కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు మేయర్ చిటికిన వెంటేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు జరిగే సమావేశంలో అజెండాలో పొందు పర్చిన 5 అంశాలపై చర్చించి తీర్మానం చేస్తారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు తప్పక హాజరుకావాలని కోరారు.
Locations: Krishna
-
జిల్లాలో ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమాలు: కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లాలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వంటివి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధికారుల మధ్య పటిష్ట సమన్వయం, సమాచార మార్పిడికి విజయవాడలోని కలెక్టరేట్లో ఫోన్ నెంబర్91549 70454తో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
-
గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు.. చేరికకు14న లాస్ట్
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు గల ఖాళీ సీట్ల భర్తీకి గత నెల 25న నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను ఆయా పాఠశాలల వద్ద ప్రదర్శించినట్లు సమన్వయ అధికారి మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభఆధారంగా సీట్లు పొందిన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించామని,వీరంతా ఈనెల 14వ తేదీలోగా ఆయా పాఠశాలల్లో హాజరుకావాలని సూచించారు.
-
బాధితుడికి ఆర్థిక చేయుత
కృష్ణా: కోడూరుకు చెందిన బండారు మణికంఠ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్ఆర్ గ్రూప్ ఛైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు ఆయనను పరామర్శించారు. విజయవాడలో చికిత్స పొందుతున్న మణికంఠకు రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
-
విద్యార్థులు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ
కృష్ణా: చల్లపల్లి మండలం పురిటిగడ్డ జెడ్‌పీహెచ్ పాఠశాలలో మెగా పిటిఎం 2.0 జరిగింది. చల్లపల్లి సీఐ కె. ఈశ్వరరావు, ఎస్సై సుబ్రహ్మణ్యం విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు డ్రగ్స్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై శ్రద్ధ వహించాలని కోరారు. ఎస్సై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
-
సాయి భగవాన్‌కి విశేష హారతులు
కృష్ణా: చల్లపల్లి మండలంలోని కొత్తమాజేరు గ్రామంలో శ్రీ షిరిడీసాయి మందిరంలో “గురుపూర్ణిమ” వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయి భగవాన్‌కి అభిషేకాలు, విశేష హారతులు ఇచ్చారు. మందిరంలో “శ్రీసత్యసాయి వ్రతాలను” భక్తులు నిర్వహించారు. అనంతరం శ్రీ షిర్డీసాయి వారిని గ్రామంలో అంగరంగ వైభోగంగా ఊరేగించగా భక్తులు స్వయం పాకం, టెంకాయలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు.
-
నరేష్‌ను సన్మానించిన ఎమ్మెల్యే
కృష్ణా: దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెరకనపల్లి నరేష్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును ఘనంగా సత్కరించారు. తనను ఏఎంసీ డైరెక్టర్ పదవికి సిఫార్సు చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదములు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా నరేష్ ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. కార్యక్రమంలో పీసీ ఛైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, మోపిదేవి మండల జనసేన అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
-
‘విలువలు పెంచేందుకే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’
కృష్ణ: సమాజంలో విలువలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీటీఎం కార్యక్రమం చేపట్టినట్లు గొర్రెపాటి వెంకట రామకృష్ణ తెలిపారు. గురువారం చల్లపల్లి శ్రీవిజయ అకాడమీలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం జరిగింది. సామాజిక విలువల పరిరక్షణకు విద్యార్థి దశలో తల్లిదండ్రుల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కలు, గ్రీన్ పాస్ పోర్టులు బహుకరించారు.
-
అక్రమ కట్టడాలపై కొరడా
కృష్ణా: మున్సిపల్ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలోని అనధికారి లే ఔట్లు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను గుర్తించి చర్చించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
-
కానూరులో విషాదం.. అన్నంలో విషం పెట్టి..
కృష్ణా: కానూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వరలక్ష్మిపురం కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి అన్నంలో విషం కలిపి వీధి కుక్కలను చంపాడు. ఈ ఘటనలో ఏడు కుక్కలు మృతి చెందగా, మరికొన్ని కుక్కలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూగజీవాలపై ఇలాంటి దాడులు జరగడం బాధాకరం.