Locations: Krishna

  • సుబ్రహ్మణ్యేశ్వరుని హుండీ ఆదాయం ఎంతంటే..!

    కృష్ణా: మోపిదేవిలోని స్వయంభువుగా కొలువుదీరిన శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి గత 104 రోజుల్లో రూ.1.11కోట్లకు పైగా హుండీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం జరిగిన లెక్కింపులో 2.550కిలోల బంగారం, 41గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు వచ్చినట్లు చెప్పారు. లెక్కింపులో మోపిదేవి SBI సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, సేవాసమితి సభ్యులు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

  • ఏఎంసీల్లో ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చాం: MLA

    కృష్ణా: ఏఎంసీల్లో ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఏఎంసీ డైరెక్టరుగా నియమితులైన జనసేన పార్టీ ఎస్టీ నాయకుడు, యానాది మహానాడు జిల్లా అధ్యక్షుడు మంగళగిరి శ్రీనివాసరావు బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. తనను ఏఎంసీ డైరెక్టరుగా నియమకానికి సిఫార్సు చేసిన సందర్భంగా ఎమ్మెల్యేను శ్రీనివాసరావు దంపతులు సత్కరించారు.

  • కోడూరులో తిరుపతి శ్రీనివాసరావు బర్త్ డే సెలబ్రేషన్స్

    కృష్ణా: కోడూరు టీడీపీ కార్యాలయంలో టీఎస్‌ఆర్ గ్రూప్ ఛైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మండల అధ్యక్షులు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సినీ నిర్మాతగా ఎదిగిన శ్రీనివాసరావు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పలువురు టీడీపీ నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

  • ‘డ్రైనేజీల పనులు సమర్ధవంతంగా చేయాలి’

    కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలో చేపట్టిన డ్రైనేజీల పనులు సమర్ధవంతంగా చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. బుధవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో డ్రైనేజీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లింగన్నకోడు కిక్కిస తొలగింపు, గుండేరు పూడికతీత పనులు జరుగుతున్న తీరు అధికారులు వివరించారు. కృష్ణాపురం-నరసింహాపురం కిక్కిస తొలగింపు పనులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఎమ్మెల్యే సూచించారు.

  • కోడూరులో MRO లేక.. ప్రజల అవస్థలు!

    కృష్ణా: కోడూరు మండలంలో తహశీల్దార్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా ఇన్‌ఛార్జ్ అధికారి మాత్రమే ఉండటంతో పనులు సకాలంలో జరగడం లేదు. దీంతో లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి శాశ్వత తహశీల్దార్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • చంద్రబాబు పేదల పక్షపాతి: ఎమ్మెల్యే వెనిగండ్ల

    కృష్ణా: 36 బాధిత కుటుంబాలకు రూ.20.20లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీ పత్రాలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అందించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో గుడివాడ నియోజకవర్గంలో రూ.2.14కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు పేదల పక్షపాతి అనడానికి ఇదే నిదర్శనమని రాము పేర్కొన్నారు. బాధితులు సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

  • ‘పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత’

    ఎన్టీఆర్: పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులను నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు పరిశీలించారు. విజయవాడలోని 6ఆసుపత్రులతో కలిసి సుమారు 4000మంది పోలీసు అధికారులు, సిబ్బంది (హోంగార్డులతో సహా) కోసం జనరల్ బాడీ హెల్త్ చెకప్, డయాబెటిక్, కిడ్నీ, లివర్, కార్డియాక్ ప్రొఫైల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత అని సీపీ తెలిపారు.

  • ‘హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం’

    కృష్ణా: అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి.వెంకటేశ్వరరావు మృతి పట్ల జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ శాఖ తరపున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మట్టి ఖర్చుల నిమిత్తం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ లక్ష రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.

  • ప్రజల విశ్వాసానికి కూటమి పాలన నిదర్శనం: MLA

    కృష్ణా: కూటమి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఏడాది పాలన నిదర్శనమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని 26,27 వార్డుల్లో బుధవారం సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులను వివరించారు. కార్మిక నగర్ మున్సిపల్ పాఠశాలను సందర్శించి విద్యా దీవెన కిట్లను పరిశీలించారు. పాఠశాల మరమ్మతులపై అధికారులకు ఆదేశాలిచ్చారు.

  • అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో టిప్పర్ డ్రైవర్ మృతి

    ఎన్టీఆర్: నందిగామ మండలం రాఘవపురంలో కొండను తవ్వి గ్రావెల్ అక్రమ రవాణా చేస్తుండగా ఒక్కసారిగా కొండ మట్టి పడటంతో టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు. అర్ధరాత్రి కొండను తవ్వుతుండగా మట్టి పెళ్లలు పడి జగ్గయ్యపేటకు చెందిన టిప్పర్ డ్రైవర్ దాసరి చిన్న వెంకటేశ్వరరావు(40) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే విజయవాడలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.