Locations: Krishna

  • ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం మరిచారు: యడ్లపల్లి

    కృష్ణా: గుడివాడలో జరిగే వైసీపీ సమావేశానికి వెళ్తున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారికను అడ్డుకుని దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు వైసీపీ నేత యడ్లపల్లి రామ్ సుధీర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌కే రక్షణ లేకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

  • ఈగల్, టాస్క్ ఫోర్స్ టీమ్‌లు నిత్యం తనిఖీలు చేస్తాయి: DCP

    ఎన్టీఆర్: నందిగామలో డీసీపీ మహేశ్వరరాజు క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. సబ్ డివిజన్ పోలీసులు విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈగల్, టాస్క్ ఫోర్స్ టీమ్‌లు నిత్యం తనిఖీలు చేస్తాయని చెప్పారు. మహిళల భద్రత, స్కూల్, కాలేజీ విద్యార్థినుల రక్షణకు శక్తి టీమ్‌ల నిఘా ఉంటుందన్నారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏసీపీ తిలక్ పాల్గొన్నారు.

  • చల్లపల్లి దుకాణాల్లో పోలీసుల తనిఖీలు

    కృష్ణా: ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చల్లపల్లిలో ఎస్సై సుబ్రహ్మణ్యం శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు షాపులను పరిశీలించారు. మత్తు పదార్థాల అమ్మకాలు జరుగుతున్నాయా లేదా అని తనిఖీ చేశారు. దుకాణాల్లో మత్తు పదార్థాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో చల్లపల్లిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించడానికి, సమాజంలో భద్రతను కాపాడడానికి చేసినట్లు ఎస్సై తెలిపారు.

  • అన్ని వర్గాల సంక్షేమానికి కృషి: వెనిగండ్ల

    కృష్ణా: అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. శనివారం గుడివాడ రూరల్ మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. చౌటపల్లి, మల్లయ్య పాలెం గ్రామాల్లో రాము ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. గ్రామాల్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. రావి పాల్గొన్నారు.

  • అవనిగడ్డ PSలో పేర్నిపై కేసు ఫైల్!

    కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నానిపై ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. వైసీపీ కర్యకర్తల సమావేశంలో నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆయా పోలీసు స్టేషన్లలో కంప్లైట్ చేస్తున్నారు. నాని హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర నేత కనపర్తి అవనిగడ్డ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు అయినట్లు సమాచారం.

  • మాజీ మంత్రి పేర్ని హౌస్ అరెస్ట్

    కృష్ణా: గుడివాడలో జరుగుతున్న “బాబు షూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమానికి హాజరుకాకుండా మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో నాని వ్యాఖ్యలకు నిరసనగా.. గుడివాడ వస్తే అడ్డుకుంటామని టీడీపీ శ్రేణులు తేల్చి చెప్పారు. ఉద్రిక్తలు తలెత్తకుండా పోలీసులు ముందుగానే అప్రమత్తం అయినట్లు తెలుస్తుంది. సమావేశానికి వెళ్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారును అడ్డుకున్నారు.
  • పేర్ని నానిపై బందరులో ఫిర్యాదు

    కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నానిపై బందరు మండల టీడీపీ నాయకులు మచిలీపట్నం తాలుకా పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో పేర్ని చేసిన విద్వేషకరమైన వ్యాఖ్యలపై మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్టేషన్ అధికారులకు కంప్లైట్ లెటర్ ఇచ్చారు. ‘కన్ను కొడితే  చీకట్లో అన్నీ అయిపోవాలి’ అంటూ నాని చేసిన వ్యాఖ్యలపై నేతలు మండిపడ్డారు.

  • గని ఆతుకూరులో ఇంటింటికి సంక్షేమం

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గని ఆతుకూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ షేక్ ఇబ్రహీం నాయకత్వంలో నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని కరపత్రాలు అందించి ప్రజలకు వివరించారు. ఎంపీటీసీ వెంపరాల వెంకటేశ్వరరావు, మాజీ డీసీ ఛైర్మన్ దొండపాటి భాస్కరరావు, ఉప్పెర్ల ఆంజనేయులు, మూరుకొండ ఏడుకొండలు, షేక్ జానీ, కార్యకర్తలు పాల్గొన్నారు.
  • రైతులకు పూర్తి నీరు ఇవ్వాలి: కాగిత

    కృష్ణా: పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఇరిగేషన్ అధికారులతో సమావేశం అయ్యారు. రైతుల నీటి సమస్యలపై చర్చించారు. గుడ్లవల్లేరు లాకుల ద్వారా పంట నీరు సక్రమంగా అందించాలని సూచించారు. కృత్తివెన్ను మండలానికి పూర్తి నీరు సరఫరా చేయాలన్నారు. మల్లేశ్వరం వంతెన వద్ద 5 అడుగుల నీరు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో డీసీ ఛైర్మన్లు, నీటి సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

  • కార్యకర్తలను మనుషుల్లా చూడాలి: YCP నేత

    AP: గుడివాడలో నిర్వహించిన పార్టీ సమావేశంలో YCP నేత రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ వాలంటీర్లకు ఇచ్చిన విలువ కార్యకర్తలకు ఇవ్వలేదు. కార్యకర్తలు పని చేయకపోవడం వల్లే గుడివాడలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉండగా కార్యకర్తలను పార్టీ పట్టించుకోలేదు. ఇప్పటికైనా కార్యకర్తలను మనుషుల్లా చూడాలి’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.