
Locations: Krishna
-
తిరువూరు సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్!
ఎన్టీఆర్: తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న బానోతు జగన్‌పై పలు అవినీతి ఆరోపణలు రావటంతో..ఆయన జరిపిన రిజిస్ట్రేషన్‌లపై ఉన్నతాధికారులు గతవారం రోజులుగా విచారణ చేపట్టారు. రాజధాని పరిధిలోని వడ్లమానుచెరువు పంటపొలాలను తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేసినట్లు నిర్థారణ అయింది. ఈమేరకు రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ రవీంద్రనాథ్ బానోత్ జగన్‌ను సస్పెండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా దగాని శ్రీనివాస్‌ను నియమించారు. -
అవినిగడ్డ DSPకి బెదిరింపు కాల్స్.. మరి చర్యలేవి?.. YCP నేత సూటి ప్రశ్న
కృష్ణా: అవనిగడ్డ డీఎస్పీ శ్రీదేవిపై రేషన్, ఇసుక అక్రమ రవాణాలు కొనసాగించాలంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఇటీవల ప్రెస్‌మీట్‌లో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ఆమె కేసు ఎందుకు నమోదు చేయలేదు, ఫోన్ చేసిన వారి పేర్లు, నంబర్లు ఎందుకు వెల్లడించలేదని వైసీపీ నేత గౌతమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డీఎస్పీ స్థాయిలో బెదిరింపులు వస్తే కనీసం ఆధారాలను భద్రపరచాలేదా అని ప్రశ్నించారు. -
తాడిగడపకు అత్యాధునిక చెత్త వాహనాలు
కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో చెత్తను సేకరించి తరలించడానికి పురపాలక శాఖ ఆధ్వర్యంలో రెండు అత్యాధునిక హంగులు కలిగిన వాహనాలు మున్సిపాలిటీకి చేరుకున్నాయి. ఈ వాహనాల రాకతో రోజుల కొద్ది మున్సిపాలిటీలో పేరుకుపోతున్న చెత్తను ఎప్పటికప్పుడు డంప్ యార్డ్‌కు తరలించే ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
-
ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ
ఎన్టీఆర్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కంచికచర్లలో నెహ్రూ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ ఆఫీసర్ మాధవి, తహశీల్దార్ నరసింహారావు, ఎంపీడీవో లక్ష్మి కుమారి, కంచికచర్ల ఆరోగ్య కేంద్రం డాక్టర్ మధురిమ, హెల్త్ సూపర్వైజర్ రాఘవేంద్రరావు, సౌరీలమ్మ, సబ్ యూనిట్ వైద్యాధికారి శ్రీనివాసరావు, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
-
నందిగామలో ‘మీడియేషన్ సెంటర్’
ఎన్టీఆర్: నందిగామ కోర్టుల ప్రాంగణంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మీడియేషన్ సెంటర్ కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రియాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెండు వర్గాల మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించి, రాజీకి చేర్చడం మీడియేషన్ లక్ష్యమని ఆయన తెలిపారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి అద్దంకి మణిబాబు, న్యాయవాదులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలపై ప్రచారం
ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి పంచాయతీలోని నర్మద నగర్‌లో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు రాయల సుబ్బారావు ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. టీడీపీ నాయకుడు రేగముడి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను ఇంటింటికీ వివరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
NRI గిరిబాబుకు సన్మానం
ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం లక్ష్మీపురంలో NRI వల్లభనేని గిరిని టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొంగల శ్రీనివాసరావు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం’
కృష్ణా: గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకల్ల నారాయణరావులు పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో రూ. 33 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును వారు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభ్యున్నతికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు.
-
డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ
ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం తాతకుంట్లలో డెంగీ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దోమ కాటు ద్వారా వ్యాపించే వ్యాధులను మండల వైద్యాధికారి శ్రీనివాసరావు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చిన్న రాట్నాలు, మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ తిరుపతిరావు, సాంబశివరావు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
-
‘శాశ్వత అధికారి నియమించాలి’
కృష్ణా: బంటుమిల్లి మండలంలో ఉదయం 11:50 గంటల వరకు గృహ నిర్మాణ శాఖ అధికారులు రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న హౌసింగ్ ఏఈ ఇన్‌ఛార్జ్‌గా కృత్తివెన్ను మండలం కూడా చూస్తుండటంతో సమయానికి రాలేనని వివరణ ఇస్తున్నారు. దీంతో స్థానికులు శాశ్వత అధికారి నియమించాలని కోరుతున్నారు.