Locations: Krishna

  • తల్లికి వందనం హామీని నెరవేర్చాం: ఎమ్మెల్యే

    కృష్ణా: పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లిలో ఎస్‌టీ.జోన్స్ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం హామీని నెరవేర్చామని తెలిపారు.

  • సాగునీరు అందక.. 500 ఎకరాల భూమి బీడుగా మారే ప్రమాదం!

    కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో పంట బోదులు ఆక్రమణకు గురికావడంతో దిగువ రైతులకు సాగునీరు అందడం లేదు. ఆక్రమణల వల్ల 500ఎకరాల భూమి బీడుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించకపోతే రోడ్డు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

  • అలర్ట్.. నెలకు రూ.1,20,000 వరకు జీతంతో జాబ్స్!

    NCRTCలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌, లీగల్‌, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌, హాస్పిటాలిటీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో BHM, B.Tech, BE, LLB, BHA, B.Plan డిగ్రీలతో పాటు అనుభవం ఉండాలి. నెల జీతం రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు. అర్హులైన అభ్యర్థులు జులై 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు https://ncrtc.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
  • ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే

    కృష్ణా: పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో స్ధానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలును ప్రజలకు వివరించి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులుకు ఆదేశించారు.

  • ‘విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి’

    కృష్ణా: గూడూరులోని పఠాన్‌పేట, గాంధీబొమ్మ సెంటర్ ఎంపీపీ స్కూల్స్, జెడ్పీ హైస్కూల్‌లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గూడూరు మండల పరిషత్ అధ్యక్షులు  సందగా మధుసూదనరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై ప్రసంగించి, గాంధీబొమ్మ సెంటర్ అంగన్‌వాడీని, జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు.

     

  • ‘విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి కృషి చేయాలి’

    కృష్ణా: పెడన పట్టణంలోని బీజీకే జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్‌ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాల్సిన అవసర ఉందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

     

     

  • ‘విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తాం’

    ఎన్టీఆర్: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తల్లిదండ్రులను భాగస్వాములను చేయడమే మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ 2.0 ముఖ్య ఉద్దేశమని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కవులూరి రాజ అన్నారు. విస్సన్నపేట శ్రీచైతన్య పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో విస్సన్నపేట గ్రామపంచాయతీ ఈవో హరికృష్ణ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ పవన్‌కుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

  • ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై తీవ్ర గందరగోళం!

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం జూపూడి పంచాయతీ సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో పంచాయతీ కార్యాలయం ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. గతంలో గంజాయి కేసులో పట్టుబడ్డ వ్యక్తిని తిరిగి నియమించాలని వైసీపీ ప్రయత్నించగా,టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్‌ను కొనసాగించాలని స్థానికులు MDOని కోరారు.

  • ‘ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకోండి’

    ఎన్టీఆర్: జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. జిల్లాలో నేషనల్ హెల్త్ పథకం, వివిధ పీహెచ్‌సీలు,యూపీహెచ్‌సీల పరిధిలో 27పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన మహిళా అభ్యర్థులు 25నుంచి 45లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు ఈనెల16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

     

  • ‘పిల్లల భవిష్యత్తుకు ఇది ఎంతో అవసరం’

    ఎన్టీఆర్: వీరులపాడులోని ఏకత్వ పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి వారి తల్లిదండ్రులతో కలిసి క్లాస్ టీచర్‌తో వ్యక్తిగతంగా సమావేశం ఏర్పాటుచేశారు. పిల్లల భవిష్యత్తుకు ఇది ఎంతో అవసరం అని యాజమాన్యం తెలిపింది. తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను తెలిపారు.