Locations: Krishna

  • ఎమ్మెల్యేను సత్కరించిన ఏఎంసీ డైరెక్టర్

    కృష్ణా: నాగాయలంక మండలం బర్రంకుల గ్రామానికి చెందిన జనసేన పార్టీ వీర మహిళ, ఏఎంసీ డైరెక్టర్ పిరాటి శిరీష శుక్రవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను సత్కరించారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను శిరీష, బలరాం దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. తనను దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టరుగా సిఫార్సు చేసి పదవి లభించేందుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

  • మోపిదేవిలో పొగాకు ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్

    కృష్ణా: జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ఆదేశాల మేరకు మోపిదేవి పీ‌ఎస్ పరిధిలో ఎస్‌ఐ సత్యనారాయణ “ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్”లో భాగంగా పాఠశాలలు,కళాశాలల సమీపాల్లో ఉన్న పొగాకు ఉత్పత్తులు విక్రయించే దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై జరిమానాలు విధించారు. విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మకానికి లేదు అనే బోర్డులు ఏర్పాటుచేయాలని వ్యాపారులకు సూచించారు.

     

  • ప్రతి బుల్లెట్ లక్ష్యాన్ని ఛేదించేలా శిక్షణ పొందాలి: SP

    కృష్ణా: మంగినపూడి పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు స్వయంగా పాల్గొని అధికారులకు ఫైరింగ్ శిక్షణ ఇచ్చారు. ప్రతి బుల్లెట్ లక్ష్యాన్ని ఛేదించేలా, క్రమశిక్షణతో, ఏకాగ్రతతో శిక్షణ పొందాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు సంసిద్ధంగా ఉండాలని, అధికారులలో ఉత్సాహం, మనోధైర్యం నింపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమని ఎస్పీ సూచించారు.

  • అంకమ్మ తల్లి దేవాలయ తృతీయ వార్షికోత్సవాలు ప్రారంభం

    ఎన్టీఆర్: నందిగామ మండలం పాతకంచల గ్రామంలో పల్నాటి వీర్ల అంకమ్మ తల్లి, లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ తృతీయ వార్షికోత్సవాలు శుక్రవారం ప్రారంభించారు. చెన్నకేశవ స్వామి కొణతాలను మునేట్లో అభిషేకం చేసి గ్రామంలో ఊరేగించారు. మూడు రోజులు పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి.

  • NTR కమిషనరేట్‌ పరిధిలో 30 పోలీస్ యాక్ట్

    ఎన్టీఆర్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 10 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు CP రాజశేఖరబాబు తెలిపారు. ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు, నిరసనలు, ధర్నా కార్యక్రమాలు ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించకూడదన్నారు.

  • ‘రైతుల అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి’

    కృష్ణా: నందమూరు విశాల సహకార పరపతి సంఘాన్ని శుక్రవారం మండల వ్యవసాయ శాఖ అధికారి సబ్జా జేన్ని సందర్శించారు. ఈ సందర్బంగా సొసైటీ సీఈవో రామమోహనరావును అడిగి ఎరువుల అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలను పరిశీలించారు. రైతుల అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

  • ‘దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్’

    ఎన్టీఆర్: విజయవాడలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌తో కలిసి కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి సమగ్రమైన మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనాచౌదరి తెలిపారు. రాబోయే 50ఏళ్లకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ ప్రణాళికలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, మెరుగైన వసతులు, అధునాతన పార్కింగ్ వ్యవస్థ, విశ్రాంతి భవనాల నిర్మాణం, ఆలయ పరిసరాలను సుందరీకరించడం వంటి అంశాలపై దృష్టి సారించామన్నారు. కృష్ణ పుష్కరాల నాటికి పూర్తిచేసేలా కృషిచేస్తానని పేర్కొన్నారు.

  • ‘ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే.. ఊరుకోం’

    కృష్ణా: ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కొందరు స్వార్థానికి వాడుకుంటే సహించమని జిల్లా మాల మహానాడు అధ్యక్షులు దోవా గోవర్ధన్ అన్నారు. ప్రేమ పేరుతో మోసాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కోడూరు ఘటనలో కొందరు అట్రాసిటీ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని గోవర్ధన్ స్పష్టం చేశారు.

  • ‘కూటమి రాకతో గ్రామాల్లో సుపరిపాలన’

    కృష్ణా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తిరిగి అభివృద్ధిని పరుగులు పెట్టించిందని, గ్రామాలకు సుపరిపాలన అందుతుందని  ఎమ్మెల్యే వెనిగండ్ల  రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలంలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గత పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమ పథకాలు సక్రమంగా అందలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

  • పెడనలో అభివృద్ధి పనుల పరిశీలన

    కృష్ణా: 15వ ఆర్థిక సంఘం నిధులతో పెడన మున్సిపల్ ఆఫీస్ ముందు రోడ్డు, ఎంట్రన్స్ ఆర్చ్, కల్వర్టు పనులను,పెడన మున్సిపల్ చైర్ పర్సన్ కటకం నాగకుమారి ఆదేశాల మేరకు పనులను వైస్ చైర్మన్ మొహమ్మద్ ఖాజా, కౌన్సిలర్ కటకం ప్రసాద్  పర్యవేక్షించారు. వీరితో పాటు మున్సిపల్ ఏఈ కాగిత సీతారామాంజనేయులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.