Locations: Krishna

  • అంబరాన్ని తాకిన ‘శాకంబరి’ సంబరం

    ఎన్టీఆర్ జిల్లా: ఇంద్రకీలాద్రిపై ‘శాకంబరి’ సంబరం మంగళవారం అంబరాన్ని తాకింది. దుర్గమ్మ ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలైన మల్లేశ్వరాలయం, నటరాజస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఆలయాల్లో దేవతామూర్తులను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు.

  • రేపు సత్యమ్మ తల్లికి ఆశాడ మాస సారె

    ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబరుపేట సత్యమ్మ తల్లికి ఆషాడ మాస సారె సమర్పించనున్నారు. ఈ కార్యక్రమం గురువారం ఉదయం 9.30గంటలకు జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యాలయం వారు తెలిపారు. ఈ వేడుకకు జిల్లా అధ్యక్షులు ఉదయభాను సతీమణి రమాదేవి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనాలని కోరారు.

  • ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ‘జలహారతి’

    ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, పలువురు బుధవారం రైతులు గోదావరి జలాలకు హారతి ఇచ్చారు.

  • నియామకం జరగలేదు.. ‘తప్పుడు ప్రకటనలు చేస్తే చర్యలు’

    కృష్ణా: ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామ జనసేన అధ్యక్షుడిగా ఎవరినీ నియమించలేదని మండల అధ్యక్షుడు కోన రాజశేఖర్ తెలిపారు. కొందరు పార్టీ పేరును వాడుకుంటూ పదవులు పొందినట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ అనుమతి లేకుండా పదవుల గురించి ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయాన్ని జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

  • కార్మిక సమ్మె విజయవంతం చేయండి: సీఐటీయూ

    ఎన్టీఆర్: కొండపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా లేబర్ కోడ్స్‌ను రద్దును కోరుతూ 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని సీఐటీయూ మండల కార్యదర్శి మహేశ్ డిమాండ్ చేశారు. డ్రైవర్లకు ఉరితాడులా మారిన బీఎంఎస్ చట్టం రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సుందరరావు, శేషగిరి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

  • అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

    AP : విజయవాడ నుంచి అరుణాచలంకు ప్రతి బుధవారం సాయంత్రం 4:30 గంటలకు స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉందని భక్తులకు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నర్సాపూర్ – తిరువణ్ణామలై – అరుణాచల క్షేత్రానికి భక్తుల రాకపోకల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

  • రేపు ఉచిత వైద్య శిబిరం.. ఎక్కడంటే?

    ఎన్టీఆర్: ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్, ఎంజేనాయుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో రేపు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. గురువారం సూర్యారావుపేట ఎంజీ రోడ్డులోని శేషసాయి కల్యాణ మండపంలో శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • APSRTCలో ఇకపై అన్నీ విద్యుత్‌ బస్సులే

    AP : రాష్ట్రప్రభుత్వం విద్యుత్‌ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో.. ఇకపై RTCలో అన్నీ విద్యుత్‌ బస్సులనే తీసుకోవాలని పాలకవర్గం నిర్ణయించింది. వీటికోసం బస్టాండ్లలో అవసరమైన మౌలికవసతులు కల్పించాలని తీర్మానించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయనుండటంతో.. అందుకు అనుగుణంగా తగిన సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. RTCఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు అధ్యక్షతన పాలకమండలి తొలి సమావేశం విజయవాడలోని RTC హౌస్‌లో జరిగింది.

  • ‘కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.. ఇదే!’

    కృష్ణా: పెడనలో వితంతు పెన్షన్ల నిలుపుదల కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పెడన వైస్‌ చైర్మన్‌ ఖాజా ఆరోపించారు. అధికారులు పెన్షన్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి రెండు నెలలు గడిచినా లబ్ధిదారులకు డబ్బు అందలేదని ఖాజా అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వితంతువులకు పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలు ప్రభుత్వ పాలనను నమ్మే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

  • నేడు BJP రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్‌ బాధ్యతల స్వీకరణ

    AP : రాష్ట్ర BJP అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్‌ మాధవ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడలోని BJP రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇటీవలే అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్‌ .. ఎన్నిక నిర్వాహకుడు పాకా సత్యనారాయణ నుంచి ధ్రువీకరణ పత్రం, పురందేశ్వరి నుంచి జెండా అందుకొని అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.