Locations: Krishna

  • ‘మహాసభను విజయవంతం చేయాలి’

    ఎన్టీఆర్: హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో  ఈనెల 15న తిరువూరులో జరగనున్న నాలుగవ మహాసభను విజయవంతం చేయాలని సీఐటీయూ సీనియర్ నాయకులు భద్రం, వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందని, ముఠా కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

     

     

  • ‘పేర్ని నాని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’

    కృష్ణా: అవనిగడ్డ సభలో మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. తక్షణమే నాని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అభివృద్ధి, సంక్షేమాలకు తొలి ఏడాదిలోనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రూ.822 కోట్లతో ఖర్చు పెట్టినట్లు తెలిపారు.

  • హాట్ హాట్‌గా గుడివాడ పాలిటిక్స్

    కృష్ణా: గుడివాడ రాజకీయాలు ఒక్కసారిగా హాట్‌హాట్‌గా మారిపోయాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో సాయంత్రం 4గంటలకు కే కన్వెన్షన్‌లో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ సమావేశం జరగనుంది. అటు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3గంటలకు నాగవరప్పాడులో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కే కన్వెన్షన్‌కు వెళ్లడానికి నాగవరప్పాడు ఏకైక మార్గం కావడంతో ఏం జరుగుతుందోనని పోలీస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది.

  • సమ్మె బాటలో కార్మికులు

    ఎన్టీఆర్: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 12వ తేదీ అర్థరాత్రి నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు సీఐటీయూ పిలుపునిచ్చిందని ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ తెలిపారు. ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని,  కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

     

  • పేర్ని నానికి దేవినేని ఉమా కౌంటర్

    ఎన్టీఆర్: మాజీ మంత్రి పేర్ని నానికి TDP నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ‘‘చీకట్లో కన్ను కొట్టే తప్పుడు పనులు చేయబట్టే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి బలిచేసేందుకే ప్రభుత్వం వచ్చాక సైలెంట్‌గా వేసెయ్యాలంటూ పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నాడు. జగన్ అంతరంగంలో ఉన్న మాటలే ప్రసన్నకుమార్‌రెడ్డి, పేర్ని నానిలు మాట్లాడుతున్నారు’’ అన్నారు.

  • గన్నవరం పీఎస్‌కు వల్లభనేని వంశీ

    కృష్ణా: గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చారు. వంశీ రాకతో స్టేషన్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. మైనింగ్ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. కాగా ఈనెల 7న తీవ్ర జ్వరంతో వంశీ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతలో కూడా కోర్టు ఆదేశాల మేరకు పటమట, వీరవల్లి, హనుమాన్‌జంక్షన్, గన్నవరం పోలీస్‌స్టేషన్లలకు వచ్చి సంతకాలు చేశారు.

  • దేవినేని ఉమాను కలిసిన సుబ్బారావు

    ఎన్టీఆర్: టీడీపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును విస్సన్నపేట మండల టీడీపీ నూతన అధ్యక్షుడు రాయల సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన కార్యాలయంలో కలిసి ఉమా ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో విస్సన్నపేట వార్డు సభ్యులు అనుమోలు శివ బాజీ పాల్గొన్నారు.

  • ప్రజా సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే

    కృష్ణా: బంటుమిల్లి మండలం మలపరాజుగూడెంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలును ప్రజలకు వివరించి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వాటిని పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

     

  • కారు భీభత్సం.. బాలుడు మృతి

    కృష్ణా: కంకిపాడులోని అంకమ్మతల్లి గుడి వద్ద ఓ కారు భీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు ఆడుకుంటున్న బాలుడు మోక్షిత్(7)ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • వెంకట్రావుకు టీడీపీ నేతల పరామర్శ

    ఎన్టీఆర్: విస్సన్నపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత నందమూరి వెంకట్రావును పార్టీ మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు& టీం పరామర్శించింది. ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ముత్తం శెట్టి వంశీరాం, రంగారావు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.