Locations: Krishna

  • విద్యార్థుల జీవితానికి పునాది పాఠశాలలే: కలెక్టర్

    ఎన్టీఆర్: ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కొండపల్లిలో జరిగిన మెగా పేరెంట్, టీచర్ మీటింగ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల జీవితానికి పునాది అని నొక్కి చెప్పారు. పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

  • CM నాయకత్వంలో విద్యారంగానికి స్వర్ణయుగం

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలోని ZPHS బాయ్స్ హైస్కూల్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఎన్నారై కంటమనేని హేమ ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. హేమ అందించిన రూ.46.5లక్షల విరాళంతో  ఏర్పాటు చేసిన గ్రౌండ్ డెవలప్మెంట్ పనులను, లైబ్రరీ, కంప్యూటర్లను ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో విద్యారంగానికి స్వర్ణయుగం మొదలైందని స్పష్టం చేశారు.

  • గురువులు.. వెలుగునిచ్చే మార్గదర్శకులు

    ఎన్టీఆర్: గురు పౌర్ణమి పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకులు గోలేటి సుబ్రహ్మణ్యం విసన్నపేట మండలం నరసాపురం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆయన ఘనంగా సత్కరించారు. గురువులు సమాజానికి వెలుగునిచ్చే మార్గదర్శకులని గోలేటి కొనియాడారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించే గురువుల సేవలను ఆయన ప్రశంసించారు.

  • మెగా PTM.. అంతా రాజకీయం..!

    ఎన్టీఆర్: కొండపల్లి పాఠశాలలో పేరెంట్, టీచర్ మీటింగ్(PTM) రాజకీయ వేదికగా మారింది. పిల్లల భవిష్యత్ కోసం ఉపాధ్యాయులతో చర్చించేందుకు వచ్చిన తల్లిదండ్రులు రాజకీయ నాయకుల ప్రసంగాలతో విసిగిపోయారు. ప్రభుత్వ ఆశయం నీరుగారిందని, నాయకులకు విద్యపై అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు సౌకర్యాలు లేక..రాజకీయ ప్రసంగాలు అర్థం కాక గందరగోళం నెలకొందని ఆరోపించారు. కలెక్టర్ సైతం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

  • పదో తరగతి అర్హతతో నౌకాదళంలో మ్యుజీషియన్ పోస్టులు

    భారత నౌకాదళం అగ్నిపథ్‌ పథకంకింద అగ్నివీర్‌ మ్యుజీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదోతరగతి అర్హతతో మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు వాయిద్య పరికరాలపై ప్రావీణ్యం ఉండాలి. ఎంపికైనవారు నాలుగేళ్లు సేవలు అందించిన అనంతరం వారిలో 25శాతం మందిని శాశ్వత ఉద్యోగానికి ఎంపికచేస్తారు. దరఖాస్తులను పదోతరగతి మెరిట్, మ్యూజిక్ సర్టిఫికెట్ల ఆధారంగా వడపోస్తారు. శిక్షణ ఐఎన్‌ఎస్, చిలకలో సెప్టెంబర్ నుండి మొదలవుతుంది.

     

  • గురువులను గౌరవించడం సంస్కృతిలో భాగం: BJP

    ఎన్టీఆర్: గురుపూర్ణిమను పురస్కరించుకొని విస్సన్నపేట మండలం తాతకుంటలోని అయ్యప్ప స్వామి పీఠం పూజారి రాజేష్ శర్మను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. గురువులను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని నాయకులు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ పెనుగొండ రామచంద్రరావు, బీజేపీ మండల మాజీ అధ్యక్షురాలు సుమ, హైందవ శక్తి జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

  • కొండాలమ్మకు సారె సమర్పించిన MLA

    కృష్ణా: ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాడమాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సంద్భంగా శాకంబరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు సారె సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

  • సాయిబాబా సేవలో మాజీ మంత్రి దేవినేని

    ఎన్టీఆర్: గురు పౌర్ణమి సందర్భంగా గొల్లపూడిలో షిర్డీ సాయిబాబా మందిరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గురువు ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞానం, శాంతి, సౌభాగ్యాలను తెచ్చిపెడతాయని, ఈ పవిత్రమైన రోజున సాయిబాబా ఆశీర్వాదంతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

     

  • ఆరోజు 2500 మందికి ఉద్యోగావకాశాలు

    ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 14న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్రబాబు తెలిపారు. మేళాకు 30 సంస్థల ప్రతినిధులు పాల్గొని, సుమారు 2500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ తదితర కోర్సులు పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులన్నారు. వివరాలకు 8143549464 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

  • శాకాంబరీ అలంకారంలో అంకమ్మ దర్శనం

    ఎన్టీఆర్: ఆషాఢ పౌర్ణమి సందర్భంగా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో అంకమ్మ తల్లి శాకాంబరీ ఉత్సవం వైభవంగా జరుగుతోంది. ఆలయ అర్చకులు భక్తులు సమర్పించిన కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు రంగనాథ్ స్వామి మాట్లాడుతూ.. ఎంలాటి కరువు కాటకాలు రాకుండా అమ్మవారు కాపాడుతుందని పేర్కొన్నారు.