కృష్ణా: మోపిదేవి గ్రామంలోని శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కందుకూరుకు చెందిన తాళం నితిన్ కుమార్ కుటుంబం రూ.2.25లక్షలు విలువైన 2 కేజీల 300 గ్రాముల వెండి బిస్కెట్లు బహుకరించారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావును కలిసి వెండి బిస్కెట్లు అందజేశారు. అనంతరం దాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ మర్యాదలతో సత్కరించారు.
Locations: Krishna
-
కానిస్టేబుల్ అభ్యర్థులను అభినందించిన ఎస్సై
ఎన్టీఆర్: ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి కుమార్ కోచింగ్ సెంటర్ ఆర్గనైజర్ అప్పికట్ల కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ పోస్టుల పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన కానిస్టేబుల్ అభ్యర్థులను ఎస్సై అభినందించారు. విద్యార్థులు సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వకుండా… సాంకేతికతను సద్వినియోగం చేసుకొని రాణించాలని ఆకాంక్షించారు.
-
కంచికచర్లలో స్వల్ప వర్షం!
ఎన్టీఆర్: కంచికచర్లలో శనివారం ఉదయం 5, 6 గంటలకు స్వల్ప జల్లులు కురిశాయి. గత పది రోజులుగా చిరు వర్షాలు కురుస్తున్నాయి. కానీ తీవ్ర ఎండలతో నువ్వు, పెసర, మినుము, మొక్కజొన్న, పత్తి పంటలు వడలిపోతున్నాయి. నువ్వు పంట పూత పిందె దశలో ఉంది. నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిస్తే పంటలకు లాభం ఉంటుందని రైతులు తెలిపారు. వరి నాట్లకు భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
-
నందిగామ సబ్ జైలులో జడ్జి తనిఖీలు
కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ జడ్జి&న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ గుత్తల గోపి నందిగామ సబ్ జైలును శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నందిగామ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు ఆధ్వర్యంలో కోర్టు హాలులో ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కృష్ణయ్య, శ్రీనివాసరావు, సత్యలక్ష్మి ప్రసన్న సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. కోర్టు సమస్యలపై జడ్జి గోపి సానుకూలంగా స్పందించారు. -
పేర్ని నానిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
కృష్ణా: మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పేర్ని నానిపై మచిలీపట్నం ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గత రెండు మూడు రోజులుగా వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటున్న పేర్ని నాని హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నగర అధ్యక్షులు లోగిశెట్టి స్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు.
-
‘రాజధాని కోసం 40 వేల ఎకరాల భూమి అవసరం’
ఎన్టీఆర్: విజన్-2040 రాజధాని భవిష్యత్ కోసం 40 వేల ఎకరాల భూమి అవసరమని, రైతులు స్వచ్ఛందంగా రాజధాని అభివృద్ధి కోసం భూములు ఇవ్వాలని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తెలిపారు. తననివాసంలో మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి శ్రమిస్తోందని, గతంలో 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. గతప్రభుత్వం అభివృద్ధి చేయలేదని, పోలవరం, మడకచర ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని పేర్కొన్నారు.
-
చంద్రబాబు కాళ్ల వద్ద కొడాలి నాని.. గుడివాడలో ఫ్లెక్సీ..!
AP: కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. మాజీ మంత్రి కొడాలి నాని.. సీఎం చంద్రబాబు బూట్‌ను పాలిష్ చేస్తున్నట్లు నెహ్రూచౌక్ సెంటర్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘‘కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ల దగ్గరే పడుంటా’’ అంటూ నాని చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ వెలసింది.
-
కుక్క తెచ్చిన తంట.. వైసీపీ, జనసేన శ్రేణుల మధ్య స్ట్రీట్ ఫైట్
ఎన్టీఆర్: విజయవాడ రామలింగేశ్వరనగర్‌లో YCP, జనసేన శ్రేణుల మధ్య స్ట్రీట్‌ఫైట్ జరిగింది. జనసేన నేత కుమారుడు తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్తుండగా..అటుగా వచ్చిన మాజీ డిప్యూటీ మేయర్ మనవరాలి పైకి కుక్క దూకింది. దీంతో మాజీ డిప్యూటీ మేయర్ అనుచరులు అతడిపై దాడికి పాల్పడ్డారు. జనసేన శ్రేణులు రావడంతో ఇరువురిమధ్య తోపులాట జరిగింది. ఇరుపార్టీల నేతలు కృష్ణలంక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
-
యూరియా కొరత.. రైతుల ఆందోళన!
ఎన్టీఆర్: కంచికచర్ల సబ్ డివిజన్ పరిధిలో గల కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో రైతులు యూరియా దొరకక బ్లాక్ మార్కెట్లో బస్తాకు రూ.50 అదనంగా కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో పంటలకు ఎరువులు వేయాల్సిన సమయం ఇది. మార్కెట్‌లో యూరియా లభించక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరతను నివారించాలని కోరుతున్నారు.
-
విజయవాడలో డ్రగ్స్ కలకలం
ఎన్టీఆర్: విజయవాడలో డ్రగ్స్ కలకలం రేపాయి. ముగ్గురు యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తుండగా 5 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుకున్నారు. నిందితులను హైదరాబాద్‌కు చెందిన ఆకాష్, కపిలేశ్వరపురానికి చెందిన మణికంఠ, విజయవాడకు చెందిన కౌశిక్‌లుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి తెచ్చి విజయవాడలో అమ్ముతున్నట్లు నిర్థారించారు.