Locations: Krishna

  • సాయిబాబా ఆలయం.. భక్తజన సంద్రం

    కృష్ణా: గురు పౌర్ణమి సందర్భంగా కృష్ణాజిల్లా పెనమలూరులోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కానూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని మందిరానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబాకు  ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

     

  • CMRFతో నిరుపేదలకు అండగా CM..!

    ఎన్టీఆర్: తిరువూరులో నిరుపేదలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అండగా నిలిచారు. నియోజకవర్గ పరిధిలో 22 మందికి రూ.12.84,054 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఓ నిరుపేద కుటుంబానికి రూ.3లక్షల సాయం అందించారు. విస్సన్నపేటలో వెన్నుపూస వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా పేదలను ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

  • గన్నవరం మిమానాశ్రయానికి గ్రీన్‌ ఛానల్‌ ద్వారా గుండె తరలింపు

    విజయవాడకు చెందిన జ్యోతి భాను వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన గుంటూరులోని రమేశ్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో కుటుంబసభ్యులు అవయవదానానికి అంగీకరించారు. గుంటూరు రమేశ్‌ ఆసుపత్రి నుంచి గన్నవరం విమానాశ్రయానికి గ్రీన్‌ ఛానల్‌ ద్వారా గుండెను తరలించారు. తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చనున్నారు.

  • ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు.. 16న లాస్ట్

    ఎన్టీఆర్: జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఓప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. జిల్లాలో నేషనల్ హెల్త్ పథకం, వివిధ పీహెచ్సీలు, యూపీహెచ్సీల పరిధిలో 27 పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన మహిళా అభ్యర్థులు 25 నుంచి 45లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు ఈనెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

  • యోగాపై ఆసక్తి ఉందా?.. 20న పోటీలు

    ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుంచి జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి, ప్రధాన కార్యదర్శి సగ్గుర్తి రాజేశ్వరి తెలిపారు. 10 నుంచి 55 సంవత్సరాల వయసున్న వారిని ఆరు కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహిస్తామన్నారు. విజయవాడ ఎలక్ట్రిసిటీ కాలనీలోని యోగా హెల్త్ సెంటర్లో పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలకు 9642002008నంబర్‌ను సంప్రదించాలన్నారు.

  • ‘p4’లో ప్రవాసాంధ్రులు భాగస్వాములవ్వాలి: MLA

    ఎన్టీఆర్: P4 పథకంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన 24 వ తానా సభల్లో పాల్గొన్న మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న తెలుగువారు తాము పుట్టిపెరిగిన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో 2013లో ప్రారంభించిన ఈ తానా సంస్థ గత 12ఏళ్లలో చేసిన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. పీ4 పథకం ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకురావాలన్నారు.

     

  • వారికి సత్కారం.. స్వాగతం

    కృష్ణా: పెడనలోని 5వ వార్డు సచివాలయ సిబ్బందిని పట్టణ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మొహమ్మద్ ఖాజా శాలువాలతో సత్కరించారు. చివాలయంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న వారిని సన్మాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి పెడనకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా బదిలీపై సచివాలయానికి వచ్చిన వారికి స్వాగతం పలికారు.

     

     

  • భార్యను హతమార్చిన భర్త.. చివరికి తను కూడా..!

    ఏలూరు: కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పీ అగ్రహారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టా జయలక్ష్మి(47)ని ఆమె భర్త కొత్త పెద్దిరాజు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య అనంతరం పెద్దిరాజు కత్తితో మెడ కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పెద్దిరాజును కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెద్దిరాజుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
  • ఆన్‌లైన్ ట్రేడింగ్ ముసుగులో రూ.1.41కోట్లు స్వాహా!

    కృష్ణా: పెనమలూరులో ఓవ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటనపై కేసు నమోదైంది. మండలంలోని తాడిగడపకు చెందిన టి.అనురాగ్(26)ను ఫేస్‌బుక్ ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్రకటనల ద్వారా విక్రమ్ పటేల్, ఆకాష్ తివారిలు నమ్మించి, ఓయాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. దశలవారీగా పెట్టుబడులు పెట్టిన అనురాగ్ రూ.38.09లక్షలు విత్‌డ్రా చేశాడు. తిరిగి రూ.1.41కోట్లు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా సొమ్ము రాకపోవడంతో అనురాక్ పోలీసులను ఆశ్రయించాడు.

  • CMకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు: నిమ్మల

    ఎన్టీఆర్: ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విస్సన్నపేట మండలం నరసాపురంలో చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కూటమి సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.