కృష్ణా: కృత్తివెన్ను మండలం కొమళ్ళపూడి, కృత్తివెన్ను, లక్ష్మీపురం లాకులు దగ్గర సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కృత్తివెన్ను మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పిన్నెంటి రత్తయ్య, వలవల తాతాజీ, రంగారావు, పులగం బుజ్జి, కొప్పర్తి భాస్కరరావు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Locations: Krishna
-
కూరగాయలతో దుర్గాదేవికి శాకాంబరీ అలంకరణ
కృష్ణా: దక్షిణ కాశీగా పేరుగాంచిన మోపిదేవి మండంలోని పెదకల్లేపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీదుర్గా నాగేశ్వరస్వామివారి దేవాలయంలో శ్రీదుర్గా అమ్మవారికి శాకంబరీ అలంకరణ ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ శాఖంబరి అలంకరణ గురువారం నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ్ వరప్రసాదరావు ఆధ్వర్యంలో స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వివిధ రకాల కూరగాయలు,పండ్లు,పూలతో అలంకరించారు.
-
పరిటాలలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు
ఎన్టీఆర్: కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల గ్రామంలో సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ పురస్కరించుకుని సాయిబాబాకి పంచామృతాలతో అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ నిర్వహించారు. గురుపూర్ణిమ సందర్భంగా ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో సాయిబాబాని దర్శించుకున్నారని ఆలయ ప్రధాన అర్చకులు స్వర్ణ ఏకాంబరేశ్వరశర్మ తెలిపారు. గురు పూర్ణిమ పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందన్నారు.
-
రేపు అవనిగడ్డలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
కృష్ణా: రేపు అవనిగడ్డలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ అనే అంశంపై చర్చిస్తారు. వైసీపీ నేతలు పేర్ని నాని, జట్టి గురునాథం ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని సింహాద్రి పిలుపునిచ్చారు.
-
పాఠశాలలకు దాతల సహాయం ముదావహం: ఎమ్మెల్యే
కృష్ణా: పాఠశాలలకు దాతల సహాయం ముదావహం అని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం నాగాయలంక మండలం భావదేవరపల్లి ఎంపీపీ మోడల్ ప్రైమరీ స్కూలులో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈసందర్భంగా గ్రామానికి చెందిన అటవీశాఖ ఉద్యోగి, పూర్వ విద్యార్థి భోగాది వెంకట అప్పారావు శత జయంతి సందర్భంగా వారి కుమార్తె ఝాన్సీరాణి, మనుమడు జాకబ్ వంశీధర్ పాఠశాలకు రూ.లక్ష వ్యయంతో కంప్యూటర్,ప్రింటర్,టేబుల్ బహుకరించారు.
-
‘ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యం’
ఎన్టీఆర్: పుట్రేలలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యం అని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు, మాజీ అధ్యక్షుడు దొడ్డ కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు అరిగే శ్రీనివాసరావు పాల్గొన్నారు.
-
సచివాలయాల సిబ్బందికి ఘన సన్మానం
కృష్ణా: కృత్తివెన్ను మండలం 16 పంచాయితీల్లో 17 సచివాలయాలు అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది బదిలీపై వేరువేరు ప్రదేశాలకు వెళ్తున్న 80 మంది సిబ్బందికి ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. కృత్తివెన్ను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సిబ్బందిని ఎంపీపీ కూనసాని గరుడ ప్రసాద్ తాతాజీ, జడ్పీటీసీ మైలా రత్నకుమారి, ఎంపీడీవో అరుణ్ కుమారి, సీనియర్ సెక్రెటరీ నరసింహారావు ఘనంగా సన్మానించారు.
-
‘క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు’
కృష్ణా: క్రమ శిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మండల విద్యాశాఖాధికారి వై.వి.హరినాథ్ పేర్కొన్నారు. పెడన పట్టణంలో గల విశ్వభారతి హైస్కూల్‌లో జరిగిన తల్లితండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని తల్లికి వందనం సరైన సమయంలో ఇవ్వటం సముచిత నిర్ణయమని అన్నారు. సమావేశానికి హాజరైన తల్లితండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
-
‘ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య’
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలోని సీతారామాపురంలో గల మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు మెగా పీటీయం2.0 సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ ఛైర్మన్, పూర్వ విద్యార్థి నెట్టెం శివరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ ఇస్తామని చెప్పారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తామని పేర్కొన్నారు.
-
‘మత్తు పదార్థాల సేవనం ఆరోగ్యానికి హానికరం’
ఎన్టీఆర్: మత్తు పదార్థాలను విద్యార్థులు దూరంగా ఉంచాలని వాటికి బానిసలుగా మారితే విద్యకు దూరం కావడమే కాక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటారని కంచికచర్ల ఎస్సై బి.రాజు అన్నారు. గురువారం కంచికచర్ల స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు రాజు మత్తుపదార్థాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. మత్తుపదార్థాల సేవనం ఆరోగ్యానికి హానికరమన్నారు. ఎవరైనా మత్తుపదార్థాలు సేవించినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.