Locations: Krishna

  • ‘కార్మికుల శ్రేయస్సును గాలికి వదిలేసిన ప్రభుత్వాలు’

    ఎన్టీఆర్: ఐఎఫ్టీయు అనుబంధ సంఘాల కార్మికుల ఆధ్వర్యంలో కంచికచర్లలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐఎఫ్టీయు నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల శ్రేయస్సును గాలికి వదిలేసి కొంతమంది శ్రేయస్సు కోసమే పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా చేసే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తయారు చేశాయని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలు రాస్తూ కార్మికుల కార్మికులకు అండగా ఉంటామన్నారు.

  • ‘పేద కుటుంబాలకు ఇంటి పెద్ద కొడుకుగా చంద్రబాబు’

    కృష్ణా: పెడనలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ పెంచి పేద కుటుంబాలకు ఇంటి పెద్ద కొడుకుగా చంద్రబాబు అండగా నిలిచారన్నారు. ప్రజలు ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు.

     

  • కొండపల్లి ఖిల్లా చరిత్రను కాపాడండి సారూ..

    ఎన్టీఆర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపల్లిని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తోంది. ఖిల్లా రోడ్డును 60 అడుగులకు విస్తరించాలని, రహదారి విస్తరణతో ప్రమాదకర మలుపులు తొలగిపోతాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశాకు కొండపల్లి పట్టణ ప్రజల వినతిపత్రం అందజేశారు. కొండపల్లి బొమ్మల విశిష్టతను, వైభవాన్ని పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు ఇబ్బందులు పడకుండా రహదారిని విస్తరించాలని కోరారు.

  • సమ్మెతో స్తంభించిన బ్యాంకింగ్ సేవలు

    ఎన్టీఆర్: కంచికచర్ల, వీరులపాడు మండలాలలో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకు లావాదేవీలు స్తంభించాయి. ఆశా వర్కర్లు, డ్వాక్రా లీడర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వివిధ గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న రోజువారి సిబ్బంది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10డిమాండ్లతో మండల తాహశీల్దారులకు వినతిపత్రాలు అందజేశారు.

  • తిరువూరులో గంజాయి ముఠా అరెస్ట్

    ఎన్టీఆర్: తిరువూరులో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఎన్ఎస్‌పీ కాలనీలో ఆ ముఠా గంజాయి పంచుకుంటుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీఐ గిరిబాబు, ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. నిందితులను రిమాండ్‌కు తరలించారు. మత్తుపదార్థాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

  • BJP రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్‌ బాధ్యతలు స్వీకరణ

    AP : విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో BJP రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్‌ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి BJP కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. లెనిన్‌సెంటర్‌లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లెనిన్‌సెంటర్‌ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని ఈ సందర్భంగా మాధవ్‌ డిమాండ్‌ చేశారు.

     

  • రైతు బజారులో జేసీ ఇలక్కియా ఆకస్మిక తనిఖీలు

    ఎన్టీఆర్: మైలవరంలోని రైతు బజారును బుధవారం జాయింట్ కలెక్టర్ ఇలక్కియా ఆకస్మిక తనిఖీ చేశారు. ఖాళీగా ఉన్న షాపులను వెంటనే ఫిల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుండి నేరుగా సేకరించిన కూరగాయలు తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. దుకాణాలు కావలసిన రైతులు సంప్రదించగలరని ఆమె తెలియజేశారు.

  • YCP నేతల వేధింపులు.. ఆత్మహత్య చేసుకుంటానంటూ TDP కార్యకర్త సెల్ఫీ వీడియో!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసర గ్రామంలో YCP నేతల వేధింపులకు తాళలేక TDP కార్యకర్త అంగిరేకుల రాంబాబు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భూమి కొనిపెడతానని చెప్పి డబ్బులు తీసుకున్న YCP నేత రమేష్‌..డబ్బు తిరిగివ్వకుండా చంపేస్తానంటూ బెదిరించాడని రాంబాబు ఆరోపించాడు. దీంతో రాంబాబు పురుగులమందు తాగాడు. కాగా..అతన్ని విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియోతీసి, తన పరిస్థితిని లోకేశ్‌కు తెలియజేశాడు.

  • ప్రసన్నకుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: టీడీపీ మహిళా కమిటీ

    కృష్ణా: కోవూరు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా అవనిగడ్డ టీడీపీ మహిళా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా ప్రతినిధులపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని, దీన్ని ఖండిస్తున్నామని వారు అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా నాయకురాళ్ళపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

  • రెడ్డిగూడెంలో కార్మికుల భారీ ర్యాలీ

    ఎన్టీఆర్: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో అమర వీరుల భవన్ నుంచి ర్యాలీ పెట్రోల్ బంక్ వరకు కార్మికులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ, ఆశా, బిల్డింగ్ వర్కర్స్, రైతు సంఘాలు పాల్గొని సమ్మెను జయప్రదం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్.వెంకటేశ్వరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ వరలక్ష్మి, తిరుపతమ్మ , అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.