ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం తెలదేవరిపల్లిలో టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన రాయల సుబ్బారావుకు ఘన సన్మానం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డ్రైవర్ హరి, మంత్రి సవితమ్మ డ్రైవర్ వేణు, రాము, రాంబాబు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
Locations: Krishna
-
వాహనాల తనిఖీ..మైనర్లకు జరిమానా
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఇద్దరు మైనర్లకు ట్రాఫిక్ ఆర్ఎస్సై లక్ష్మణరావు భారీ జరిమానా విధించారు. జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసులు స్థానిక రింగ్ సెంటర్‌లో వాహనాలు తనిఖీ చేశారు. ఇందులో రెండు బైక్‌లను మైనర్లు నడుపుతున్నట్లు గుర్తించి రూ.7035 చొప్పున జరిమానా విధించారు.
-
సంక్షేమ పథకాలపై ప్రచారం
ఎన్టీఆర్: సపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా, నందిగామ పట్టణం 10 మరియు 9వ వార్డులలో మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి మరియు కూటమి నేతలతో కలిసి ప్రజలకు కరపత్రాలను పంచుతూ వారికి అందిస్తున్న పథకాలను మరియు రాబోయే కాలంలో అందించబోయే సంక్షేమం గురించి వివరించిన నందిగామ నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోసు , కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 30: సీపీ
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం జూలై 10 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు విజయవాడ సీపీ రాజశేఖరబాబు తెలిపారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న సమయంలో సభలు, ఊరేగింపులు, నిరసనలు, ధర్నాలు చేయాలంటే అనుమతి తీసుకోవాలని ఆయన కోరారు.
-
రేపు విజయవాడలో చెస్ జట్ల ఎంపిక పోటీలు
ఎన్టీఆర్: విజయవాడలోని భవానీపురం శివాలయం వీధిలో ఉన్న ఆచార్య ఇనిస్టిట్యూట్‌లో ఈ నెల 13వ తేదీ జిల్లా అండర్-13 బాలబాలికల చెస్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని ది విజయవాడ చెస్ సంఘం అధ్యక్షులు అక్బర్‌పాషా తెలిపారు. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బాల బాలికలను జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు వివరాలకు 9030308811ను సంప్రదించాలని కోరారు.
-
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో చోరీ చేసిన దొంగల అరెస్ట్
కృష్ణా: గన్నవరంలో ఈనెల 2న అర్ధరాత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అద్దాలు పగలగొట్టి.. స్టాంపులు, నగదు అపహరించిన ఇద్దరు దొంగలను గన్నవరం పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేశారు. డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.14లక్షల విలువైన స్టాంపులు, నోటు బిళ్లులు దొంగలించారని తెలిపారు. కేసును ఛేదించిన గన్నవరం, క్రైమ్‌బ్రాంచ్ పోలీసులను అభినందించారు.
-
వాటికి ముందస్తు అనుమతి తప్పనిసరి: CP
ఎన్టీఆర్: విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణ కోసం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నేటి నుంచి అక్టోబరు 9 వరకు నిషేధాజ్ఞలు అమలు చేశారు. సభలు, ఊరేగింపులు, నిరసనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-
‘దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
కృష్ణా: ఘంటసాల మండలం దేవరకోట ప్రభుత్వ పాఠశాలలో ఎన్నారై దోనేపూడి శాయిజీ తన తల్లి మునీశ్వరమ్మ జ్ఞాపకార్థం 23 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు, పాఠశాలకు సహకారం అందిస్తున్న శాయిజీ కి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
-
‘రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’
కృష్ణా: వైసీపీ నిర్లక్ష్యంతో శిథిలమైన సాగునీటి పథకాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని తమ కార్యాలయంలో ఏపీఎస్ఐడీసీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చెన్నారెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకాల పునరుద్ధరణకు రూ.59.33 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
-
ఇంటింటికీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
కృష్ణా: పెడన పట్టణంలోని 7వ వార్డులో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలును ప్రజలకు వివరించి, వారి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులుకు ఆదేశించారు.