కృష్ణా: గూడూరు మండలం పోసినవారిపాలెం గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులుకు ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, బూత్ యూనిట్ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.
Locations: Krishna
-
సేవలు ఆదర్శనీయం.. తహశీల్దార్‌కు సన్మానం
కృష్ణ: ఉద్యోగంతో పాటు సామాజిక సేవల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఘంటసాల మండల తహశీల్దార్ బి.విజయ ప్రసాద్ సేవలు ఆదర్శనీయమని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్ర ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి జిల్లా తరుపున అత్యధిక నిధులు సమీకరించగా బుధవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదగా ఘంటసాల తహసీల్దార్ బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈసందర్భంగా కార్యాలయంలో తహశీల్దార్‌ను ఘనంగా సన్మానించారు.
-
లంకమ్మ తల్లికి సారె సమర్పణ
కృష్ణా: అవనిగడ్డలో కొలువైన శ్రీ లంకమ్మ తల్లికి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. యాసం లంకమ్మ వారి ఇంటినుంచి మహిళలు మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజారులు ఆశీర్వదించారు. ఈ ఉత్సవం ఎంతో సందడి నెలకొల్పింది.
-
‘పేదరికం నిర్మూలన కోసమే పీ-4 కార్యక్రమం’
కృష్ణ: పేదరికం నిర్మూలనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ధ్యేయమని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, సీనియర్ నేత బొబ్బా గోవర్ధన్‌లు అన్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో సుపరిపాలనలో తొలి-అడుగు కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదరికం నిర్మూలన కోసమే పీ-4 కార్యక్రమానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పేదలను గుర్తించి వారి జీవితాల్లో మార్పుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
-
‘గురువులను గౌరవించడం మన సంస్కృతి’
ఎన్టీఆర్: గురు పూర్ణిమను పురస్కరించుకొని తిరువూరు పట్టణంలో బీజేపీ నాయకులు గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీశేష మునీంద్ర ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణ గురూజీకి, ఉత్తమ ఉపాధ్యాయులు రఘునందన రావుకి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించారు. గురువులను గౌరవించడం మన సంస్కృతి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోలే శాంతి, ఎస్సీ మోర్చా స్టేట్ జోనల్ ఇన్‌ఛార్జ్ తేనీటి ఇమ్మానియేల్ పాల్గొన్నారు.
-
‘మీ అందరి కోసం పోరాటానికి సిద్దం’
కృష్ణా: బంటుమిల్లి మండలాల్లో వివిధ గ్రామాల నుంచి కుటమీ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ శొంఠి నాగరాజు దృష్టికి తీసుకువచ్చారు. కుటమి ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని, పోలీస్ స్టేషన్లలో తమ గోడు వినేవారు లేరని ప్రజలు వివరించారు. వెంటనే వారిని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి న్యాయం జరిగేలా చూస్తానని హామీఇచ్చారు. మీ అందరికోసం పోరాటానికి సిద్దమని భరోసా ఇచ్చారు.
-
వీరులపాడు తహశీల్దార్‌గా రవికుమార్ బాధ్యతలు
ఎన్టీఆర్: వీరులపాడు మండలం తహశీల్దార్‌గా రవికుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా డిప్యూటీ తహశీల్దార్ పనిచేశారు. పూర్తి కాలపు తహశీల్దార్‌గా రవికుమార్‌ను ప్రభుత్వం నియమించగా గురువారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
-
రమ్య కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే
ఎన్టీఆర్: ఇటీవల ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన రామాల రమ్య సంస్మరణ సభ విస్ననపేట మండలం పుట్రెల గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రమ్య కుటుంబానికి ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా సరే తనను సంప్రదించమని భరోసా ఇచ్చి, కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
-
కేతనకొండలో వేడుకగా గురుపూజోత్సవం
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం రూరల్ మండలం కేతనకొండ గ్రామంలో యూపీ స్కూల్‌లో జరిగింది. కార్యక్రమానికి మండలం బీజేపీ అధ్యక్షురాలు పయ్యావుల జయలక్ష్మి రాము హాజరయ్యారు. గురు పౌర్ణమి సందర్భంగా గురువుల్ని గౌరవించుకునేందుకు ఉద్దేశంతో గురుపూజోత్సవం కార్యక్రమం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అధ్యాపకులకు శాలువా కప్పి సన్మానించారు. విద్యార్థుల మాతృమూర్తులను పూలమాలలతో సత్కరించారు.
-
ఏ.కొండూరులో ఘనంగా గురుపూజోత్సవం
ఎన్టీఆర్: గురు పూర్ణిమను పురస్కరించుకొని ఏ.కొండూరులో బీజేపీ నాయకులు గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. చీమలపాడు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హేమేశ్వరరావుకి, బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హేమేశ్వరరావును బీజేపీ మండల అధ్యక్షులు గుడిపూడి నాగమల్లేశ్వరరావు, ఎస్సీ మోర్చా స్టేట్ జోనల్ ఇన్‌ఛార్జ్ తేనీటి ఇమ్మానియేల్, సురేంద్రనాథ్‌లతో కలసి బీజేపీ నాయకులు దుశ్శాలువతో సన్మానించారు.