Locations: Krishna

  • ప్రభుత్వ కళాశాలలో పచ్చదనానికి పెద్దపేట

    ఎన్టీఆర్: విసన్నపేట ప్రభుత్వ కళాశాలలో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. దివంగత అప్పారావు కుమారుడు బుల్లిబాబు ఆర్థిక సహాయంతో కళాశాల ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించారు. కళాశాల సిబ్బంది కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇది విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.

  • కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ ప‌విత్ర సంగ‌మంలో జలహారతి

    AP : NTRజిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంప‌ట్నం పెర్రీఘాట్ ప‌విత్ర సంగ‌మం వ‌ద్ద కృష్ణమ్మలో క‌లిసిన ప‌ట్టిసీమ నుంచి విడుద‌ల చేసిన గోదావ‌రి జాలాల‌కు జ‌ల‌హార‌తి ఇచ్చి ప‌సుపు, కుంకుమ‌తోపాటు చీర‌, సారెల‌ను మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని శివ నాథ్, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య,  సమర్పించారు. పట్టీసీమ ద్వారా ఈ సంవత్సరం 13లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని మంత్రి నిమ్మల వెల్లడించారు.

  • ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు

    AP : ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి సన్నిధిలో ఎంతో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు రెండో రోజు బుధవారం కొనసాగుతున్నాయి. శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. శాకంబరి ఉత్సవాలు గురువారం ఉదయం 9:30కు మహా పూర్ణాహుతితో ఉత్సవం పరిసమాప్తి అవుతుంది.

  • పీహెచ్‌సీని సందర్శించిన లెప్రసీ అధికారి

    ఎన్టీఆర్ జిల్లాలో వైద్య సేవలు పర్యవేక్షణలో భాగంగా, లెప్రసీ అధికారి డాక్టర్ భాను నాయక్ ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీని సందర్శించారు. టీబీ నిర్ధారణ పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. లెప్రసీ కేసుల గురించి డాక్టర్ ఫర్హీన్‌తో చర్చించారు. సిబ్బందికి వ్యాధి నివారణ సూచనలు చేశారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల పనితీరును పరిశీలించి, సలహాలు ఇచ్చారు.

  • విస్సన్నపేటలో కార్మికుల సమస్యలపై నిరసన ర్యాలీ

    ఎన్టీఆర్: విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని మర్సకట్ల త్యాగరాజు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి నినాదాలు చేశారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించాలని సమస్యలు పరిష్కరించాలని కోరారు.

  • ఆశా వర్కర్ల నిరసన ర్యాలీ

    ఎన్టీఆర్: విస్సన్నపేటలో బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జీతాలు పెంచమని ఎన్నిసార్లు ధర్నా చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు ఆశావర్కర్లు ఆరోపించారు.

  • పట్టిసీమతో భారీ ప్రయోజనం: మంత్రి నిమ్మల

    ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గంలో పట్టిసీమ ప్రాజెక్టు గొప్పతనం గురించి మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీరందిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నీటి నిర్వహణ లోపాలతో అనేక లిఫ్ట్ స్కీమ్‌లు మూతపడ్డాయని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నీటి వనరులను సద్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

  • కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన మంత్రి నిమ్మల

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో కృష్ణమ్మకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి ఇచ్చారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు పసుపు పూలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • తిరువూరులో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

    ఎన్టీఆర్: తిరువూరులో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ కార్మికులు నినాదాలు చేశారు. ఫ్యాక్టరీ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

  • మాజీ మంత్రి జవహర్‌ను కలిసిన సుబ్బారావు

    ఎన్టీఆర్: విస్సన్నపేట టీడీపీ నూతన అధ్యక్షులు రాయల సుబ్బారావు మాజీ మంత్రి కె.ఎస్. జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జవహర్ సుబ్బారావును అభినందిస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. వారిరువురూ ప్రాంతీయ రాజకీయాలపై చర్చించారు.