Locations: Krishna

  • అవనిగడ్డ నుంచి వాడపల్లికి ప్రత్యేక బస్సు

    కృష్ణా: అవనిగడ్డ ఆర్టీసీ డిపో నుంచి ప్రతి శనివారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి (కోనసీమ తిరుపతి) ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపారు. ఈ 12వ తేదీ నుంచి బస్సులు తిరుగుతాయని, మచిలీపట్నం, బంటుమిల్లి మీదుగా వెళ్లి దర్శనం ఉంటుందన్నారు. రిజర్వేషన్ సౌకర్యం ఉందని, చార్జీ రూ.540గా నిర్ణయించామన్నారు. వివరాలకు 9959225466, 9963658630లను సంప్రదించాలని సూచించారు. 
  • కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి

    AP : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయానికి శుక్రవారం వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కృష్ణా నదిలో స్నానమాచరించి ఘాట్ రోడ్డు, మహా మండపం మీదగా కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. దుర్గమ్మ వారిని దర్శించుకుని భక్తులు తమ కోరికలు తీరిన నేపథ్యంలో వారి మొక్కులు సమర్పించుకుంటున్నారు. కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి శుక్రవారం రోజున ఆషాఢ సారె సమర్పిస్తున్నారు.

  • ఫోను మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే చర్యలు: ఎస్సై

    ఎన్టీఆర్: పాసింజర్లతో వెళుతూ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని కంచికచర్ల ఎస్సై రాజు హెచ్చరించారు. పట్టణంలోని 65 నెంబర్ జాతీయరహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఆటోలు నిలిపిన డ్రైవర్ల ఫోన్లు సీజ్ చేశారు. ఆటో డ్రైవర్లు విధిగా లైసెన్సు కలిగిఉండాలన్నారు. బస్టాండ్ వద్ద ఆకతాయిగా కూర్చున్నవారిపై, ట్రాఫిక్ అంతరాయం కలిగించేవారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 

  • ‘ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పివేయడం ప్రధాన కర్తవ్యం’

    ఎన్టీఆర్: ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పి వేయడం ప్రధాన కర్తవ్యంగా భావించాలని ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ శివరామాంజనేయులు అన్నారు. ఎన్టీటీపీఎస్ బొగ్గు సంభాళింపు విభాగంలో అగ్నిమాపక దళ విన్యాసాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కోల్ ప్లాంట్‌లో కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదాన్ని పసికట్టిన వెంటనే ఫైర్ అలారం మోగించాలని సూచించారు. అందుబాటులో ఉన్న అగ్నిప్రమాద సాధనాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలన్నారు.

  • చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన

    ఎన్టీఆర్: తిరువూరు నగర పంచాయతీలో నిర్వహించిన ఫ్రైడే-డ్రై డే కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కుమారి మాధురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటి ఇంటికి వెళ్లి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం తదుపరి ర్యాలీలో పాల్గొన్నారు.

     

  • ట్రాఫిక్‌ కష్టాలు తీరేదెప్పుడో..!

    ఎన్టీఆర్: మైలవరంలోని నూజివీడు రోడ్డులో  ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనాలతో నిత్యం రద్దీగా ఉండే ఆ రోడ్లో ఆటోలు, చిరు వ్యాపారులు రోడ్లపైనే పెట్టి కార్యకలాపాలు నిర్వహిస్తారని వాపోతున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోవడం లేదని అంటున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

  • విజయవాడలో దారుణం.. యజమానిని చంపి పరారైన పనిమనిషి

    విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. ఇంటి యజమాని బొద్దులూరి వెంకటరామారావు(70)ని హత్యచేసి, బంగారం, నగలతో పనిమనిషి అనూష పరారైంది. శుక్రవారం అర్ధరాత్రి రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి చూసింది. రామారావు అపస్మాస్థితిలో పడి బీరువా పగలగొట్టి ఉండగా.. అనూష కనిపించలేదు. పోలీసులు అనూషను ఉదయం అదుపులోకి తీసుకున్నారు. భర్త సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్యచేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

  • యజమానిని చంపి పరారైన పనిమనిషి

    AP : విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని NTR కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు(70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిని చూసుకునేందుకు 3రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పెట్టుకున్నారు. ఆమె కూడా వారితోపాటు ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇంటి యజమానిని హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగలతో పనిమనిషి పరారైందని పోలీసులు తెలిపారు.

  • తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య

    తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నైలో తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, తిరుమల మిల్క్ డెయిరీలో రూ.45 కోట్ల మేర మనీ ల్యాండరింగ్‌ జరిగినట్లు ఫిర్యాదు వచ్చాయి. పోలీసులు.. దీనిపై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండానే నవీన్‌ ఆత్మహత్య చేసుకున్నారు.  నవీన్ బొల్లినేని స్వస్థలం కృష్ణా జిల్లాగా తెలుస్తోంది.

  • అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు

    ఎన్టీఆర్: అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అత్యాచారం కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జి.రాజేశ్వరీ గురువారం తీర్పు చెప్పారు. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఓయువతి(21) 2018, జూన్‌ 23న కుటుంబసభ్యులు ఊరు వెళ్లగా..ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఇదేసమయంలో  ఆమెబంధువైన అత్తిలి కనకరాజు ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నేరం రుజువుకావటంతో శిక్ష పడింది.