ఎన్టీఆర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం తిరువూరు ఎంపీడీవో చిన్న రాట్నాలు, అధికారులు సమక్షంలో ఏ.కొండూరు రోడ్‌లోని ఒక రైతు తోటలో కూటమి నాయకులు మామిడి మొక్కలు నాటారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రతిఒక్క రైతు అందిపుచ్చుకొని తమ పంట పొలాలలో పండ్ల మొక్కలు నాటి తద్వారా ఆదాయం పొందాలని వారు సూచించారు.
Locations: Krishna
-
‘కూటమి ప్రభుత్వంలో పవన్‌కళ్యాణ్‌ది కీలక పాత్ర’
ఎన్టీఆర్: నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో జనసేన జెండా దిమ్మె భూమి పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి పాల్గొని జనసేన దిమ్మె నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించినటువంటి జనసేనని పవన్‌కళ్యాణ్ గౌరవ చిహ్నం అని, ఈ జనసేన జెండా దిమ్మె ఒక గౌరవ ప్రతీక ఆమె తెలిపారు.
-
‘పేదల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారు’
కృష్ణా: గూడూరులో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. పేదల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారని వైసీపీ నేతలు అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
-
పెడనలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన
కృష్ణా: పెడనలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ విస్తృతంగా పర్యటించారు. కాకర్లమూడిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలైన పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రజలకు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
తమాషాలు వేస్తే తాటతీస్తా: కలెక్టర్
ఎన్టీఆర్: గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఉద్యానవన పండ్ల తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ డా.లక్ష్మీశా పాల్గొన్నారు. రైతులకు పథకాన్ని వివరించే క్రమంలో అధికారులందరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎవరైనా వేషాలేసిన అలస్వత్వం వహించిన తాటతీస్తా అని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు మాకు చెప్పలేదంటే..సిబ్బంది నిర్లక్ష్యం వహించారని చెప్తే మాత్రం ఎఫ్ఎ,టీఏలను సస్పెండ్ చేస్తానని తమాషా కాదన్నారు.
-
‘సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడు వైఎస్సార్’
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కేతనకొండ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని కో-ఆప్షన్ సభ్యులు పఠాన్ నాగుల్ మీరా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి రాంబాబు హాజరయ్యారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శ్రీదేవి మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడు వైయస్సార్ మాత్రమే అని అన్నారు.
-
‘అధికారులు స్పందించకపోతే.. ఆత్మహత్యే శరణ్యం’
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. సొసైటీ వద్ద బాధితులు పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. పాస్ పుస్తకాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు. కోట్లు స్కాం చేసి దర్జాగా రిటైర్ అయిన కార్యదర్శి మాధవరావుపై బాధితులు ఆరోపించారు.
-
‘అగ్రస్థానంలో ఉండే ముఖ్యమంత్రి వైఎస్సార్’
ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొండితోక మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదర్శవంతమైన పరిపాలన అందించిన వారిలో అగ్రస్థానంలో ఉండే ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ అని కొనియాడారు.
-
తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ని వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు: లోకేశ్
తల్లి, చెల్లిని తరిమేసిన అధినేత జగన్ రెడ్డిని వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ప్రసన్న వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదని కనీస ఇంగితజ్ఞానం ఉండాలని ప్రసన్నకు ఆయన హితవు పలికారు. -
‘వేగం కన్నా.. ప్రాణం మిన్న’
కృష్ణా: జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, గుడివాడ ఎస్డీపీఓ దీరజ్ వినీల్ ఆదేశాలతో గుడ్లవల్లేరు ఎస్సై ఎన్‌వీవీ సత్యనారాయణ, రూరల్ సీఐ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. అంగులూరు, కవుతరం శివారులో రేడియం స్టిక్కర్లతో డ్రమ్ములు ఏర్పాటు చేశారు. ఎస్సై మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వేగం కన్నా ప్రాణం మిన్న అని తెలిపారు.