Locations: Krishna

  • ‘ప్రభుత్వం మారినా.. మారని బోర్డులు’

    ఎన్టీఆర్: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జనసేన పార్టీ అధ్యక్షులు షేక్.యాసిన్ పరిశీలించారు. ప్రభుత్వం మారి ఏడాది దాటినా మిడ్‌డే మీల్స్, నాడు-నేడు బోర్డులు, గత ప్రభుత్వం క్యాలెండర్లు మారకపోవడాన్ని ఆయన గుర్తించారు. కొంతమంది విద్యార్థులకు యూనిఫామ్‌లు లేకపోవడాన్ని గమనించి, ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు  పాల్గొన్నారు.

  • ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే

    కృష్ణా: కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామం లో  “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలును ప్రజలకు వివరించి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులుకు ఆదేశించారు.

  • కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు.. గంజాయి చాక్లెట్లు పట్టివేత

    ఎన్టీఆర్: విజయవాడ రైల్వేస్టేషన్‌లో కోరమాండల్‌ రైలులో శుక్రవారం రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో ప్యాక్‌ చేసిన చాక్లెట్లను తీసుకెళ్తుండగా యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్టు రైల్వే డీఎస్పీ రత్నరాజు తెలిపారు. గంజాయిని చాక్లెట్‌ ఉండలుగా మార్చి రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

  • రాసలీలలకు అడ్డాగా ATM సెంటర్‌

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ATM సెంటర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ కలకలం రేపుతోంది. అదే బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న తాళ్లూరి రామానుజులు పగటిపూట పనివేళల్లో నగదు విత్‌డ్రా చేయడానికి వచ్చిన మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సీసీ ఫుటేజ్ ఉందని మరిచి అతను చేసిన ఈ చర్యపై ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • ‘రంగారావు నియామకానికి హర్షాతిరేకాలు’

    కృష్ణా: వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ విభాగానికి చెన్ను రంగారావు నియామకం పట్ల చల్లపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం చల్లపల్లి విచ్చేసిన రంగారావుని సన్మానించారు. అనంతరం ఆయన జమ్మిలంక అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో ఉప్పల ఉమామహేశ్వరరావు, ఉప్పల కృష్ణకాంత్, ఉప్పల శేఖర్, ఈశ్వరపు సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.

  • ‘ప్రజల్ని దోచుకోవడానికి అనుమతించడం సిగ్గుచేటు’

    కృష్ణా: గుడివాడలోని జగనన్న కాలనీలో ఆదాని కంపెనీ ఉద్యోగులు తాళం వేసి ఉన్న ఇళ్ళకి , నిర్మాణంలో ఉన్న ఇళ్ళకి కూడా మీటర్లను బిగిస్తుండగా సీపీఎం కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న కరెంట్ ఆఫీస్ దగ్గర నిరసన తెలిపారు. సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్‌సీపీరెడ్డి మాట్లాడుతూ..ప్రజల్ని అడ్డగోలుగా దోచుకునే అదానీ కంపెనీకి విద్యుత్ సంస్థలను కట్టబెట్టి,ప్రజల్ని దోచుకోవడానికి అనుమతించడం సిగ్గుచేటు అన్నారు.

  • జీతాలు పెంచాలి.. లేకుంటే నిరవధిక సమ్మె

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్36 ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలి లేని పక్షంలో జూలై 12 అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తామని సీఐటీయు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ అన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

     

  • ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం..

    పల్నాడు: బొల్లాపల్లి మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30 మంది ప్రయాణికులతో వినుకొండ నుంచి గరికపాడు మీదుగా కారంపూడికి బస్సు వెళుతుంది. మార్గమధ్యంలో రేమిడిచర్ల వద్దకు వచ్చే సరికి బస్సు స్టీరింగ్ రాడ్ ఊడి పోయి అదుపు తప్పింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో  అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • సాంకేతిక విద్యారంగంలో నిపుణులుగా ఎదగాలి: ఎమ్మెల్యే

    కృష్ణా: విద్యార్థులు సాంకేతిక విద్యారంగంలో నిపుణులుగా ఎదగాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం చల్లపల్లిలోని విజయ క్రాంతి జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ ఇంటర్ విద్యార్థులు ప్రతిభతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు.

  • రొట్టెల పండగలో పాల్గొన్న చిట్టిబాబు

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు నెల్లూరు జిల్లాలోని రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మొహరం సందర్భంగా బారాషహీద్ దర్గాను శుక్రవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీడీపీ నేతలతో కలిసి దర్గాలో మొక్కు తీర్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌లకు మంచి జరగాలని ఆయన ప్రార్ధించారు.