Locations: Krishna

  • పేర్ని నానిపై కనపర్తి ఘాటు వ్యాఖ్యలు

    కృష్ణా: బియ్యం దొంగతనం కేసులో భార్యను అడ్డుపెట్టుకొని జైలు నుంచి తప్పించుకున్న వ్యక్తి మంత్రి లోకేష్‌ను విమర్శించడం సిగ్గుచేటని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఎద్దేవ చేశారు. లోకేష్ పేరు ఎత్తితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు మేలు చేస్తుందన్నారు.
  • అండగా ఉంటాం: సింహాద్రి

    కృష్ణా: అవనిగడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ శనివారం చల్లవల్లిలో పర్యటించారు. గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన మున్వర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మృతుని తండ్రి మైనార్టీ సెల్ నాయకుడు అబ్దుల్ బాబుకు ధైర్యం చెప్పారు. మున్వర్ మృతికి కారణాలు, పిల్లల చదువుపై ఆరా తీశారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాయకులు మోపిదేవి ద్వారకానాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
  • గంజాయితో నలుగురు యువకుల అరెస్ట్

    ఎన్టీఆర్: తిరువూరు పట్టణంలో గంజాయి వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరి వెంచర్ ప్రాంతంలో నలుగురు యువకులు గంజాయి పంచుకొని వినియోగిస్తున్నట్లు సమాచారం అందడంతో, తహసీల్దార్ ఉదయ్ భాస్కర్, వీఆర్వోలు, పోలీస్ సిబ్బంది అకస్మాత్తుగా దాడి చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై NDPS చట్టం సెక్షన్ కేసు నమోదు చేశారు.
  • గుడివాడలో ఉద్రిక్తత.. జడ్పీ ఛైర్ పర్సన్ కారు ధ్వంసం

    AP: కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. YCP విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారు అద్దాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. కారును కదలనివ్వకుండా టీడీపీ, జనసేన శ్రేణులు అడ్డుకున్నాయి. విషయం తెలుసుకొని కే కన్వెన్షన్ నుంచి వైసీపీ శ్రేణులు బయలుదేరడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

  • పేర్ని నాని రెచ్చగొట్టేలా మాట్లాడటం దుర్మార్గం: మత్తి

    కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు ఖండించారు. ఆయన మాటలు అర్థ రహితం అన్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు. తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

  • కరీం సేవలు అభినందనీయం

    ఎన్టీఆర్: విస్సన్నపేట కబరిస్తాన్ (స్మశాన వాటిక) ప్రాంగణంలో 8వ వార్డు మెంబెర్ షేక్ కరీం సౌజన్యంతో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం స్థానిక సమాజానికి మేలు చేసే దిశగా ఒక ముఖ్యమైన చర్య. అదేవిధంగా కబరిస్తాన్‌కు తూర్పు వైపు గోడ నిర్మాణానికి త్వరలోనే దాతల సహాయ సహకారాలతో పనులు ప్రారంభించనున్నట్లు కరీం ప్రకటించారు.
  • గుడ్లవల్లేరు ఛానెల్‌కు నీరు విడుదల

    కృష్ణా: బల్లిపర్రు లాకుల నుంచి గుడ్లవల్లేరు ఛానెల్‌కు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నీటిని విడుదల చేశారు. అన్నదాతల ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. జడ్పీటీసీ అజ్జనగేష్, బీసీ ఛైర్మన్లు పోతన స్వామినాయుడు, నెక్కంటి భాస్కర్ రావు, బొర్రా కాశి, బంటుమిల్లి మండల టీడీపీ అధ్యక్షుడు ఉన్నపురెడ్డి వీరబాబు, పెడన మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి సీతారాం, రైతులు పాల్గొన్నారు.

  • కుక్క తెచ్చిన కొట్లాట

    AP: కృష్ణా జిల్లా పటమట పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ పెంపుడు కుక్క విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం రామలింగేశ్వర్‌నగర్‌కు చెందిన రామారావు అనే వ్యక్తి.. తన మనవరాలిని కళాశాల బస్సు ఎక్కించేందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో అభి అనే యువకుడు జాగింగ్‌ చేస్తూ.. తనతో తీసుకువచ్చిన పెంపుడు కుక్కను యువతిపై వదిలిపెట్టాడు. దీంతో ఇరు కుటంబాల మధ్య ఘర్షణ జరిగింది.

  • గుడివాడలో ఉద్రిక్తత

    AP: కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ కూడా పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు షూను కొడాలి నాని తుడుస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

  • మంగోల్లులో తండ్రి కొడుకులపై కత్తితో దాడి

    ఎన్టీఆర్: వత్సవాయి మండలం మంగోల్లులో శనివారం వివాదం జరిగింది. గత రాత్రి జరిగిన స్వల్ప గొడవను మనుసులో పెట్టుకుని ప్రత్యర్థులు కత్తితో దాడి చేశారు. సంఘటనలో తండ్రి రాయవరపు నాగేశ్వరావు (48) కొడుకు శ్రీకాంత్ (23) గాయపడ్డారు. బంధువులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.