భాలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం.. పోలీసుల సమక్షంలోనే మహిళా నాయకులపై వ్యూహాత్మక దాడులు చేయించటం సిగ్గుచేటన్నారు.
-
‘తెలుగు భాషా పరిరక్షణకు కోట తోడ్పాటునిచ్చారు’
కృష్ణా: తెలుగు భాషా పరిరక్షణకు కోట శ్రీనివాసరావు అసెంబ్లీలో తనకు తోడ్పాటుగా నిలిచారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్మరించుకున్నారు. ఆదివారం అవనిగడ్డలోని కార్యాలయంలో కోట శ్రీనివాసరావు సంస్మరణ సభ నిర్మహించారు. కోట చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. 1999లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కోట, అవనిగడ్డ ఎమ్మెల్యేగా తాను ఒకేసారి గెలిచి అసెంబ్లీకి వెళ్లినట్లు గుర్తుచేశారు.
-
‘చంద్రబాబుకు బీసీ మహిళలపై కపట ప్రేమ’
కృష్ణా: జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక వాహనంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నియోజకవర్గ నాయకులు, దివి మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు అన్నారు. సీఎం చంద్రబాబు బీసీ మహిళలపై చూపించేది కపట ప్రేమనా అని ప్రశ్నించారు. కేవలం బీసీలను ఓటు బ్యాంకులానే చూస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై చేయి వేస్తే తాట తీస్తానన్న పవన్ కల్యాణ్.. మరి ఎందుకు చూస్తూ ఉండిపోయారన్నారు.
-
హుందాగా రాజకీయాలు చేయండి : వైసీపీ
కృష్ణా: జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక వాహనంపై జరిగిన దాడిని గుడివాడ వైసీపీ నేతలు ఖండించారు. మహిళలను కన్నీరు పెట్టించిన రాజ్యాలే పోయాయి.. ఆఫ్ట్రాల్ మీరెంత అన్నారు. బీసీ,ఎస్సీ, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చి నేడు వారిపైనే దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. హుందాగా రాజకీయాలు చేయాలని.. లేకుంటే అడ్రస్ గల్లంతు అవడం ఖాయమన్నారు. పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
-
పేర్ని నాని ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
కృష్ణా: మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పెడనలో జరగనున్న వైసీపీ సభకు నాని వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అడ్డుకుంటున్నట్లు తెలియడంతో వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పెడన వెళ్లి తీరుతామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పేర్ని నాని ఇంటికి చేరుకున్నారు.
-
పేర్ని నానిపై ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఫైర్
కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నానిపై పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘బావ కళ్లల్లో ఆనందం చూడాలని మొద్దు శ్రీను పరిటాల రవిని చంపితే.. జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని పేర్ని నాని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చీకటిలో చంపేయండి, నరికేయండి అని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఎవరిని చంపుతారు..?టీడీపీ కార్యకర్తలనా..? ప్రభుత్వంపై బురదజల్లాలని నాని విశ్వప్రయత్నం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.