Locations: Krishna

  • గడ్డమణుగు పంచాయతీ నిధులు గోల్‌మాల్

    ఎన్టీఆర్: జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు పంచాయతీలో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు తెలుస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సుమారు రూ.10 లక్షల వరకు బొక్కేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పంచాయతీ నిధులపై PGRSలో నివేదిక కోరడంతో అసలు విషయం బయటపడింది. నిధుల గోల్‌మాల్‌పై రికార్డులు పరిశీలించామని, పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు.

  • సమ్మె బాటలో ఇంజినీరింగ్ కార్మికులు

    ఎన్టీఆర్: రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఇంజినీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

  • అమ్మమ్మ ఇంటికెళ్లి తప్పిపోయిన బాలుడు

    కృష్ణా: తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. నిమ్మకూరుకు చెందిన పడమట నిదిష్(7) శనివారం స్కూల్‌కు సెలవు కావడంతో అమ్మమ గ్రామమైన రొయ్యూరు వెళ్లాడు. గ్రామంలో ఆడుకోవటానికి వెళ్లి సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తండ్రి శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిదిష్ జుజ్జువరం ఉషోదయ స్కూల్‌లో తరగతి చదువుతున్నాడు.

  • బైక్ అదుపుతప్పి ఒకరికి గాయాలు

    ఎన్టీఆర్: విస్సన్నపేట లలితా సూపర్ మార్కెట్ క్రాస్ దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మారేమండ గ్రామం దళితవాడికు చెందిన ముళ్ళపూడి రాజుగా గుర్తించారు. 108 వాహనంలో బాధితుడిని అస్పత్రికి తరలించారు.

  • వంగవీటి రంగా ఫ్లెక్సీ చించివేత.. జనసైనికుల ఆందోళన

    కృష్ణా: మచిలీపట్నం బైపాస్ రోడ్డులో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. వంగవీటి మోహన రంగా ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడంతో జనసైనికులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా.. జనసైనికులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ఫ్లెక్సీలు చించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మంత్రి లోకేశ్ ఫ్లెక్సీని చించివేశారని ఆరోపించారు. వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

  • నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ

    ఎన్టీఆర్: పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణానదికి విడుదల చేయడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. శనివారం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 12,335 క్యూసెక్కులు విడుదల చేశారు. తూర్పు ప్రధాన కాలువకు 9,328, పశ్చిమ ప్రధాన కాలువకు 3,007, కేఈ ప్రధాన కాలువ నుంచి రైవస్ కాలువకు 1,717, ఏలూరు 1,404, బందరు 1,452 క్యూసెక్కుల చొప్పున అందించారు.

  • ‘సూపర్ స్వచ్ఛ లీగ్‌’కు విజయవాడ ఎంపిక

    ఎన్టీఆర్: దేశంలోని అందమైన నగరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే ‘సూపర్ స్వచ్ఛ లీగ్’ అవార్డుకు విజయవాడ నగరం అర్హత సాధించింది. 10లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల కేటగిరీలో దీనిని ఎంపిక చేశారు. ఈనెల 17న ఢిల్లీలో అధికారులు, ప్రజాప్రతినిధులు అవార్డు అందుకుంటారు. స్వచ్ఛభారత్ లీగ్‌లో నగరానికి స్థానం దక్కడం పారిశుధ్య కార్మికుల ఘనతేనని మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర ప్రశంసించారు.

  • ‘కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు’

    కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక వాహనంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పెడన మున్సిపల్ ఛైర్‌పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ అన్నారు. టీడీపీ, జనసేన రౌడీ మూకల దాడి చేశాయని మండిపడ్డారు. ఉన్నత పదవిలో ఉన్న ఛైర్‌పర్సన్‌కే రక్షణ లేకుండా ఇలా దాడులు చేస్తుంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.

  • ‘జెడ్పీ ఛైర్‌పర్సన్ వాహనంపై దాడి హేయం’

    కృష్ణా: గుడివాడలో వైసీపీ సభకు వెళ్తున్న జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక వాహనంపై దాడి చేయడాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధి అని చూడకుండా దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు.

  • రైతులు అధైర్య పడొద్దు: కృష్ణ ప్రసాద్

    కృష్ణా: బల్లిపర్రు లాకుల వద్ద నీటిని విడుదల చేసిన సందర్భంగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. పెడన నియోజవర్గంలోని నాలుగు మండలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రైతులు అధైర్య పడొద్దని చెప్పారు. డీసీ ఛైర్మన్లు పోతన స్వామి, నెక్కంటి భాస్కరరావు, బొర్రా కాశీ, పెడన జడ్పిటీసీ అర్జా నగేష్, కునప రెడ్డి వీరబాబు  కూటమి నాయకులు పాల్గొన్నారు.